- Home
- Entertainment
- Guppedantha Manasu: జగతి మరణం వెనుక నిజం తెలుసుకుంటానంటున్న రిషి.. భయంతో వణికిపోతున్న దేవయాని!
Guppedantha Manasu: జగతి మరణం వెనుక నిజం తెలుసుకుంటానంటున్న రిషి.. భయంతో వణికిపోతున్న దేవయాని!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ తో మంచి కంటెంట్ తో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తల్లిని చంపిన వాళ్లని వదిలిపెట్టనంటున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఈరోజు అక్టోబర్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో చితి మీద పడుకోబెట్టిన జగతి చెవిలో అందరూ లేవమని చెప్తారు. కానీ శైలేంద్ర మాత్రం నేను చెప్పినట్టు విని ఉంటే హాయిగా కొడుకుతో కలిసి ఉండే దానివి. ఇప్పుడు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నావు. రెస్ట్ ఇన్ హెల్, నీకు అక్కడ కూడా శాంతి దొరకకూడదు అని చెవిలో చెప్పి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత రిషి తల్లికి తలకొరివి పెడతాడు. అందరూ బాగా ఎమోషనల్ అవుతారు.
ఆ తర్వాత తండ్రిని ఒడిలో పడుకోబెట్టుకుని తల్లి గురించి ఆలోచనలో పడతాడు రిషి. అంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. సార్ పడుకున్నారా అని అడుగుతుంది. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకున్నారు. ఈరోజుకి నేను డాడీ దగ్గర పడుకుంటాను అంటాడు రిషి. మరి నీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. మీరు ఇక్కడే ఉండండి సార్, మీ అవసరం సార్ కి ఉంది. నాకు మా నాన్నగారు తోడున్నారు. అవసరమైతే పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకొని ఆపుతాడు రిషి.
నీ అవసరం నాకు ఇప్పుడే ఉంది వసుధార. మనసంతా చాలా భారంగా ఉంది. ఏదో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అమ్మ నాకు ఏదో చెప్పాలని చాలా ప్రయత్నించింది, కానీ మొండితనంతో నేనే వినలేదు. మా అమ్మని నా నుంచి దూరం చేసింది ఎవరో చెప్పు వసుధార. వాళ్ళు ఎవరైనా సరే విడిచి పెట్టేది లేదు. వాళ్ళు ఎవరో తెలుసుకొని తీరుతాను, అందుకు నీ సహాయం నాకు కావాలి అంటాడు రిషి.
మీరు అడగకపోయినా నా సహాయం మీకు ఉంటుంది. కానీ ఇప్పుడప్పుడే కాదు ముందు మనసులో ఉన్న భారాన్ని దించుకోండి. మహేంద్ర సార్ కి మీ అవసరం ఉంది ఆయన పక్కనే ఉండండి. కొంచెం టైం తీసుకుని పని ప్రారంభిద్దాం అంటుంది వసుధార. మరోవైపు జగతి ఫోటో చూస్తూ ఉంటుంది దేవయాని. ఏంటి మమ్మీ పిన్ని చనిపోయినందుకు బాధపడుతున్నావా అంటాడు శైలేంద్ర.
అదంతా మానవత్వం ఉన్న వాళ్ళకి, మనకి అది లేదు కదా నేను బాధపడటం లేదు భయపడుతున్నాను. పెద్ద చేపను ఎరేస్తే ఈ చిన్న చేప దొరికింది. రేపటి రోజున రిషికి నిజం తెలిస్తే ఊరుకోడు. అప్పుడే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశాడు అంటుంది. నువ్వేమీ టెన్షన్ పడకు మమ్మీ అవసరమనుకుంటే వాడిని కూడా లేపేస్తాను అంటాడు శైలేంద్ర. అప్పుడే సడన్గా జగతి ఫోటో దగ్గర ఉన్న దీపాలు ఆరిపోతాయి. భయపడిపోతుంది దేవయాని. ఇదేంటి ఇలా జరిగింది చచ్చి కూడా సాధిస్తుందా అంటుంది.
అలాంటిదేమీ జరగదు మమ్మీ గాలికి దీపాలారిపోయాయి అంతే నువ్వేమీ భయపడకు అని చెప్తాడు శైలేంద్ర. ఆ తరువాత దిగులుగా కూర్చున్న మహేంద్ర దగ్గరికి టిఫిన్ తీసుకొని వస్తాడు రిషి. తండ్రికి తినిపించబోతే నాకు వద్దు, తినాలనిపించడం లేదు. జగతి ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడు ఎప్పటికైనా మేం కలుస్తామని ఆశ ఉండేది. ఇప్పుడు నన్ను పూర్తిగా వదిలి వెళ్ళిపోయింది. నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది అని బాధపడతాడు మహేంద్ర.
తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని తల్లి తన దగ్గర తీసుకున్న విషయం తండ్రికి గుర్తు చేస్తాడు రిషి. అయినా తినడానికి ఒప్పుకోడు మహేంద్ర. అప్పుడు వసుధార తినండి సార్ లేకపోతే రిషి సార్ కూడా తినరు. మీ ఇద్దరూ తినకపోతే జగతి మేడం బాధపడతారు అంటుంది. అప్పుడు రిషి చేత్తో ఒక ముద్ద తిని ఇక తినలేక అక్కడినుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఇదంతా చూస్తున్నా చక్రపాణి బాగా ఎమోషనల్ అవుతాడు.
భగవంతుడా ఏమిటయ్యా నీ లీల, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయలేదని నా సుమిత్ర ని తీసుకువెళ్లిపోయావు, ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి టీచరమ్మని తీసుకెళ్లిపోయావు. మేమంటే నీకు ఎందుకు అంత కక్ష అని కన్నీరు పెట్టుకుంటాడు. ఆ తర్వాత జగతి గురించి బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటారు మహేంద్ర వాళ్లు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.