- Home
- Entertainment
- భానుప్రియ సంపాదనంతా ఎలా పోగొట్టుకుందో తెలుసా? స్టార్ హీరోయిన్ ను మోసం చేసింది ఎవరు?
భానుప్రియ సంపాదనంతా ఎలా పోగొట్టుకుందో తెలుసా? స్టార్ హీరోయిన్ ను మోసం చేసింది ఎవరు?
హీరోయిన్ గా టాలీవుడ్ ను దాదాపు 15 ఏళ్లు ఊపేసింది భానుప్రియ. మెగాస్టార్ చిరంజీవికి డాన్స్ లో పోటీ ఇచ్చిన ఈ హీరోయిన్.. ఆతరువాత కాలంలో పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తన ఆస్తినంతా ఆమె ఎవరికి ఇచ్చేసిందో తెలుసా?

టాలీవుడ్ ను ఊపేసిన భానుప్రియ
80, 90 దశకంలో తెలుగు సినీ పరిశ్రము ఏలిన హీరోయిన్లలో భానుప్రియ ఒకరు. అందానికి అందం.. నటనకు నటన, డాన్స్ తో.. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆమె.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సినిమాల్లో హీరోయిన్ గా ఎదగడానికి క్లాసికల్ డాన్స్ భానుప్రియకు బాగా ఉపమోగపడింది. దాదాపు 15 ఏళ్లకు పైగా టాలీవుడ్ లో హీరోయిన్ గా వెలుగు వెలిగింది భానుప్రియ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్, వెంకటేష, మోహన్ బాబు, సుమన్, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా భానుప్రియ బాగా పాపులర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
భానుప్రియ కళ్లకు అభిమానులు..
బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా.. అక్కడకు వెళ్లలేనంత బిజీ హీరోయిన్ గా సౌత్ లో స్టార్ డమ్ ను అనుభవించింది భానుప్రియ. తెలుగు తెరపై క్లాసికల్ డాన్స్ తెలిసిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఆడిమన్స్ కు బాగా కనెక్ట్ అయిన తార మాత్రం భానుప్రియ. స్వర్ణకమలం సినిమా తరువాత సినిమాల్లో శాస్త్రీయ నృత్యం అంటే భానుప్రియనే అందరికి గుర్తుకు వచ్చేది. దానికి తోడు స్టార్ హీరోలతో కలిసి ఆమె చేసే మోడ్రన్ డాన్స్ కూడా అద్బుతంగా ఉండేది. మరీ ముఖ్యంగా చిరంజీవి లాంటి స్టార్ డాన్సర్ తో పోటీ పడి డాన్స్ చేయగలిగింది భానుప్రియ ఒక్కరే.
ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్
అద్భుతమైన శైలి, నయనాల హావభావాలతో భానుప్రియ ప్రేక్షకులను అలరించింది. డాన్స్ తో పాటు ఆమె వాయిస్, ఎక్స్ ప్రెషన్స్ కూడా భానుప్రియ కెరీర్ కు బాగా ఉపయోగపడ్డాయి. అయితే భానుప్రియ పర్సనల్ లైఫ్ మాత్రం ఆమెను కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఈ విషయం గురించి భానుప్రియ ఎన్నో ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇక రీసెంట్ గా డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భాను ప్రియగురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
భానుప్రియ జీవితంలో విషాదం..
ఆయన మాట్లాడుతూ, “భానుప్రియను చూసి ఆదర్శ్ కౌశల్ ఇష్టపడ్డారు. ఆయన చేసిన ప్రపోజల్‌ను భానుప్రియ అంగీకరించారు. అయితే ఈ పెళ్లికి భానుప్రియ తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లి స్వార్థపూరితంగా ఆలోచిస్తోందని గ్రహించిన భానుప్రియ, అప్పటివరకు తాను సంపాదించిన ఆస్తిని తల్లికే వదిలేసి, కట్టు బట్టలతో ఆదర్శ్ తో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే ఆదర్శ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. భానుప్రియ అత్తగారు ఉన్నంత వరకూ.. ఆమె బాగానే ఉంది. కానీ ఆమె మరణించిన తర్వాత భర్తతో విభేదాలు మొదలయ్యాయి. “ఆదర్శ్ కౌశల్ వ్యసనాల బారిన పడటంతో ఆ కుటుంబంలో సమస్యలు పెరిగాయి. భర్త వల్ల భానుప్రియ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చివరికి భరించలేని పరిస్థితుల్లో.. ఆయన్ను వదిలేసి చెన్నైకి తిరిగి వచ్చారు. ఆమె వచ్చేప్పుడు భర్త వైపు నుంచి ఎలాంటి ఆస్తులు తీసుకురాలేదు. అయినా భానుప్రియ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు” అని ఆన అన్నారు.
భానుప్రియ స్వభావం ఎంతో గొప్పది
భానుప్రియ వ్యక్తిత్వాన్ని దర్శకుడు ప్రశంసిచారు. “భానుప్రియ స్వభావం ఎంతో గొప్పది. ఆమె భర్త పట్ల ప్రేమ, అత్తగారి పట్ల గౌరవంతో ఉండేవారు. తన కాళ్లమీద తాను నిలబడాలనే ఉద్దేశంతో అమెరికాలో ఓ డాన్స్ స్కూల్ ను కూడా ప్రారంభించారు. తన ప్రతిభతో అక్కడ కూడా మంచి పేరు సంపాదించారు. కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు వల్ల, అది కూడా క్లోజ్ చేసి చెన్నై రావల్సి వచ్చింది. అంతే కాదు ఇక్కడికి వచ్చిన తరువాత భానుప్రియ కొంతకాలం మెమరీ లాస్‌తో బాధపడ్డారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి కోలుకున్నారు. మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు” అని డైరెక్టర్ హరిశ్చంద్రరావు అన్నారు. ”