- Home
- Entertainment
- Guppedantha Manasu: సాక్షితో కారులో వెళ్లిన రిషీకి యాక్సిడెంట్.. ఏడుస్తూ అస్పత్రికి తీసుకెళ్లిన వసు!
Guppedantha Manasu: సాక్షితో కారులో వెళ్లిన రిషీకి యాక్సిడెంట్.. ఏడుస్తూ అస్పత్రికి తీసుకెళ్లిన వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత (Guppedantha Manasu) మనసు సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంతుంది. ఇక ఈ రోజు జూన్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసుధర తన పుస్తకం గురించి పుష్పను అడిగితే.. రిషీ సార్ నీ బుక్ తీసుకోని అక్కడ పెట్టామన్నారని చెప్తుంది. అయ్యో ఎందుకు ఇచ్చావ్ పుష్ప ఆ బుక్ లో అంటూ ఆగిపోతుంది. పుస్తకం తీసుకోవడానికి వెళ్లగా అప్పుడే రిషీ వచ్చి పుస్తకాన్ని చూస్తాడు.
ఆ పుస్తకంలో వసు రిషీకి సారీ సార్ సారీ సార్ అని రాసి ఉంటుంది. అది చూసి పొగరు ఏంటి ఇలా చేస్తుంది ఒక వైపు నాపైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తనకు ఇష్టం లేదని చెప్పింది.. ఇప్పుడు నేను ఏమని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు.
అంతేకాకుండా రిషీ బుక్ లో ఉన్న సారీ సార్ సారీ సార్ అని రాసిన పేపర్నీ చింపి తన జేబులో పెట్టుకుంటాడు.. అతర్వాత క్లాస్ చెప్పినంత సేపు వసుధార టెన్షన్ పడుతుంది. క్లాస్ అయిపోగానే పుష్పకు రిషీ ఆ పుస్తకం ఇస్తాడు. పిచ్చి పిచ్చి రాతలు రాసే పుస్తకాన్ని ఇంకోసారి నాకు ఇవ్వద్దు అంటూ పాపం పుష్పను తిడుతాడు.
ఇక తర్వాత సీన్ లో జగతి, మహేంద్ర అక్కడికి రాగా రిషీ పడేసిన పేపర్ చూస్తుంది. అందులో వసుధార రాసిన పేపర్ ను చూసి ప్రేమ ఉన్న నటిస్తున్నారు అని... వీళ్ళ ఇద్దరిని ఎలా అయిన కలపాలి అని ఫీక్స్ అవుతారు. ఇద్దరు టీమ్ అప్ అయ్యి ఫీక్స్ అవుతారు.
అనంతరం రిషీ వసుతో జరిగిన విషయాలు అన్ని గుర్తు చేసుకుంటాడు. రిషీ తనకు సారీ చెప్పినది ప్రతిది గుర్తు చేసుకుంటూ నాకు ఏమైంది వసుధారను నేను మర్చిపోలేకపోతున్నానా అని అనుకుంటాడు. వసుధార అంత క్లోజ్ గా ఉంది జ్ఞాపకాలు ఇచ్చింది సడన్ గా అలా చేసిందేంటని అనుకుంటాడు.
సీన్ లోకి ధరణి వచ్చి రిషీకి కాఫీ ఇస్తుంది. అనంతరం ఇలా అడగకూడదు అని నాకు తెలుసు కానీ తప్పడం లేదని రిషీ అంటూ.. ఏమైంది రిషీ ఎందుకు అంత బాధ పడుతున్నావ్ అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కాదు బాగుంది అంటూ సమాధానం ఇస్తాడు.
ఇక రిషీని కలవడానికి వచ్చిన సాక్షిని జగతి అడ్డుకుంటుంది. సాక్షి తన మూడ్ బాలేదు అంటే నేను వెళ్తే బాగుంటుంది ఏమో అని అంటుంది.. నిన్ను చూస్తేనే రిషీకి చిరాకు అంటుంది. అది మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని అంటుంది. అప్పుడే దేవయాని సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి సాక్షి కాబోయే భార్య అని అంటుంది.
అప్పుడు జగతి సీరియస్ అయ్యి ఎం మాట్లాడుతున్నారు నా కొడుకు గురించి మీరు అనుకోవడం ఏంటి అని సీరియస్ లుక్ ఇస్తుంది. దాంతో దేవయాని కూడా బయపడుతుంది. ఇక అప్పుడే రిషీ ఎంట్రీ ఇస్తాడు.. జగతి దేవయానిని ఒకింత బయపెట్టేస్తుంది.
సాక్షి నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అంటూ
అడుగుతాడు. అప్పుడు దేవయాని మన అమ్మాయి అనగా మన కాదు అంటాడు. దీంతో సాక్షి వెళ్ళిపోతుంది.. అతర్వాత దేవయాని, జగతి ఇద్దరు మాటల యుద్ధం చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో వసుధారని సాక్షులు కలుస్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి..