MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • NBK Satires: సుకుమార్‌, సందీప్‌ వంగా, రాజమౌళిలకు బాలయ్య చురకలు.. కథ ఉండదుగానీ, మూడున్నర గంటల సినిమా

NBK Satires: సుకుమార్‌, సందీప్‌ వంగా, రాజమౌళిలకు బాలయ్య చురకలు.. కథ ఉండదుగానీ, మూడున్నర గంటల సినిమా

NBK Satires: నందమూరి బాలకృష్ణ స్టార్‌ డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్‌, సందీప్‌ రెడ్డి వంగాలకు చురకలు అంటించారు. సినిమా నిడివి విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 04 2025, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారీ అంచనాల మధ్య `అఖండ 2` రిలీజ్‌
Image Credit : youtube/@14ReelsPlus

భారీ అంచనాల మధ్య `అఖండ 2` రిలీజ్‌

బాలకృష్ణ ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేస్తున్నారు. సంక్రాంతికి `డాకు మహారాజ్‌`తో మెప్పించారు. ఇప్పుడు `అఖండ 2`తో వస్తున్నారు. ఈ శుక్రవారం నుంచి సినిమా విడుదల కాబోతుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోస్‌ పడబోతున్నాయి. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తోన్న నాల్గో సినిమా కావడం, హిట్‌ కాంబినేషన్‌ కావడం, ఆ అంచనాలకు కారణం కావచ్చు.

26
స్టార్‌ డైరెక్టర్లకు బాలయ్య చురకలు
Image Credit : youtube/@14ReelsPlus

స్టార్‌ డైరెక్టర్లకు బాలయ్య చురకలు

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ పాల్గొంటూ బిజీగా ఉన్నాడు బాలయ్య. వరుసగా పలు సిటీస్‌లో ఈవెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ముంబయిలో, హైదరాబాద్‌లో, చెన్నైలో, బెంగుళూరులో ఈవెంట్లు చేశారు. అదే సమయంలో వరుసగా టీమ్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలుగు టీమ్‌ ఇంటర్వ్యూలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల నిడివిపై ఆయన స్టార్‌ డైరెక్టర్లకు చురకలు అంటించారు. ఇటీవల కాలంలో రాజమౌళి, సుకుమార్‌, సందీప్‌ రెడ్డి వంగా వంటి దర్శకులు తమ సినిమాలను మూడు గంటలకుపైగా రూపొందిస్తున్నారు.

Related Articles

Related image1
మోహన్‌ బాబు చేసిన చిన్న మిస్టేక్‌ సౌందర్య కొంపముంచిందా? దర్శకుడు బయటపెట్టిన సంచలన నిజం
Related image2
బాలకృష్ణ `నరసింహనాయుడు` దెబ్బకి అడ్రస్‌ లేకుండాపోయిన చిరంజీవి, వెంకటేష్‌ సినిమాలివే.. ఇద్దరు స్టార్లకి చెమటలు
36
కథ ఉండదు మూడు, మూడున్నర గంటల సినిమాలు
Image Credit : youtube/@14ReelsPlus

కథ ఉండదు మూడు, మూడున్నర గంటల సినిమాలు

దీనిపై బాలయ్య స్పందిస్తూ, `ఈ మధ్య కొన్ని సినిమాలు మూడు గంటలు, మూడున్నర గంటలు ఉంటున్నాయి. అందులో కథ ఉండదు, పాయింట్‌ చిన్నదే కానీ మూడు, మూడున్నర గంటలకుపైగా నిడివి ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. మేం ఇంత పెద్ద సినిమా చేసి మూడు గంటల లోపే తీశాం` అని తెలిపారు బాలయ్య. సినిమా నిడివి దృష్ట్యా ఇందులో హీరోయిన్‌ పాత్రనే లేపేసినట్టు తెలిపారు. మొదటి భాగంలో ప్రగ్యా జైశ్వాల్‌ పాత్ర ఉంటుంది. ఆమె ఇందులో ఏం చేస్తుందని ఆలోచించి సెట్‌ కావడం లేదని తీసేసినట్టు తెలిపారు బాలయ్య. నిడివిని దృష్టిలో పెట్టుకొనే ఆ పాత్రని కట్‌ చేసినట్టు వెల్లడించారు. అదే సమయంలో ఇందులో కొత్తగా హర్షాలి పాత్ర వస్తుంది, దీంతోపాటు సంయుక్త పాత్ర వస్తుందన్నారు.

46
సందీప్‌ రెడ్డి వంగా, సుకుమార్‌, రాజమౌళిలపై సెటైర్లు
Image Credit : youtube/@14ReelsPlus

సందీప్‌ రెడ్డి వంగా, సుకుమార్‌, రాజమౌళిలపై సెటైర్లు

ఇప్పుడు సినిమాకి నిడివి ఎంత ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. ఆడియెన్స్ ని థియేటర్లో కూర్చోబెట్టాలి. ఎక్కువ నిడివి ఉంటే ఆడియెన్స్ బోర్‌ ఫీలవుతారని తెలిపారు. అందుకే తాము పెద్ద సినిమా చేసినా నిడివి ఎంత ఉండాలో అంతే ఉంచామని టీమ్‌ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పారు. పరోక్షంగా ఆయన సందీప్‌ రెడ్డి వంగా, రాజమౌళి, సుకుమార్‌ లకు చురకలు అంటించారు. ఇటీవల కాలంలో వారి సినిమాలే మూడు గంటలకుపైగా నిడివితో ఉంటున్నాయి. `అఖండ 2` రెండు గంటల 44 నిమిషాల నిడివితో విడుదల కాబోతుంది.

56
మూడు గంటలకుపైగా నిడివితో సినిమాలు
Image Credit : stockPhoto

మూడు గంటలకుపైగా నిడివితో సినిమాలు

`ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప 2`, `యానిమల్‌` చిత్రాలు మూడు గంటలకుపైగా నిడివితోనే విడుదలైన విషయం తెలిసిందే. అవి బాక్సాఫీసు వద్ద సంచలన విజయాలు సాధించాయి. నిడివి ఎక్కువగా ఉన్నా, బాక్సాఫీసుని షేక్‌ చేశాయి. వందల, వేల కోట్లు వసూలు చేశారు. మరి బాలయ్య సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా రూ.150కోట్లు దాటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ఈ కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరంగా, చర్చనీయాంశంగా మారింది. 

66
డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా `అఖండ 2` విడుదల
Image Credit : youtube/@14ReelsPlus

డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా `అఖండ 2` విడుదల

`అఖండ 2` చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా, పూర్ణ, హర్షాలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా సినిమాగా విడుదలవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Related Stories
Recommended image1
మోహన్‌ బాబు చేసిన చిన్న మిస్టేక్‌ సౌందర్య కొంపముంచిందా? దర్శకుడు బయటపెట్టిన సంచలన నిజం
Recommended image2
బాలకృష్ణ `నరసింహనాయుడు` దెబ్బకి అడ్రస్‌ లేకుండాపోయిన చిరంజీవి, వెంకటేష్‌ సినిమాలివే.. ఇద్దరు స్టార్లకి చెమటలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved