Guppedantha Manasu: వసుధారకి ఆల్ ద బెస్ట్ చెప్పిన రిషి.. ఎండి సీట్ లో కూర్చోబోతున్నది ఎవరు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. భార్య చనిపోయిన తనకు ఎలాంటి పదవులు వద్దంటున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో మనం కూడా రెండు దండలు రెడీ చేసుకుందాం అని కొడుకుతో చెప్తుంది దేవయాని. అదేంటి మమ్మీ అలా అంటావ్ అంటాడు శైలేంద్ర. అవును నాన్నా, రిషి పట్టుదల చూస్తే వాడు అనుకున్నదంతా చేసేలాగా ఉన్నాడు అంటుంది. వాడి మొహం వాడేం చేస్తాడు అంటాడు శైలేంద్ర. వాడిని తక్కువ అంచనా వేయకు ఏ పనైనా చేయగల సమర్థుడు అంటుంది దేవయాని.
ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం అంత సమర్ధుడు కాదు ఎందుకంటే వాడి పక్కన పిన్ని లేదు అయినా నాకు ధైర్యం చెప్పవలసింది పోయి నన్ను భయపడేలా చేస్తున్నావ్ ఏంటి అంటాడు శైలేంద్ర. మరోవైపు ఇంత జరిగినా కూడా ఇంకా రిషికి నిజం చెప్పకపోవడం ఏమీ బాగోలేదు, ఇప్పటికైనా నిజం చెబుదాం అంటుంది ధరణి. ఏమని చెప్తారు, చెప్పిందానికి సాక్ష్యాలు అడుగుతారు, మనం ఏ సాక్ష్యాలు చూపిస్తాం అంటుంది వసుధార.
మా ఆయన ఎవరికో డబ్బులు ఇవ్వడం నేను చూశాను, అదే విషయాన్ని గట్టిగా చెప్తాను అంటుంది ధరణి. వాళ్లు అంతకంటే గట్టిగా మాట్లాడుతారు. మన దగ్గర సరైన సాక్షాలు లేనంతవరకు మనం మాట్లాడకపోవడమే మంచిది. అలా అని ఊరుకోకుండా నిజం తెలిసే విధంగా పావులు కదుపుతూ ఉంటాను, అంతవరకు మీరు ఓపిక పట్టండి అని ధరణికి చెప్తుంది వసుధార.
ఆ తర్వాత వసుధార మహేంద్రని తీసుకువచ్చి హాల్లో కూర్చోబెడుతుంది. మహేంద్ర మనం ఒకసారి కాలేజీకి వెళ్ళాలి అక్కడ జగతికి సంతాప సభ పెడతారు అంటాడు ఫణీంద్ర. నాకు ఎక్కడికీ రావాలని లేదు అన్నయ్య, నాకు దేని మీద ధ్యాస లేదు అంటాడు మహేంద్ర. అలా అంటావేంటి అక్కడ జరిగేది జగతి సంతాప సభ, నువ్వు లేకపోతే ఎలా అంటాడు ఫణింద్ర. అవును డాడీ మీరు వెళ్లకపోతే బాగోదు, వెళ్లండి అంటాడు రిషి.
అదేంటి రిషి అలా అంటావు, డాడీ వెళ్ళటమేంటి నువ్వు రావా అంటాడు ఫణీంద్ర. నేను రాలేను నా తరఫున వసుధార వస్తుంది అంటాడు రిషి. ఆయన ఎందుకు రాను అంటున్నారో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఎలా రావాలో ఆయనకి తెలుసు అంటుంది వసుధార. ఆ తర్వాత తన గదిలో బాధపడుతూ కూర్చుంటాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార మీరు అలా బాధపడుతూ కూర్చుంటే మేడం చేసిన త్యాగానికి అర్థం ఉండదు.
మీరు బాధపడకండి, మీరు చెప్పినట్లే నేను కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది వసుధార. అపనిందలతో నేను ఆ కాలేజీలో అడుగు పెట్టలేను. అలా అని ఇంతకుముందు లాగా మిమ్మల్ని మీరే నా ప్రాణాలు తీసేశారు అనలేను, ఎందుకంటే నా ప్రాణాలు కాపాడటం కోసమే మీరు ఆ పని చేశారని అర్థమైంది అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార భర్త కాళ్ళకి నమస్కరించబోతుంటే ఏంటిదంతా అని అడుగుతాడు రిషి.
ఇప్పుడు నేను మిస్సెస్ రిషీంద్రభూషణ్, ఒక భార్యకి భర్త ఆశీర్వచనమే గొప్ప బలం అంటూ అక్కడి నుంచి వెళ్లబోతుంది. అప్పుడు రిషి ఆమె మర్చిపోయిన ఫోన్ ఆమెకి ఆగమని చెప్పి మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మనల్ని కమ్యూనికేట్ చేసేది ఇదే దీన్ని మర్చిపోతే ఎలా అని ఫోన్ ఆమె చేతిలో పెట్టి ఆమెకి ఆల్ ద బెస్ట్ చెప్తాడు. ఆల్ ద బెస్ట్ నాకు మాత్రమే కాదు మన ఇద్దరికీ కలిపి చెప్పండి.
ఎందుకంటే ఏది పొందినా అది ఇద్దరికీ చెందాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కాలేజీలో జగతికి సంతాప జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో రిషి ఇంటి దగ్గర తల్లిని తలచుకుని బాధపడుతూ ఉంటాడు. ఒక కొడుకుగా నీకు ఎలాంటి తీపి గుర్తులు ఇవ్వలేకపోయాను. వచ్చే జన్మలో అయినా నీ కొడుకుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను అనుకుంటాడు రిషి.
ఆ తర్వాత కాలేజీలో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎండి పోస్ట్ కి ఎవరు అయితే బాగుంటారో చెప్పండి అని మీటింగ్ లో ఉన్న వాళ్ళని అడుగుతాడు ఫణీంద్ర. ఎవరు ఏమి మాట్లాడకపోవటంతో నాకైతే మహేంద్ర ఆ సీట్ కి అర్హుడనిపిస్తుంది అంటాడు ఫణీంద్ర. అదేంటి ఎండి సీటు ఇప్పుడు కూడా నాకు దక్కదా అనుకొని కంగారు పడతాడు శైలేంద్ర. మహేంద్ర ఈ ప్రపోజల్ కి ఒప్పుకోకూడదు అనుకుంటుంది దేవయాని.
వాళ్లు అనుకున్నట్లుగానే మహేంద్ర నాకు ఎలాంటి పదవులు మీద ఆశ లేదు ఇన్ఫాక్ట్ నాకు అసలు ఈ మీటింగ్ లో కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి నన్ను మన్నించండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మహేంద్ర మాటలకి ఆనందపడతారు దేవయాని, శైలేంద్ర. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.