మంచు బ్రదర్స్ కలిసిపోయారా? విష్ణుకి థాంక్స్ చెప్పిన మనోజ్, కారణం ఇదే?
మంచు బ్రదర్స్ కలిసిపోయారా? ఇద్దరిమధ్య గొడవలు సర్ధుమణిగినట్టేనా? ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరిని కలిపిన విషయం ఏది? విష్ణుకి మనోజ్ ఎందుకు థాంక్స్ చెప్పాడు?

మంచువారి గొడవలు
మంచు వారింట గొడవల గురించి అందరికి తెలిసిందే. అన్నదమ్ముల మధ్య కారణం ఏంటో కూడా తెలియని గొడవలు చాలా జరిగాయి. ఆస్తుల గురించి గొడవ అని ప్రాచారం జరుగుతున్నా. దానిపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. రెండు వర్గాల నుంచి రకరకాల వాదనలు ఉన్నాయి. ఈక్రమంలో మోహన్ బాబు కూడా పెద్ద కొడుకు విష్ణువైపు నిలబడటంతో మనోజ్ ఒంటరి అయిపోయాడు. ఇక మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచే ఈ గొడవలు పెద్దవి అయ్యాయని టాక్. ఈక్రమంలో ఓ రెండు నెలలు మంచువారింట ఉద్రిక్తలు వైరల్ వార్తలు అయ్యాయి. మోహన్ బాబు మీడియాపై చేసిన దాడి కూడా సంచలనంగా మారింది. ఇక ఆతరువాత మనోజ్ విడిగా ఉంటంతో ఉద్రిక్తలు సర్ధుమణిగాయి. కాని అప్పుడప్పుడు మంచువారి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
మంచు బ్రదర్స్ కలిసిపోయారా?
ఈమధ్య కాలంలో మంచు బ్రదర్స్ కలిసిపోయినట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా కొన్ని సంకేతాలు ఇలానే కనిపిస్తున్నాయి. ఆమధ్య మంచు విష్ణు కన్నప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మొదట తెలియకుండా సెటైర్లు వేసిన మంచు మనోజ్, ఆతరువాత ఆ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అప్పుడే అందరికి ఈ విషయంలో కాస్త డౌట్ వచ్చింది. ఇక తాజాగా మంచు మనోజ్ విలన్ గా నటించిన మిరాయ్ సినిమా టీమ్ కు మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పడం, దానికి మనోజ్ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
ఆకట్టుకుంటోన్న మిరాయ్
సెప్టెంబర్ 12న విడుదలైన యాక్షన్-ఫాంటసీ థ్రిల్లర్ 'మిరాయ్' తొలి షో నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రానికి 'ఈగల్' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. భారీ విజువల్స్, గ్రిప్పింగ్ కథనంతో సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాలలో విలన్ పాత్ర ఒకటి. మంచు మనోజ్ పోషించిన 'బ్లాక్ స్వోర్డ్' పాత్ర అందరిని ఆకట్టుకుంటోంది. అతని పాత్రలోని స్టైల్, పవర్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదే సందర్భంగా మూవీపై సినీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మంచు విష్ణు శుభాకాంక్షలు
ఈ క్రమంలో మంచు విష్ణు కూడా మిరాయ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, “మిరాయ్ విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అంటూ విష్ణు పోస్ట్ చేశారు.
Wishing all the best for #Mirai. God speed to the entire team.
— Vishnu Manchu (@iVishnuManchu) September 12, 2025
విష్ణుకి థాంక్స్ చెప్పిన మనోజ్
విష్ణు అభినందనలపై మంచు మనోజ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు:
"Thank you so much Anna
Love and respect always... From team MIRAI ''
అంటూ తాను పోషించిన బ్లాక్ స్వోర్డ్ పాత్రను గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Thank you soo much anna,
From team #Mirai alias #BlackSwordhttps://t.co/JwG02gqPUo— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025
ఆనందంలో మంచు ఫ్యాన్స్
గొడవల తరువాత మంచు బ్రదర్స్ ఇలా సోషల్ మీడియాలో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడం తో మంచు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో వీరిద్దరి మధ్య గల మైనర్ డిఫరెన్సుల గురించి వార్తలు వచ్చినప్పటికీ, ఈ మార్పుతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో "మంచు బ్రదర్స్ మళ్లీ కలిసారా?" అనే చర్చ కూడా ప్రారంభమైంది.
మిరాయ్ లో స్పెషల్ గా మంచు మనోజ్
మిరాయ్ సినిమాలో మనోజ్ బ్లాక్ స్వోర్డ్ పాత్రలో కనిపించగా, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం గౌర హరి అందించారు.మొత్తానికి, ‘మిరాయ్’ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం, మంచు విష్ణు స్వయంగా అభినందించడం, మనోజ్ స్పందన – అన్నీ కలసి మంచు కుటుంబం చుట్టూ మరోసారి చర్చను రేపాయి.