పవన్ కళ్యాణ్ అభిమానికి ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్, ఎం జరిగిందంటే?
నటి, రచయిత, దర్శకురాలు రేణూ దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరిపై ఫైర్ అయ్యారు. అతను చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. ఇంతకీ అతను ఏమన్నాడు? రేణు స్పందన ఏంటి ?

అసలు విషయం ఏంటంటే...
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రేణూ దేశాయ్‌కు ఇటీవలర పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు. అతను చేసిన కామెంట్ రేణుకు కోపం తెప్పించింది. ఆ అభిమాని కామెంట్ లో ఇలా అన్నారు. "మిమ్మల్ని మేము ఇంకా పవన్ కల్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో మరో వ్యక్తిని ఊహించలేం." ఈ వ్యాఖ్యలపై రేణూ దేశాయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంగ్లీషులో కామెంట్ రాసేంత చదువు ఉన్న వ్యక్తి కూడా మహిళలను ఒకరి ఆస్తిగా భావించడం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆమె తన ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేశారు.
మహిళలు మగవారి ఆస్తి కాదు
చదువు, ఉద్యోగం వంటి నిర్ణయాలకు కూడా మహిళలకు నేటికీ ‘పర్మిషన్’ అవసరం అవుతోందని, వారిని కేవలం వంటగదికి, పిల్లల్ని కనడానికే పరిమితం చేసే ధోరణి కొనసాగుతోందని రేణు దేశాయ్ అన్నారు. "మనం ఇప్పటికే 2025లో ఉన్నప్పటికీ, ఇంకా మహిళలను భర్తల ఆస్తిగా భావించే ధోరణి సమాజంలో బలంగా నెలకొని ఉంది," అని రేణూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం వంటి నిర్ణయాలకు కూడా మహిళలకు ఇప్పటికీ సమాజం నుంచి అనుమతి అవసరమవుతోందని ఆమె అన్నారు.ఈ ధోరణికి వ్యతిరేకంగా తాను గళం విప్పుతానని, భవిష్యత్ తరాల మహిళల కోసమైనా ఈ మార్పు అవసరమని ఆమె స్పష్టం చేశారు.
ఫెమినిజం అంటే
ఇక ఫెమినిజం అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దని, అసలైన ఫెమినిజం అంటే స్త్రీలను పశువులా లేదా ఫర్నిచర్‌లా చూసే ఆలోచనను ప్రశ్నించడమే అని స్పష్టంగా తెలిపారు. "నా మాటలు ఈ తరానికి కాదు అయినా సరే, రాబోయే తరాల కోసం అయినా ఈ ధోరణి మారాలని కోరుకుంటున్నాను.స్త్రీలు గర్భంలోనే చనిపోవడం, పరువు హత్యలు, వరకట్న మరణాలు జరుగకుండా చూడాలనేది నా ఆకాంక్ష," అని రేణూ దేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు.
వైరల్ అవుతున్న రేణూ కామెంట్స్
ఈ పోస్ట్ నెట్‌మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యంగా స్పందించడాన్ని కొంతమంది అభినందించగా, మరికొందరు వివాదాస్పదంగా చూస్తున్నారు. కానీ, మహిళల స్వాతంత్ర్యం, గౌరవం, సమానత్వంపై ఈ సంభాషణను రేణూ దేశాయ్ మళ్లీ తెరపైకి తీసుకురావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.