సెల్ఫీతో చిగురించిన ప్రేమ.. కాంతారకు వెన్నెముకైన రిషబ్ శెట్టి భార్య ప్రగతి ఎవరు?
రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల పరిచయం, ప్రేమ, పెళ్లి, ప్రస్తుత బంధం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి ప్రేమకథ గురించి ఈ కథనంలో చూద్దాం.

రిషబ్ శెట్టి లవ్ స్టోరీ
కాంతార చాప్టర్ 1 సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో రోజూ 7000కు పైగా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది. చాలా మంది వీఐపీలు కూడా కాంతార సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, రిషబ్ శెట్టి, అతని భార్య ప్రగతి శెట్టి వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి.
కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రగతి
రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి చర్చలు వైరల్ అవుతున్నాయి. రిషబ్ భార్య ప్రగతి శెట్టి సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కాంతార చాప్టర్ 1లో మీరు చూసిన రాజుల దుస్తులను ప్రగతే డిజైన్ చేశారు. రిషబ్‌తో ప్రేమ గురించి ప్రగతి పాత ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఆ హీరో వల్లే పరిచయం
“మా ప్రేమ పెళ్లికి రక్షిత్ శెట్టి కారణం. 'ఉళిదవారు కండంతే' చూశాక నేను, నా ఆఫీస్ ఫ్రెండ్స్ రక్షిత్ శెట్టికి ఫ్యాన్స్ అయ్యాం. అతని తర్వాతి సినిమా 'రిక్కీ' రిలీజ్ అయినప్పుడు, వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్లాం. అక్కడ చాలామంది రక్షిత్‌తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ రిషబ్ పక్కన నిలబడి ఉన్నారు. మా ఫ్రెండ్ ఒకరు రిషబ్‌ను చూపి, అతనే ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పారు” అని ప్రగతి ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం
"అప్పుడు నేను వెళ్లి రిషబ్ శెట్టితో సెల్ఫీ తీసుకున్నాను. నా స్నేహితులు కూడా ఫోటోలు తీసుకున్నారు. మాట్లాడుతుండగా మేమిద్దరం ఒకే ఊరు, కుందాపుర వాళ్లమని తెలిసింది. బెంగళూరులో కలవడంతో, ఒకే ఊరు కావడంతో త్వరగా దగ్గరయ్యాం. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో స్నేహం పెరిగింది. తర్వాత, మొబైల్ నంబర్లు మార్చుకుని స్నేహం ప్రేమగా మారింది'' అని ప్రగతి చెప్పారు.
దేశం మొత్తం గుర్తించే జంట
ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో, మా కుటుంబాలు త్వరగా దగ్గరయ్యాయి. మాటలు జరిగి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులం' అని ప్రగతి నవ్వుతూ చెప్పారు. రక్షిత్ శెట్టి అభిమానిగా 'రిక్కీ' సినిమాకు వచ్చి, రిషబ్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రగతి. ఇప్పటికీ ప్రగతి స్నేహితులు 'నీకు రిషబ్ దొరకడానికి మేమే కారణం' అని అంటారట. ఏదేమైనా, ఈ రోజు రిషబ్, ప్రగతి దేశం మొత్తం గుర్తించే జంటగా వెలిగిపోతున్నారు.