Guppedantha Manasu: మహేంద్ర జీవితంలోకి అనుపమ ఎంట్రీ.. కన్ఫ్యూజన్ లో రిషి, వసు!
Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. భార్య పోయిన బాధలో జీవితాన్ని పోగొట్టుకుంటున్న భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఈరోజు ఎపిసోడ్ లో తాగిన మైకంలో మహేంద్ర ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ, తిరుగుతూ ఒక దగ్గర తన పర్స్ పడేసుకుంటాడు. అక్కడ ఫోటోలు తీస్తున్న ఒక ఆవిడ ఆ పర్సు చూసి మహేంద్ర ని పిలుస్తుంది కానీ మైకంలో ఆ మాటలు వినిపించుకోడు మహేంద్ర. నడుస్తూ, నడుస్తూ వెళ్లి ఒక దగ్గర కూర్చుంటాడు. అక్కడ ఒకప్పుడు చెక్కిన జగతి, మహేంద్ర పేర్లు కనిపిస్తాయి.
చూసావా జగతి నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూసావా.. రిషి నాకోసం బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అలా అని నిన్ను మర్చిపోలేక పోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటాడు. చెక్కిన ఆ పేర్లని తడుముతూ ఉంటే కిందన మరొక పేరు కనిపిస్తుంది. ఆ పేరు అనుపమ. ఒక్కసారిగా గతంలోకి వెళ్తాడు మహేంద్ర.
ఇంతలో మహేంద్ర అనే పిలుపు వినిపిస్తుంది. తల తిప్పి చూసేసరికి ఎదురుగా అనుపమ వుంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు మహేంద్ర. అనుపమ అని ఆశ్చర్యంగా అడుగుతాడుమహేంద్ర. అవును నేనే అనుపమని, పిలిచినా పలకనంత మైకంలో ఉన్నావా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అంటూ నిలదీసినట్లుగా మాట్లాడుతుంది. ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా నామీద కోపం తగ్గలేదాఅని మనసులో అనుకుంటాడు.
ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఈ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నావా అంటుంది అనుపమ. నేను రాలేదు నా జ్ఞాపకాలు నన్ను లాక్కొచ్చాయి అంటాడు మహేంద్ర. మరి ఈ జ్ఞాపకాలు జగతికి కూడా ఉంటాయి కదా, జగతి ఏది తనని తీసుకురాలేదా అని అడుగుతుంది అనుపమ. జగతి ఈ లోకంలో లేదు అని చెప్తే అనుపమ పరిస్థితి ఎలా ఉంటుందో..
తనని నేను ఫేస్ చేయలేను అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. జగతి ఏదీ అని ఒకటికి పది సార్లు నిలదీస్తుంది అనుపమ. మహేంద్ర ఏమీ మాట్లాడకపోవడంతో నాకు అర్థమైంది మీరు 20 ఏళ్ల నుంచి విడిగా ఉన్నారని నాకు తెలిసింది అంటే మీరు ఇంకా కలవలేదా, అసలు సమస్య ఏమిటో చెప్పు నేను సాల్వ్ చేస్తాను అంటుంది. నా మైండ్ ఏమీ బాగోలేదు నేనేమీ మాట్లాడలేను ఈసారి కలిసినప్పుడు చెప్తాను అంటాడు మహేంద్ర.
కలిసినప్పుడు కాదు నేనే నిన్ను కలుస్తాను నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అంటుంది అనుపమ. అడ్రస్ చెప్తాడు మహేంద్ర. ఈ లోపు రిషి దంపతులు మహేంద్రని వెతుక్కుంటూ ఒక వ్యక్తి ఆ లోపల ఉన్నాడండి అని చెప్పడంతో అక్కడికి వస్తారు. అప్పుడే అనుపమ నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. రిషి తండ్రి దగ్గరికి వచ్చి ఇలా ఎందుకు వచ్చారు మాతో చెప్పాలి కదా అంటాడు.
ఏం లేదు నాన్న ఏమి తోచలేదు అందుకే వచ్చాను అంటాడు మహేంద్ర. వెళ్ళిపోతున్న అనుపమని చూసి ఆవిడ ఎవరు అని అడుగుతాడు రిషి. అడ్రస్ అడిగింది చెప్తున్నాను అంటాడు మహేంద్ర. మీరు ఈ ఊరికి కొత్త, మీరు అడ్రస్ చెప్పడం ఏమిటి అంటాడు రిషి. అడ్రస్ చెప్పటానికి ఊరు తెలియాల్సిన అవసరం ఏముంది అంటాడు మహేంద్ర. తండ్రిని తీసుకొని అక్కడినుంచి బయలుదేరుతాడు రిషి.
వసుధార కూడా అక్కడి నుంచి వెళ్లబోతుంది కానీ ఆమె చూపు మహేంద్ర,జగతి, అనుపమ అని రాసి ఉన్న పేర్లు మీద పడతాయి. ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఆమె. అనుపమ ఎవరు అని అనుకుంటుంది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే గత జ్ఞాపకాల్లో ఉన్న అనుపమకి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. అనుపమను చూసి ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది.
మహేంద్ర కనిపించాడు అని చెప్తుంది అనుపమ. ఒక్కసారిగా షాక్ అవుతుంది పెద్దమ్మ. అతను వివరాలు అన్ని తెలుసుకున్నావా అంటుంది పెద్దమ్మ పూర్తిగా అడగలేదు పెద్దమ్మ అంటుంది అనుపమ. అడగవలసినవి అడగవు, చెప్పవలసింది చెప్పవు. ఆరోజు కూడా నీ మనసులో మాట సరైన సమయానికి చెప్పకపోబట్టే ఈ పరిస్థితి వచ్చింది అంటుంది పెద్దమ్మ. నేను ఏం చేసినా నా ప్రాణ స్నేహితురాలి కోసం చేశాను అది మంచినిచ్చిందా, చెడ్డనిచ్చిందా అని ఆలోచించలేదు అంటుంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.