Guppedantha Manasu: వసుధారని సమస్య నుంచి గట్టెక్కించిన రిషి.. కథలోకి వస్తున్న కొత్త క్యారెక్టర్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. భార్య కి అడుగడుగునా సపోర్టిస్తున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో లెక్చరర్స్ అందరూ వసధార దగ్గరికి వచ్చి శాలరీస్ పెంచమని అడుగుతారు. అన్ని కాలేజీల కంటే మన కాలేజీలో శాలరీస్ ఎక్కువే ఇస్తున్నాము, అయినా కూడా మీరు అడిగారు కాబట్టే నేను మేనేజ్మెంట్ తో మాట్లాడి మీ డిమాండ్స్ తీరుస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అంటుంది వసుధార. ఇవన్నీ గడిచేసరికి అర్ధ సంవత్సరం దాటిపోతుంది, అప్పటివరకు మా కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలి.
అయినా మా చేత పాఠాలు చెప్పించుకోవడమే కాకుండా మిషన్ ఎడ్యుకేషన్ పనులు కూడా చేయించుకొని మా శ్రమదోపిడి చేస్తున్నారు అంటారు లెక్చరర్స్. వసుధార కొంచెం టైం అడిగినా కూడా అదంతా కుదరదు శాలరీస్ పెంచిన తర్వాతే పాఠాలు చెప్తాం అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంత సడన్గా ఇలాగ మాట్లాడుతున్నారు ఏంటి, వీళ్ళని వెనకనుంచి ఎవరైనా నడిపిస్తున్నారా అనుకుంటుంది వసుధార.
లెక్చరర్స్ లో ఇద్దరు నేరుగా శైలేంద్ర దగ్గరికి వెళ్లి మీరు చెప్పినట్టే చేసాం సర్, నిజంగా మీరు చాలా గొప్ప వాళ్ళు మా గురించి ఆలోచిస్తున్నారు అంటారు. అప్పుడు శైలేంద్ర నేను మీకోసమే ఆలోచించాను శాలరీస్ కచ్చితంగా పెంచుతారు మీరేమీ భయపడకండి అంటాడు. ఒకవేళ వాళ్ళు సీరియస్ గా తీసుకొని మమ్మల్ని జాబ్స్ నుంచి తీసేస్తే మా పరిస్థితి ఏమిటి అని భయపడుతుంది ఒక లెక్చరర్. అలా జరగకుండా నేను చూసుకుంటాను అని హామీ ఇస్తాడు శైలేంద్ర.
మీరు చాలా మంచివారు సార్, మీరు ఎండి అయితే ఇంకా బాగుండేది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు లెక్చరర్స్. ఎండి అనే మాట వినడానికి ఎంత బాగుంది అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు కారులో వెళ్తున్న రిషి వసుధారకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార వాయిస్ డల్ గా ఉండడం గమనించి ఏం జరిగింది అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది వసుధార.
ఇంటి చిన్న విషయానికే కంగారు పడిపోతే ఎలా, రేపటి రోజున ఇంకా పెద్ద పెద్ద సవాళ్లు ఎదురవుతాయి అప్పుడు ఏం చేస్తావు అయినా కంగారు పడకు నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. వెంటనే లాప్టాప్ తీసి ఏదో చేస్తాడు. ఆ తర్వాత కాలేజీకి వెళ్లి స్టూడెంట్ యూనియన్ లీడర్స్ తో మాట్లాడుతాడు. మన కాలేజీ లెక్చరర్స్ కి శాలరీ సరిపోవటం లేదంట, మానేస్తామంటున్నారు మీకు ఎడ్యుకేషన్ ముఖ్యమా? లెక్చరర్స్ ముఖ్యమా అని అడుగుతాడు.
రెండు ఇంపార్టెంట్ కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ సార్,అండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఇంపార్టెంట్ అంటారు స్టూడెంట్స్. సరే మీకోసం రిటైర్డ్ లెక్చరర్స్ పాఠాలు చెప్పటానికి వస్తున్నారు దాంతోపాటు నేను కూడా లెక్చరర్ గా జాయిన్ అవుతాను అని చెప్తాడు రిషి. అందుకు అందరూ ఆనందిస్తారు. స్టూడెంట్స్ అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత బాగా ఎమోషనల్ అవుతుంది వసుధార. రిషి ని హగ్ చేసుకుని ఇదంతా ఎందుకు చేశారు అని అడుగుతుంది.
ఒక ఎండిగా నువ్వు ఓడిపోకూడదు, నువ్వు ఎండి గా ఉన్నప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకూడదు అందుకే చేశాను అంటాడు రిషి. సీన్ కట్ చేస్తే మహేంద్ర ని చూడటానికి వస్తారు ఫణీంద్ర ఫ్యామిలి. మత్తులో ఉన్న మహేంద్ర ని చూసి బాధపడతాడు ఫణీంద్ర. వాళ్ల ఇంటికి వచ్చేయమని దేవయాని, శైలేంద్ర,ఫణింద్ర ముగ్గురు అడుగుతారు. అయితే దేవేంద్ర అందుకు ఒప్పుకోడు నావల్ల కుటుంబానికి అప్రతిష్ట అన్నారు అలాంటిది మీ ఇంటికి ఎందుకు వస్తాను అంటాడు.
రిషి కూడా వద్దులే పెదనాన్న ఆ ఇంట్లో ఉంటే అమ్మని తెలుసుకొని ఇంకా అదే లోకంలో ఉంటారు. ఇక్కడకి తీసుకు వస్తే మారుతారు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అందుకే ఆయనని బయటకు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు రిషి. నేను కూడా తోడుగా వెళ్తాను అంటుంది దేవయాని. వాళ్లు ప్రశాంతత కోసం వెళ్తున్నారు నువ్వు వెళ్తే ప్రశాంతత ఎక్కడ ఉంటుంది అని మందలిస్తాడు ఫణీంద్ర. అప్పుడు శైలేంద్రని వెళ్ళమంటుంది దేవయాని. అందుకు ఒప్పుకుంటాడు శైలేంద్ర. వాళ్ళ ఏదో ప్రశాంతత కోసం వెళ్తుంటే మీరెందుకు వెనకాతల పానకంలో పుడకలాగా అంటాడు ఫణీంద్ర.
అప్పుడు వసుధర రాబోయేవి సెలవులే కదా మేడం అందుకే వాళ్లకి తోడుగా నేను కూడా వెళుతున్నాను అంటుంది. వాళ్లని వెళ్లి రమ్మని చెప్పి తమ్ముడికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. వెనకే తల్లి కొడుకులు కూడా వెళ్ళిపోతారు. తరువాయి భాగంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేంద్ర ఫ్యామిలీ. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మహేంద్ర అని పిలుస్తుంది. నువ్వా అంటూ షాక్ అవుతాడు మహేంద్ర.