- Home
- Entertainment
- అర్ధరాత్రి హీరోయిన్ రూమ్ డోర్ కొట్టి తేడాగా ప్రవర్తిస్తారు, స్టార్ నటి సంచలన కామెంట్స్ ఎవరి గురించి?
అర్ధరాత్రి హీరోయిన్ రూమ్ డోర్ కొట్టి తేడాగా ప్రవర్తిస్తారు, స్టార్ నటి సంచలన కామెంట్స్ ఎవరి గురించి?
హీరోయిన్లతో కొంత మంది నిర్మాతలు అనుచితంగా ప్రవర్తిస్తారంటోంది బాలీవుడ్ సీనియర్ నటి. తన కెరీర్ బిగినింగ్ లో ఓ నిర్మాత నుంచి ఫేస్ చేసిన అనుభవాన్ని ఆమె వెల్లడించింది. ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎలా టార్గెట్ చేసి టార్చర్ పెడతారో ఆమె వివరించింది.

రేణుకా షహానే ఓపెన్ కామెంట్స్
బాలీవుడ్ లో అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది రేణుకా షహానే. కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు చూసిన ఈనటి నిర్మాతల నుంచి కొన్ని వేదింపులు కూడా ఫేస్ చేసింది. రీసెంట్ గా రేణుక తను కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు. ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’ వంటి సినిమాలు, ‘సర్కస్’ వంటి టెలివిజన్ షోలతో ప్రేక్షకులకు దగ్గరైన రేణుకా, సినీ నిర్మాతల నుండి ఎదురైన అనుచిత ప్రవర్తనపై సంచలన విషయాలను వెల్లడించారు.
రేణుక తో నిర్మాత అనుచిత ప్రవర్తన
జూమ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా షహానే మాట్లాడుతూ, “ఒక నిర్మాత నా ఇంటికే వచ్చి అనుచితమైన ప్రతిపాదన చేశాడు. అప్పటికే పెళ్లైన ఆ నిర్మాత.. నన్ను తనతో ఉండిపొమ్మని అడిగాడు, తనతో ఉన్నందుకు నెల నెల జీతం ఇస్తానని కూడా అన్నాడు. ఓ చీరల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తానని కూడా ఆయన అన్నారు. ఇదంతా మా అమ్మ ముందే అనడంతో అందరం ఆశ్చర్యపోయాం” అని అన్నారు.
మరో హీరోయిన్ దగ్గరకు
రేణుక మాట్టాడుతూ.. “ ఆ నిర్మాతకు నేను నో చెప్పడంతో.. ఆయన మరో నటి వద్దకే వెళ్లిపోయాడట. కానీ ఈ తరహా సంఘటనలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా జరిగాయి. కెరీర్ బిగినింగ్ లో చాలామంది హీరోయిన్లకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఎవరైనా ఇలాంటి ప్రతిపాదనలను తిరస్కరిస్తే, కొంతమంది ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇతర నిర్మాతల దగ్గర మన గురించి చెడుగా మాట్లాడి, అవకాశాలు ఇవ్వవద్దని చెబుతారు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నా విషయంలో అలా జరగలేదు, కానీ చాలామందికి జరుగుతుంది” అని రేణుకా తెలిపారు.
MeToo ఉద్యమం ప్రభావం తగ్గిపోయింది
అంతేకాక, వేధింపులపై ఫిర్యాదు చేసిన మహిళలు చాలా సందర్భాల్లో మరింత బాధను ఎదుర్కొంటారని కూడా ఆమె అన్నారు. “ఒకరు ఫిర్యాదు చేస్తే, వాళ్లను ప్రాజెక్ట్ నుంచి తొలగించేయడం, రెమ్యునరేషన్ ఇవ్వకుండా వేధించడం గానీ చేస్తారు. ఇది ఒక క్లబ్ లాంటిది , బాధితుడిని మరింత బాధపెట్టడం వారి లక్ష్యం. గతంలో వీటిపై ఉద్యమాలు వచ్చాయి. అప్పుడు ఇలాంటివి తగ్గాయి. కానీ MeToo ఉద్యమం ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. దాంతో అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వారు మళ్లీ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎవరికైనా ఆరోపణలు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేయకపోగా.. తిరిగి మనమీదే ప్రశ్నలు వేస్తారు. ఇది కూడా ఒక పెద్ద సమస్య ” అని ఆమె పేర్కొన్నారు.
రవీనా టాండన్ కు తప్పని వేదింపులు
రేణుకా షహానే ఉదాహరణగా నటి రవీనా టాండన్ గురించి ప్రస్తావించారు. “రవీనా అప్పట్లో పెద్ద హీరోయిన్. సినీ కుటుంబం నుంచే వచ్చినా, షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె చాలా జాగ్రత్తలు తీసుకునేదట. అవుట్ డోర్ లొకేషన్ షూటింగ్‌లలో, ప్రతిరోజూ తన గది మార్చి.. వేరే గదిలో ఉండేవారమని ఆమె నాతో చెప్పింది. ఎందుకంటే ఎవరైనా రాత్రివేళ రూమ్ దగ్గరికి వచ్చి సమస్యలు సృష్టించవచ్చని భయపడేవారు. అయినా సరే, అప్పుడు కూడా చాలా మంది హీరోయిన్లు రాత్రివేళ నిర్మాతలు, నటుల నుండి వేధింపులు ఎదుర్కొన్నారు” అని రేణుకా షహానే వివరించారు.