- Home
- Entertainment
- Krishna Mukunda Murari: భర్త ప్రవర్తనను తట్టుకోలేకపోతున్న రేవతి.. భవాని వల్లే నందిని పిచ్చిదయ్యిందంటున్న కృష్ణ
Krishna Mukunda Murari: భర్త ప్రవర్తనను తట్టుకోలేకపోతున్న రేవతి.. భవాని వల్లే నందిని పిచ్చిదయ్యిందంటున్న కృష్ణ
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. విషయం తెలుసుకోకుండా మాట ఇచ్చి ఇబ్బంది పడుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మురారి దేని గురించో ఆలోచిస్తున్నాడు బహుశా కృష్ణ కి దేని గురించైనా మాట ఇచ్చి ఉంటాడు దాని గురించే మదన పడుతున్నట్లు ఉన్నాడు అంటుంది ముకుంద. మరోవైపు లేటుగా వచ్చినందుకు కృష్ణ కి ఎప్పుడు గౌతమ్ కి సారీ చెప్తాడు మురారి. అక్కడ ఉన్న బట్టలు చూసి అప్పుడే పెళ్ళికొడుకు షాపింగ్ కూడా అయిపోయినట్లుగా ఉంది అంటూ సరదాగా మాట్లాడుతాడు. కానీ గౌతమ్, కృష్ణ ఇద్దరు మూడీ గా ఉండడం గమనించి ఏం జరిగింది అని అడుగుతాడు. పెళ్లికూతురు బ్యాగ్రౌండ్ తలుచుకొని గౌతమ్ సర్ బయపడుతున్నారు కృష్ణ.
మేమిద్దరమే కృష్ణార్జునులం అయితే జరగబోయేది సుభద్ర పరిణయమే మీరేమీ కంగారు పడకండి అవసరమైతే మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకుంటాం అంటూ ధైర్యాన్ని ఇస్తాడు మురారి. మరోవైపు పెళ్ళికొడుకు ఫోన్ చేసి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాము మీ తరఫునుంచి కూడా ఎవరైనా రావాలి కదా అంటూ భవానికి చెప్తాడు. నందిని కోసం ఏమి తీసుకోవద్దు నాకు షాపింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మీరు తీసుకోండి మనీ ఈశ్వర్ చేత పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భవాని. ఈ లోపల తిరుపతికి వెళ్లే విషయంలో గొడవ పడుతూ ఉంటారు ఈశ్వర్, రేవతి.
ఈ టైంలో తిరుపతి ప్రయాణం ఎందుకు అంటాడు ఈశ్వర్. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అందుకే మీరు తిరుపతి రానంటున్నారు అంటుంది రేవతి. అవన్నీ నీకు అనవసరము ఇంట్లో వాళ్లకి ఏది కావాలో అది పట్టించు చాలు మిగతాది మా మగవాళ్ళం చూసుకుంటాము అంటాడు ఈశ్వర్. భవాని వచ్చి ఎందుకు రేవతి మీద కేకలు వేస్తున్నావు అంటూ మందలిస్తుంది. ఏమీ లేదు అంటాడు ఈశ్వర్. నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటూ కంప్లైంట్ ఇస్తుంది రేవతి. ఈ ఇంటి కోడలు కంటతడి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది.
మీ గురించే అడుగుతుంది సార్ సిద్దు, సిద్దు అని హాస్పిటల్ కి కూడా వస్తాను అంటుంది అని అంటుంది కృష్ణ మతిస్థిమితం లేకపోయినా నన్ను గుర్తుంచుకున్నది అంటే నా మీద ప్రేమ ఇంకా చావలేదు నువ్వే ఏదో ఒకటి చేసి మా ఇద్దరికీ పెళ్లి చేయాలి కృష్ణమ్మ అని అంటాడు గౌతమ్. చేస్తాను సార్ నేను అదే పనిలో ఉన్నాను ఎలాగైనా మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది అని అంటుంది కృష్ణ.ఆ తర్వాత సీన్లో మురారి ఇంటికి వస్తే ముకుంద ఆపి ఇంత త్వరగా ఎందుకు వచ్చావు కృష్ణకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నావా లేక తనే క్షమాపణలు చెప్తుంది అనుకుంటున్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అన్నిటికీ ఏమీ లేదు అని సమాధానం ఇస్తాడు మురారి. ఏమీ లేదు అంటావేంటి ఏదో ఉన్నది అని ముకుంద అనగా అవును ఉన్నది అయితే ఏంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి.
కారణాలు నాకు అనవసరం నువ్వు సమాధానం చెప్పలేని ప్రశ్న నీ భార్య వేస్తే ఇలా అరిచి చెప్పడం కరెక్ట్ కాదు అంటూ మరిదిని మందలిస్తుంది. ఒక్క మాటతో అందరినీ కట్టిపడేసింది అక్క ఎంత తెలివైనది. కారణాలు అనవసరమనేసింది ఇంక నేనేం ప్రశ్నలు అడుగుతాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రేవతి. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని మరిదిని అడుగుతుంది భవాని. మురారితో భయం లేదు ఏదైనా సమస్య తీసుకొస్తుందేమో అని ప్రశ్నతోనే భయంగా ఉంది అంటాడు ఈశ్వర్. తనతో నేను మాట్లాడుతాను లే అంటుంది భవాని.
మరోవైపు నిన్ను చూస్తే బాధగా ఉంది ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమైనా అంటే నాకు నరకం గా అనిపిస్తుంది అలానే వాళ్ళని కూడా ఏమీ అనలేను ఎందుకంటే అప్పుడే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. పెద్దవాళ్లకి పెద్దరికం ఇవ్వటం వల్ల తప్పులేదు అందుకే నేను మా పెద్దమ్మని ఏమి అనలేను అంటాడు మురారి. కుటుంబం గురించి కుటుంబమే లేని నాకు చెప్తున్నారు.ఈరోజు మాట ఇస్తున్నాను మీకు మీ పెద్దమ్మకి మీ మిగతా కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అంటుంది కృష్ణ.
నీ మనసు మంచిది అందుకే నువ్వంటే ఇష్టం అంటూ బయటికి వెళ్దాం అంటాడు మురారి. నీ ఇష్టం అని కృష్ణ అనటంతో ఇద్దరూ బయటికి వెళ్తారు. మరోవైపు పెళ్లి పనులు ఇద్దరిని కలిపి చేయమంటే మురారి, కృష్ణతో తిరుగుతున్నాడు.మురారి ప్రేమ నాకు మాత్రమే దక్కాలి అనుకుంటుంది ముకుంద. మరోవైపు ముకుందతో మురారి వెళ్లిన రెస్టారెంట్ కే కృష్ణ కూడా మురారిని తీసుకుని వెళుతుంది. అక్కడ వెయిటర్ కృష్ణని చిన్నక్క అంటాడు. అంటే పెద్దక్క వేరే ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది కృష్ణ. వెయిటర్ ఏదో చెప్పేలోపు నువ్వు మూసుకొని వెళ్ళు వెళ్లి కపుల్ స్వీట్ తీసుకుని రా అంటాడు మురారి.
అదే తెమ్మంటారు అనుకున్నాను బావ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెయిటర్. మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా మీరు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతున్నాడు అతను అంటుంది కృష్ణ సమాధానం చెప్పలేక కంగారు పడతాడు మురారి.స్వీట్ తీసుకువచ్చి బావకి దీని గురించి బాగా తెలుసు అంటాడు. స్వీట్ ఇద్దరూ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు.
నువ్వు వెళ్ళు కార్ దగ్గర వెయిట్ చెయ్యు నేను బిల్ పే చేసి వస్తాను అంటాడు మురారి. ఆమె బయటికి వెళ్ళిన తర్వాత వెయిటర్ కి ఓ కోటింగ్ ఇచ్చి బయటికి వస్తాడు. తరువాయి భాగంలో నందిని ఎక్కడ, ఎక్కడ దాచేసారు దేశాన్ని దాటించేసారా అని అడుగుతుంది కృష్ణ. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అది నా కూతురు అంటుంది భవాని. మీ కూతురు కాబట్టే పిచ్చిదైంది.ఏ సంతోషాలు లేకుండా ఇంట్లో పడి ఉంది అంటుంది కృష్ణ.