MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: చావుబతుకుల్లో ఉన్న జగతి.. మహేంద్ర ఇంట్లో మోగనున్న పెళ్లిభాజాలు!

Guppedantha Manasu: చావుబతుకుల్లో ఉన్న జగతి.. మహేంద్ర ఇంట్లో మోగనున్న పెళ్లిభాజాలు!

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టీఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు ప్రాణాలకి తన ప్రాణాలు అడ్డేసిన ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : Oct 02 2023, 07:46 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

ఎపిసోడ్ ప్రారంభంలో వసుధారని క్షమించమని అడుగుతుంది జగతి. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మేడం, మీరు మా మంచి కోసమే చేశారని తెలుసు కానీ రిషి సార్ దూరమయ్యారనే బాధలో మిమ్మల్ని  దూరం పెట్టాను నిజానికి మీరు నన్ను క్షమించాలి అంటుంది వసుధార. నీ ప్లేస్ లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు అంటుంది జగతి. కానీ నేను అలా ప్రవర్తించకూడదు మేడం. మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు.
 

28
Asianet Image

 బాధపడినప్పుడు ఓదార్చారు, సంతోషించినప్పుడు చప్పట్లు కొట్టారు కానీ నేను మాత్రం మిమ్మల్ని దూరం పెట్టాను అంటుంది వసుధార. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు జరగవలసింది మీ ఇద్దరి పెళ్లి. నా వల్లే మీ ఇద్దరూ దూరమైపోయారు నా వల్లే మీ ఇద్దరు కలవాలి. నేను ఇక బ్రతకనని అర్థమయిపోయింది. అందుకే రిషి ని నువ్వే చూసుకోవాలి, అతని మీద పడిన మచ్చని నువ్వే చెరిపేయాలి.
 

38
Asianet Image

 ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అంటుంది జగతి. సీన్ కట్ చేస్తే జగతిని తీసుకొని ఇంటికి వెళ్తారు మహేంద్రవాళ్లు. రిషి ఇంట్లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడతాడు. కానీ వసుధార రిషి ని ఒప్పించి ఇంట్లోకి వచ్చేలాగా చేస్తుంది. అప్పుడు కొడుకు సైగ చేయడంతో దేవయాని ఇప్పుడు ఈ పెళ్లి ఇంత అర్జెంటుగా చేయడం అవసరమా? జగతి కోలుకున్నాక పదిమంది ముందు ఘనంగా చేద్దాం  అంటుంది. ఇప్పుడే చేయాలి అంటుంది జగతి.
 

48
Asianet Image

 రిషి కూడా జగతికి సపోర్ట్ చేస్తాడు. దేవయాని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఫణీంద్ర మందలిస్తాడు.  ఆ తర్వాత అక్కడినుంచి గదిలోకి వెళ్తారు తల్లి కొడుకులు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఫణీంద్ర. మనం చంపుదాం అనుకున్న మనిషి పెళ్లి మనమే దగ్గరుండి చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటూ ఫ్రెష్టేట్  అవుతాడు. నేను కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు నాన్న, ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూసే బాధ్యత నీదే అంటుంది దేవయాని.
 

58
Asianet Image

అలాగే చేస్తాను కానీ నేను ఏం చేసినా నువ్వేమీ మాట్లాడకూడదు అంటూ తన ప్లాన్ వివరిస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత ధరణి వాళ్ళు పెళ్లి పనులు చక్కబెడుతూ ఉంటారు వాటిని చూస్తూ ఆనందపడుతుంది జగతి. అది చూసిన దేవేంద్ర ఎందుకు బయటకు వచ్చావు స్ట్రైన్ అవుతావు అంటాడు. లేదు మహేంద్ర నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది జగతి. సరే రిషి రెడీ అయ్యాడో లేదో చూసి వస్తాను అని చెప్పి రిషి దగ్గరికి వెళ్తాడు మహేంద్ర.
 

68
Asianet Image

ఆ తర్వాత దేవయాని జగతి దగ్గరికి వచ్చి జ్యూస్ తీసుకురమ్మని అక్కడ ఉన్న నర్స్ ని పంపించేస్తుంది. ఆ తర్వాత ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా..  రిషి నిన్ను అమ్మ అని పిలిచినందుకు చాలా ఆనంద పడుతున్నట్లు ఉన్నావు.అదంతా నీ మీద జాలి తోనే కానీ ప్రేమతో కాదు, వాడికి ఈ పెద్దమ్మ అంటేనే ప్రాణం అంటుంది. మీరు ఎన్ని చేసినా తల్లి కొడుకుల బంధాన్ని విడగొట్టలేరు. మీ నిజస్వరూపం తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అంటుంది జగతి.
 

78
Asianet Image

 ఇంతలో నర్స్ జ్యూస్ తీసుకురావడంతో ఆ జ్యూస్ తాగుతుంది జగతి. మరోవైపు రిషి తన తండ్రితో ఈ సూటు మీకు ఎవరు ఇచ్చారో నాకు తెలుసు అంటాడు. అవును నాన్న నీకు మీ అమ్మ అంటే ఇష్టం అని నాకు తెలుసు కానీ నువ్వే ఆ ప్రేమని బయట పెట్టలేకపోయావు అంటాడు మహేంద్ర. ఇకపై అమ్మ ఎప్పుడు మనతోనే ఉండాలి నాన్న, తనని బాగా చూసుకుందాం అంటాడు రిషి. అలాగే నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కానీ అమ్మ మీద బెంగతో నువ్వు ఇలా డల్ గా కనిపిస్తే తను మరింత కంగారు పడుతుంది.
 

88
Asianet Image

 అందుకే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్తాడు మహేంద్ర. మరోవైపు వసుధారని రెడీ చేస్తూ ఉంటుంది ధరణి. మా ఆయన చేసిన పనులకు నాకు చాలా బాధగా ఉంది అంటుంది. అందరి మధ్యలో జరగవలసిన పెళ్లి కేవలం నలుగురు మధ్యలోనే జరుగుతుంది నీకు బాధగా లేదా అంటుంది. బాధ ఎందుకు, నాకు కావాల్సింది రిషి సార్ ప్రేమ అదే దక్కుతుంది అంటుంది వసుధార. నువ్వుంటే ఇప్పుడు ఎంతో ఆనందపడే దానివి అంటూ తల్లిని తలుచుకొని బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories