Guppedantha Manasu: జగతికి షాకిచ్చిన వసు.. దెబ్బకు హాస్పిటల్ పాలైన సుమిత్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తను నమ్మిన వాళ్లే తనకి నమ్మకద్రోహం చేయడంతో మానసిక వ్యధ అనుభవిస్తున్న ఒక వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 29 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇన్నాళ్లు రిషిధారగా ఉన్న మన బంధాన్ని ముక్కలు చేశావు ఇకపై మిగిలింది వసుధార మాత్రమే అంటూ తన వీఆర్ ఉంగరాన్ని వసు చేతిలో పెడతాడు రిషి. నిజం చెప్పకపోవడం నా తప్పే మరెప్పుడు ఇలా చేయను నన్ను క్షమించండి దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకండి అంటూ ఏడుస్తూ బ్రతిమాలుతుంది వసు. నా లైఫ్ లో నేను ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నాను వాళ్ళ వల్లే ఇబ్బందులు పడుతున్నాను.
నాకు ఈ బంధాలు సరిపడవు దయచేసి నన్ను వదిలేయ్. నిజంగా నేనంటే ప్రేమ అభిమానాలు ఉంటే నా వెంట పడొద్దు జీవితంలో మళ్లీ నేను నీకు కనిపించను నన్ను మనిషిగా చంపేశారు అని కన్నీరు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. వసు ఎంత బ్రతిమలాడినా వినిపించుకోడు. వసుని ఓదార్చుతున్నట్లుగా ఆమె భుజం మీద చేయి వేస్తుంది జగతి.
నన్ను ముట్టుకోవద్దు అంటూ చీదరించుకుంటుంది వసు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. నిజాన్ని దాచిపెడితే ఆయన భరించలేరని ముందే చెప్పాను.. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. మా ప్రేమకి కారణం మీరే అలాగే మా ప్రేమ విడిపోవడానికి కూడా కారణం మీరే అంటూ జగతిని మందలిస్తుంది. నేను ఎందుకు ఇలా చేశానో నీకు తెలుసు కదా అయినా నేనేం చేసినా మీకోసమే అని ఏడుస్తుంది జగతి.
ప్రయోజనం ఏముంది మేడం ఇప్పుడు చూడండి సర్ జీవితంలో నేను లేకుండా పోయాను అందుకు సాక్ష్యం ఇదే అంటూ ఉంగరం చూపిస్తుంది వసు.రిషి సార్ లేకుండా నేను ఉండలేను ఆయనలాగే నేను కూడా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను దయచేసి నన్ను జీవితంలో కలవడానికి ప్రయత్నించండి. నన్ను గురుదక్షిణ అడిగి నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు అంటూ ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు.
జరిగిందానికి జగతి బాధతో కన్నీరు పెట్టుకుంటుంది. మరోవైపు ఇంటికి వచ్చిన కూతుర్ని ఆనందంగా పలకరిస్తుంది సుమిత్ర.కానీ కూతురి కన్నీరు చూసి కంగారు పడుతుంది. ఏం జరిగిందో చెప్పమంటూ నిలదీస్తుంది. అందరూ బానే ఉన్నారా కట్టుబట్టలతో వచ్చేసావేంటి మళ్లీ ఏమైనా సమస్యా అని ప్రశ్నిస్తుంది. రిషి సార్ జీవితంలో నేను లేను అంటూ బోరున ఏడుస్తుంది వసు. ఒక్కసారిగా షాకైన సుమిత్ర అసలు ఏం జరిగింది.
ఆరోజు జగతి మేడం కూడా విచిత్రంగా ప్రవర్తించారు ఈరోజు నువ్వు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. జరిగిందంతా చెప్తుంది వసు. ఆయనకి నమ్మకద్రోహం చేశాను కానీ ఆయన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే అలా చేశాను. ఆయన కాబట్టి శిక్ష ఆయనకే వేసుకుని వెళ్లిపోయారు మరొకరు అయితే ఊరుకునేవారు కాదు అంటూ ఏడుస్తుంది వసు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు.
ఒకసారి పెళ్లి పీటల మీద నుంచి పారిపోయావు మరోసారి నీ మెడలో నువ్వే తాళం వేసుకున్నావు ఇప్పుడు ఇలా రిషి సార్ కి నమ్మకద్రోహం చేశావు ఎందుకు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అంటుంది సుమిత్ర. నా కూతురు జీవితం ఎందుకిలా అయిపోతుంది దేవుడా అంటూ గుండె పట్టుకొని కింద పడిపోతుంది. సరిగ్గా అదే సమయానికి చక్రపాణి కూడా వస్తాడు. భార్యని అలా చూసి కంగారు పడుతాడు. అమ్మకి గుండెపోటు వచ్చినట్లుగా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని వసు అనడంతో సుమిత్ర ని హాస్పిటల్ తీసుకువెళ్తారు చక్రపాణి, వసు.
మరోవైపు ఒక చిన్న టీ స్టాల్ లో టీ తాగుతూ ఉంటాడు రిషి. అక్కడ ఒక చిన్న అబ్బాయికి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక పోతాడు. దానిని సాల్వ్ చేసి చూపిస్తాడు రిషి. ఆ బాబు సంతోషిస్తాడు. టీ తాగిన తర్వాత టీ యజమానికి డబ్బులు ఇవ్వకపోతే వద్దు మా బాబుకి చదువు చెప్పారు అదే సంతోషం అంటాడు షాపతను. అది నా బాధ్యత అంటాడు రిషి. ఇంత బాగా మాథ్స్ చెప్పారు మీరు స్కూల్ టీచరా..కాలేజీ లెక్చరరా అని అడుగుతాడు బాబు. మోసగాడిని అంటాడు రిషి. అక్కడ ఉన్న అందరూ షాకవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.