Guppedantha Manasu: ఇంట్లోంచి వెళ్లిపోయి దేవయానికి షాకిచ్చిన రిషి ఫ్యామిలీ.. తప్పంతా తల్లిదే అంటున్న శైలేంద్ర
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ తో కొనసాగుతూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తండ్రికి అవమానం జరిగిందని ఇంట్లోంచి తీసుకొని బయటికి వెళ్లిపోయిన ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ డైనింగ్ హాల్ దగ్గర కూర్చుంటారు. అక్కడ మహేంద్ర లేకపోవడంతో మహేంద్ర ఏడి అని అడుగుతాడు ఫణీంద్ర. ఇంట్లో వాళ్ళందరూ తెలీదు అంటారు. పదండి వెళ్లి వెతుకుదాం అంటాడు ఫణీంద్ర. ఆయన ఎక్కడ ఉంటారో నాకు తెలుసు నేను వెళ్లి తీసుకు వస్తాను అని రిషి అంటుండగానే తూలుతూ ఇంట్లోకి వస్తాడు మహేంద్ర. పడిపోతున్న తండ్రిని పట్టుకుంటాడు రిషి.
నన్ను పట్టుకున్నావా.. నేను కష్టం లో ఉన్నప్పుడు నా వెనుక నువ్వు ఉంటావని నాకు ధైర్యం అని కొడుకుని ముద్దు పెట్టుకుంటాడు మహేంద్ర. నేను తాగానని అమ్మకి చెప్పొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. సరే డాడీ చెప్పను పదండి రూమ్ కి వెళ్దాం అని అక్కడినుంచి వెళ్లబోతుంటే శైలేంద్ర తల్లికి సైగ చేస్తాడు. అప్పుడు దేవయాని మాట్లాడుతూ ఏం చేస్తున్నావ్ మహేంద్ర నీ గురించి నువ్వేమైనా పట్టించుకుంటున్నావా, అయినా తాగి ఇంటికి రావటం ఏమిటి అంటుంది.
తాగాలి వదినగారు మన చుట్టూ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పుడు, అలాంటి పరిస్థితులలో మనం ఏమి చేయలేనప్పుడు మనం చేయవలసిన పని తాగడమే. అప్పుడు వచ్చే మత్తు ఎంత బాగుంటుందంటే మన ప్రాణాలు పోయే అంత బాగుంటుంది. నాకు కావాల్సింది అదే అంటాడు మహేంద్ర. అయినా చెట్టంత కొడుకుని ఇంట్లో పెట్టుకొని తాగేసి రావటానికి నీకు ఇబ్బందిగా అనిపించట్లేదా రిషి చూడు ఎంత బాధ పడుతున్నాడో అంటుంది.
పెదమ్మ నా గురించి మీరేమీ బాధపడకండి, మీరు ఏమి చెప్పినా డాడ్ వినే పరిస్థితిలో లేరు ఇప్పుడేమీ మాట్లాడకండి అంటాడు రిషి. ఫణీంద్ర కూడా భార్యని నోరు మూసుకోమని చెప్తాడు అయినా వినదు దేవయాని. నన్ను అంటారేంటి, పెద్దదాన్ని మంచి చెప్తే తప్పు వచ్చిందా అయినా ఇలా తాగి తందనాలు ఆడితే ఇంటి పరువు ఏమవుతుంది ఇలా అయితే నేను ఇంట్లో ఉండలేను అంటుంది దేవయాని.
ఆ మాటలకి కోప్పడతాడు రిషి. ఇంట్లోంచి వెళ్లిపోవాల్సింది మీరు కాదు, మేమే వెళ్ళిపోతాము అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రిషి అదేదో సోది మొఖం ది అలాగే మాట్లాడుతుంది నువ్వు పట్టించుకోకు అంటాడు ఫణీంద్ర. లేదు పెదనాన్న నేను చెప్తూనే ఉన్నాను అయినా పెద్దమ్మ వినట్లేదు. ఆయన బాధ తగ్గే వరకు ఆయన ఆ వ్యసనాన్ని మానలేరు. అందుకని ఒక కొడుకుగా నేను ఆయనని వదులుకోలేను కదా, నా తండ్రికి అవమానం జరిగిన ఇంట్లో నేను ఉండలేను అంటూ వసుధారకి లగేజ్ సర్దమని ఆర్డర్ వేస్తాడు.
శైలేంద్ర కూడా ఏమీ ఎరగని వాడిలాగా అమ్మ మాటలు పట్టించుకోవద్దు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. దేవయాని కూడా ఇప్పుడు నేనేమన్నానని ఏదో మహేంద్ర కి నాలుగు మంచి మాటలు చెప్పాను అంతే కదా అంటుంది. అయినా కూడా వినిపించుకోకుండా మహేంద్ర ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతారు రిషి దంపతులు. తల్లి దగ్గరికి వెళ్లిన శైలేంద్ర ఏంటి మమ్మీ ఇలా చేసావు, ఇప్పుడు వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారు, ఇక్కడ ఉంటే వసుధార వేసే ఎత్తుగడలు మనకి తెలిసేవి అంటాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన ఫణీంద్ర నీ నోరు తిన్నగా ఉండదు, అప్పుడు జగతిని ఇంట్లోంచి పంపించడానికి కారణమయ్యావు,ఇప్పుడు వీళ్లు ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం అయ్యేవు అని కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి అందరూ కలిపి నన్నే అంటున్నారు, వాళ్ళు ఏమైనా ఇంట్లోంచి వెళ్ళిపోతారని నేను అనుకున్నానా అనుకుంటుంది దేవయాని. వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయి సుఖపడతారు అని మనసులో అనుకుంటుంది ధరణి.
మరోవైపు వేరే ఇంటికి వెళ్తారు రిషి వాళ్ళు, ఈ ఇల్లు ఎవరిది అని అడుగుతుంది వసుధార ఈ ఇల్లు డాడీది, ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ఇక్కడికి వస్తారు అంటాడు రిషి. ఇంతలో మత్తులో ఉన్న మహేంద్ర జగతిని కలవరిస్తూ మంచినీళ్లు అడుగుతాడు. తండ్రికి మంచినీళ్లు తాగించి ఈయన తాగుడు నుంచి తప్పించుకోవాలంటే ముందు మనసులో ఉన్న బాధని తగ్గించాలి అంటాడు రిషి. తప్పకుండా ఆయన మామూలు మనిషి అవుతారు అని రిషికి ధైర్యం చెప్తుంది వసుధార.