Guppedantha Manasu: మీటింగ్‌లో వసుపై రెచ్చిపోయిన సాక్షి.. పనిష్మెంట్ ఇచ్చిన రిషి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 26 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ (Gautham) నడుచుకుంటూ వెళ్తూ ఉండగా సాక్షి ఎదురు పడటంతో హలో సాక్షి గారు మీతో ఒక విషయం మాట్లాడొచ్చా అని అడిగి ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా మాట్లాడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అప్పుడు సాక్షి (sakshi)మళ్లీ వెనక్కి పిలిచి తెలివిగా మాట్లాడడంతో వెంటనే గౌతమ్ తగిన విధంగా కౌంటర్ నుంచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వాచ్మెన్ వసు బ్యాగ్ తీసుకుని వస్తూ ఉండగా ఇందులో రిషి ఎదురుపడతాడు.
ఆ తర్వాత రిషి(Rishi),క్లాసు రూమ్ కీ వెళ్ళి వసు బ్యాగులో ఉన్న చాక్పీస్ లు చూసి ఏం జరుగుతుంది ఏం చేస్తోంది అని అనగా ఇంతలోనే వసు అక్కడికి వచ్చి ఏంటి పుష్ప ఇంకా రిషి సార్ రాలేదా అంటూ రిషి సార్ టైం పంచువాలిటీ ఏమీ లేదా ఈరోజు నేనే రిషి సార్ కి పనిష్మెంట్ ఇస్తాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వచ్చి వసుధార(vasudhara)ని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటాడు.
అప్పుడు రిషి(rishi) ఆ బొమ్మని చెరిపిస్తూ ఉండగా అప్పుడు వాసు వద్దు సార్ వద్దు సార్ అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి వసు నీ పిలిచే చదువుల పండుగ గురించి అందరికీ చెప్పమని చెబుతాడు. అప్పుడు వసు(vasu)వచ్చి రిషి పక్కన నిలబడిన తర్వాత ఆ బొమ్మని చెరిపేయ్ అని చెబుతాడు. ఆ తర్వాత రిషి తన క్యాబిన్ కి వెళ్ళి వసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు వస్తుంది. ఆ తర్వాత రిషి చదువుల పండుగకు సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ ని వసుధారకి ఇస్తాడు.
తర్వాత వారిద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత చదువుల పండుగ ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు. మరొకవైపు జగతి(jagathi) దగ్గర సాక్షి పనిచేస్తూ ఉండగా అప్పుడు వారిద్దరూ రిషి విషయం గురించి వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి, (rishi)సాక్షి విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడగా వెంటనే జగతి సాక్షికి తగిన విధంగా బుద్ధి చెబుతూ ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సెన్సే లేదు, బేసిక్ సెన్స్ లేదు అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
కానీ సాక్షి మాత్రం జగతి(jagathi)మాటలు పట్టించుకోదు. ఆ తర్వాత అందరూ కలిసి మీటింగ్ కీ వెళ్తారు. ఆ తర్వాత విషయం చదువుల పండుగ గురించి మాట్లాడుతూ వసు కు ఇచ్చిన పెన్ డ్రైవ్ గురించి అడగగా వాసు బ్యాగ్ మొత్తం వెతికిన కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ లేదు అని చెబుతుంది. అప్పుడు సాక్షి (sakshi)అదే మంచి అవకాశం గా భావించి వసు మీద లేనిపోని మాటలు చెప్పి రిషినీ రెచ్చగొడుతుంది.
రెస్పాన్సిబులిటీ లేని వాళ్ళని పెట్టుకుని చదువుల పండుగ ఎలా చేస్తావు అంటూ వసుధార(vasu)పై లేనిపోని మాటలు చెబుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు సాక్షి మాటలు విన్న రిషి(rishi)కూడా వసుధారకి పనిష్మెంట్ ఇస్తాను మేడం తో జగతి దంపతులు షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో వసు, పెన్ డ్రైవ్ పోగొట్టినందుకు రిషి, వసుధారపై సీరియస్ అవుతాడు. అప్పుడు నాదే తప్పు అని వసుధర ఎమోషనల్ అవడంతో రిషి వెళ్లి వసు కన్నీళ్ళను తుడుస్తాడు.