- Home
- Entertainment
- రెండో పెళ్లిపై రేణు దేశాయ్ నిర్ణయం ఇదే.. నెక్ట్స్ ఏం చేయబోతుందో తెలిస్తే మతిపోతుంది.. సంచలన స్టేట్‌మెంట్
రెండో పెళ్లిపై రేణు దేశాయ్ నిర్ణయం ఇదే.. నెక్ట్స్ ఏం చేయబోతుందో తెలిస్తే మతిపోతుంది.. సంచలన స్టేట్‌మెంట్
Renu desai: రేణు దేశాయ్ దీపావళి పండుగని పురస్కరించుకుని ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను సన్యాసిగా మారిపోతానని తెలిపి షాకిచ్చింది.

పవన్‌తో విడిపోయాక ఒంటరిగానే ఉంటోన్న రేణు దేశాయ్
రేణు దేశాయ్ ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసింది. `బద్రి`, `జానీ` చిత్రాల్లోనే ఆమె హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా. కొడుకు అకీరా నందన్, కూతురు ఆధ్య జన్మించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పవన్, రేణు దేశాయ్ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు. నటి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉండిపోయింది.
రెండో పెళ్లికి రెడీ అయి క్యాన్సిల్ చేసుకున్న రేణు
రేణు దేశాయ్ కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లికి సిద్ధమైంది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. కొడుకు అకీరా నందన్, కూతురు ఆధ్యలు చిన్న వయసులో ఉన్నారు. తాను మరో పెళ్లి చేసుకుంటే వాళ్లకు పేరెంటింగ్ ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్లు పెద్ద అయ్యాక, లైఫ్‌లో సెటిల్ అయ్యాక రెండో పెళ్లి చేసుకుంటానని పలు ఇంటర్వ్యూలలో తెలిపింది రేణు దేశాయ్. కానీ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
సన్యాసిగా మారిపోతానంటూ స్టేట్‌మెంట్
ఇన్నాళ్లు రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిన రేణు దేశాయ్ ఇప్పుడు సన్యాసిగా మారిపోతాంటూ షాకిచ్చింది. నెక్ట్స్ ఏం చేయబోతున్నారనే ప్రశ్నకి ఆమె ఈ సమాధానం ఇచ్చింది. పిల్లలు ఇంకా పెద్ద కావాల్సి ఉంది. వాళ్లు పెద్దగయ్యాక తాను సన్యాసం తీసుకుంటానని తెలిపింది. ఇంకా కొంత కాలమే ఇక్కడ ఉండేదని, ఆ తర్వాత పూర్తిగా సన్యాసిగా మారిపోతానని పేర్కొంది రేణు దేశాయ్. తనకు చిన్నప్పట్నుంచి కాషాయం కలర్ అంటే ఇష్టమని, ఎక్కువగా అలాంటి శారీ కడుతుంటే, వాళ్ల అమ్మ ఎప్పుడూ అనేదట.. ఎక్కువగా అది వేసుకోకు ఫ్యూచర్‌లో సన్యాసివి అయిపోతావని, ఇప్పుడు అదే అవుతుందని నవ్వుతూ చెప్పింది రేణు దేశాయ్.
రేణ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోదా?
మళ్లీ సినిమాల్లో నటించడానికి సంబంధించిన ఆమె స్పందిస్తూ, అది చాలా కష్టమే అని పేర్కొంది. ప్రస్తుతం యానిమల్ ఎన్జీవోని నడిపిస్తున్నానని, దానికోసమే ఇక్కడ ఉన్నట్టు తెలిపింది. అదే లేదంటే ఎక్కడో ఆశ్రమంలో ఉంటానని, సన్యాసం తీసుకుంటానని చెప్పింది రేణు దేశాయ్. యాంకర్ స్వప్న(సుమన్ టీవీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఈ విషయాలను వెల్లడించింది. ఆమె కామెంట్స్ అభిమానులను షాక్‌కి గురి చేస్తున్నాయి. లేటెస్ట్ రేణు దేశాయ్ కామెంట్స్ ని బట్టి చూస్తుంటే ఆమెకి మళ్లీ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టమవుతుంది.
అకీరాని హీరోగా చూడాలని ఉంది
ఇక అకీరా సినిమాల్లోకి రావడం గురించి చెబుతూ, అది జరిగితే అందరికంటే ముందే ఆనందించేది తానే అని తెలిపింది. అకీరాని హీరోగా చూడాలని ఉందని, ఆ వార్త ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నానని, కానీ ఇప్పుడైతే ఇలాంటి ఆలోచన లేదని తెలిపింది. కెరీర్‌పై ఫోకస్ పెట్టాడని, తను మంచి పియానో ఆర్టిస్ట్ అని తెలిపింది రేణు దేశాయ్. ఇక ఆధ్యకి సోషల్ సర్వీస్ అంటే ఇష్టమని, ఎప్పుడు జనాల్లో ఉండాలనుకుంటుందని వెల్లడించింది. మరి ఎవరు ఏమవుతారో చూడాలి.