- Home
- Entertainment
- కిస్ కావాలా? కిక్ కావాలా?.. వర్మ బంపర్ ఆఫర్.. బోల్డ్ ఫోటోలు పంచుకుంటూ విచిత్రమైన కాంటెస్ట్
కిస్ కావాలా? కిక్ కావాలా?.. వర్మ బంపర్ ఆఫర్.. బోల్డ్ ఫోటోలు పంచుకుంటూ విచిత్రమైన కాంటెస్ట్
రామ్‌గోపాల్ వర్మ ఆడియెన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించారు. హీరోయిన్‌తో కిస్ ఇప్పిస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. వరుసగా హీరోయిన్ ఫోటోలు పంచుకుంటూ ఆయన బంపర్ ఆఫర్స్ ప్రకటించడం విశేషం.

వివాదాలకు కేరాఫ్‌గా, దాంతో సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. ఇటీవల `కొండా` చిత్రంతో అలరించిన ఆయన ఇప్పుడు `లడ్కీ` చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం `లడ్కీ`ని ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
వర్మ ఈ చిత్రాన్ని ఏకంగా చెన్నైలోనే దాదాపు 47,500థియేటర్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన ట్రిక్స్ ప్లే చేస్తున్నారు వర్మ. కిస్ ఆఫర్స్ ప్రకటించారు. కిస్ కావాలా? కిక్ కావాలో తేల్చుకోవాలని వెల్లడించారు.
ఓ సింపుల్ ప్రశ్నకి ఆన్సర్ చెబితే కిస్ గానీ, కిక్‌గానీ ఇస్తానంటూ వెల్లడించారు. `పూజా భలేకర్ ఎవరూ?` అనేదానికి ఆన్సర్ చెబితే కిస్ గానీ, కిక్‌గాని దక్కుతుందని రివార్డ్ ప్రకటించారు. హీరోయిన్‌తో కిస్ అంటూ ఆడియెన్స్ ని ఎరగా వేశారు.
దీనికి సరైన సమాధానం మీమ్స్ ద్వారాగానీ, ఫోటో ద్వారాగానీ, చిన్న వీడియో రూపంలోగానీ, పదం ద్వారా, వ్యాక్యం ద్వారా, ఆలోచించేది ఏదైనా సరే ఏ రూపంలో పంపించినా ఓకే, ఇందులో 20 మంది విజేతలను ఎంపిక చేస్తామని, పూజా పేరుతో సంబోధిస్తూ ఆమె సంతకం చేసిన ఫోటో కాపీని అందుకుంటారని తెలిపారు.
పూజా ఇన్‌స్టాగ్రామ్‌లో,ట్విట్టర్‌లో గానీ స్వయంగా చూసి ఆమె నిర్ణయిస్తుందని తెలిపాడు వర్మ. అందుకు ఒక ప్రశ్నకి నాలుగు సమాధానాలు రాశారు వర్మ. `పూభ భలేకర్ ఎవరు? అని ఆమె ఒక రేపిస్ట్ కి సంబంధించిన పీడకల, రెండు ఆమె ఒక ఫాంటసీ అని, మూడు బ్రూస్ లీ స్పిరిచ్వల్ డాటర్, యమ్ యమ్ యమ్మీ అంటూ నాలుగు సమాధానాలిచ్చారు.
వీటికి సమాధానం చెబుతూ, సరైన సమాధానం చెబితే కిస్ దొరుకుతుందని, లేదంటే కిక్ వస్తుందని చెప్పారు రామ్‌గోపాల్ వర్మ. ఆయన పెట్టిన ఈ విచిత్రమైన కాంటెస్ట్ కి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వర్మ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఎంత దూరమైనా వెళ్తాడు. తన పబ్లిసిటీకి కోసం విచిత్రమైన పనులు చేస్తుంటాడు. తన వ్యాఖ్యలతోనో, ఫోటోలతోనో, ట్వీట్లతోనే చర్చకి తెరలేపి హాట్ టాపిక్ గా మారుస్తుంటారు. ఇప్పుడు `లడ్కీ` సినిమా ప్రమోషన్ కోసం అదే చేశాడు. మరి దీనికి రెస్పాన్స్ ఎలా వస్తుందనేది చూడాలి.