- Home
- Entertainment
- Guppedantha Manasu: బర్త్ డే రోజున రిషీని ఘోరంగా అవమానించిన మహేంద్ర.. జగతి ఏం చెయ్యనుంది?
Guppedantha Manasu: బర్త్ డే రోజున రిషీని ఘోరంగా అవమానించిన మహేంద్ర.. జగతి ఏం చెయ్యనుంది?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఫ్యామిలీ అంతా ఒకచోట కూర్చుని ఉండగా ఫనింద్ర భూపతి (Phanindra Bhupathi) మన కాలేజీ మునుపెన్నడూ లేనివిధంగా ట్రెడిషనల్ లుక్ తో డెకరేట్ చేసి మినిస్టర్ గారిని ట్రెడిషనల్ లో ఆహ్వానం చేద్దాం అని అంటాడు. ఇక ఆ తర్వాత మినిస్టర్ ఫోన్ చేసి నాకు ఈ సన్మానాలు ఇవి ఇష్టముండవు అని అంటాడు.
దాంతో ఫనింద్ర భూపతి మహేంద్ర (Mahendra) బర్త్డే పార్టీ కి రండి అని అంటాడు. ఇక మినిస్టర్ గారి దగ్గర ఫోన్ మర్చిపోయాను అని వెనక్కి వెళ్లిన రిషి (Rishi) మినిస్టర్ ను ఒక ఫేవర్ చేయమని అడుగుతాడు. అదేమిటంటే మినిస్టర్ ను కాలేజీ కి బదులుగా మా ఇంటికి వచ్చే విధంగా చూడండి అని అంటాడు.
ఇక రిషి ప్లాన్ మహేంద్ర (Mahendra) కు తెలిసి కొంచెం నవ్వుకుంటాడు. మరోవైపు రిషి (Rishi) డాడీ బర్త్ డే కి ఇంటికి రావడం కుదరదు అన్నారు. మరి ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు అని మనసులో అనుకుంటాడు. ఆ తరువాత రిషి వసు దగ్గరకు వచ్చి మీ మేడంను, మా డాడీను రేపు సన్మానానికి నువ్వే దగ్గరుండి తీసుకొని రావాలి అని అంటాడు.
Andhuku వసు (Vasu) అది నా వల్ల ఎలా అవుతుంది అని అంటాడు. మరోవైపు గౌతమ్ (Goutham) ధరణిలు ఇంటిని మరో లెవెల్ లో డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇక దేవయాని మాత్రం ఒక వైపు నుంచి జలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ లోపు వసు (Vasu) కూడా అక్కడకు వస్తుంది.
ఇక ఇంటికి వచ్చిన వసు (Vasu) మినిస్టర్ గారి సన్మానం కోసం కావలసిన ఏర్పాట్ల కోసం వచ్చాను అని చెబుతుంది. దాంతో ఫణీంద్ర (Phanindra) వెరీగుడ్ అంటాడు. ఇక రిషి మినిస్టర్ గారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అని అంటాడు.
ఇక తరువాయి భాగంలో రిషి (Rishi) డాడీ కు ఇంకా బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా అని దేవయానితో అంటాడు. ఇక మహేంద్ర (Mahendra) గోరంగా అవమాన పడేలా రిషిని ఏదో అంటాడు. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.