MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా మాజీ భర్త తిరిగి పొందడం ఎలా ?..సలహాలు ఇస్తే నేను చేసే పని ఇదే, రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ 

నా మాజీ భర్త తిరిగి పొందడం ఎలా ?..సలహాలు ఇస్తే నేను చేసే పని ఇదే, రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ 

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. పవన్ అభిమానులు రేణు దేశాయ్ ని సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతుంటారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 20 2024, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. పవన్ అభిమానులు రేణు దేశాయ్ ని సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతుంటారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రేణు దేశాయ్ పిల్లల భాద్యత చూసుకుంటోంది. తరచుగా ఆమె అకిరా నందన్, ఆద్య గురించి విశేషాలని ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. 

26

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో అకిరా తండ్రి వెంటే ఉంటూ మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. రేణు దేశాయ్ కూడా ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొందరు పవన్ అభిమానులు, నెటిజన్లు రేణు దేశాయ్ ని తరచుగా సోషల్ మీడియాలో విసిగించడం చూస్తూనే ఉన్నాం. 

36

రేణు దేశాయ్ ని వదిన అని పిలవడం వరకు ఓకే కానీ.. తిరిగి మీ మాజీ భర్త దగ్గరికి వచ్చేయండి అంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు. అలాంటి వారి పట్ల రేణు దేశాయ్ కూడా విసిగిపోయింది. రేణు దేశాయ్ ఏదైనా పోస్ట్ పెడితే.. కామెంట్స్ రూపంలో పవన్ ప్రస్తావన తీసుకువస్తారు. 

46

తాజాగా రేణు దేశాయ్ తన ఐఫోన్ లో ఎడిట్ చేసిన ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియో చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ లో ఈ వీడియో ఎడిట్ చేసిందట. కానీ షేర్ చేయడం మరచిపోయిందట. ఇప్పుడు షేర్ చేస్తున్నానని తెలిపింది. 

56

అయితే నెటిజన్లకు, పవన్ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చింది. 'నా మాజీ భర్తని తిరిగి పొందడం ఎలా .. అతనిని నేను మిస్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి పోస్ట్ లు చేస్తోంది అని మీరు భావిస్తూ..అనవసరమైన సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తే మాత్రం వెంటనే బ్లాక్ చేస్తాను అని రేణు దేశాయ్ వార్నింగ్ ఇచ్చింది. 

66

ఇదిలా ఉండగా రేణు దేశాయ్ ఆ మధ్యన సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
క్రేజీ హీరో నుంచి హారర్ కామెడీ మూవీ.. సడెన్ గా విడుదల తేదీలో మార్పు, కారణం ఇదే
Recommended image2
తనకన్నా చిన్నవాడితో ఎంగేజ్మెంట్, బ్రేకప్.. ఏ అమ్మాయికీ ఆ పరిస్థితి రాకూడదు, హీరోయిన్ సంచలనం
Recommended image3
Dhurandhar 2: ధురంధర్ 2 ఫ్లాప్ అవుతుందా? సీక్వెల్స్ అన్నీ వేస్ట్, నటి సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved