- Home
- Entertainment
- ఎన్టీఆర్, పవన్, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలతో 6 బ్లాక్ బస్టర్లు కొట్టిన హీరో ఎవరో తెలుసా ?
ఎన్టీఆర్, పవన్, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలతో 6 బ్లాక్ బస్టర్లు కొట్టిన హీరో ఎవరో తెలుసా ?
టాలీవుడ్ లో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరో చేతుల్లోకి వెళ్లడం సహజం. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన చిత్రాలే టాలీవుడ్ లో ఓ హీరోని స్టార్ గా నిలబెట్టాయి అనే సంగతి తెలుసా ?

రవితేజ సినిమాలు
గతంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ చాలా చిత్రాలని రిజెక్ట్ చేశారు. ఈ హీరోలు రిజెక్ట్ చేసిన చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ ఏకంగా 6 బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇడియట్ నుంచి మిరపకాయ్ వరకు ఇతర హీరోలు రిజెక్ట్ చేసిన చిత్రాలతో రవితేజ హిట్లు అందుకున్న జాబితా ఇప్పుడు చూద్దాం.
ఇడియట్
రవితేజని స్టార్ గా మార్చిన చిత్రం ఇడియట్. పూరి జగన్నాధ్ ఈ కథని ముందుగా పవన్ కళ్యాణ్ కి వినిపించారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడంతో రవితేజ చేతుల్లోకి వెళ్ళింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రవితేజ కెరీర్ మారిపోయింది. అప్పటి వరకు సాధారణ నటుడిగా టాలీవుడ్ లో ఉన్న రవితేజ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు.
అమ్మానాన్న ఓ తమిళమ్మాయి
ఈ చిత్రంలో మదర్, ఫాదర్ సెంటిమెంట్ తో పాటు బాక్సింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారు. రవితేజ, ఆసిన్ జంటగా నటించిన ఈ చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. 2003లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
భద్ర
రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో భద్ర ఒకటి. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో హీరోగా ముందుగా అల్లు అర్జున్ ని ఆ తర్వాత ఎన్టీఆర్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.
విక్రమార్కుడు
రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు మూవీ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాణ్ నటించాల్సింది. రాజమౌళి పవన్ కి కథ కూడా వినిపించారు. పవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రాజమౌళి.. రవితేజ తో ఈ చిత్రం తెరకెక్కించారు.
మిరపకాయ్
డైరెక్టర్ హరీష్ శంకర్ మిరపకాయ్ చిత్రాన్ని రొమాంటిక్ రిషి అనే టైటిల్ తో పవన్ కి కథ వినిపించారు. కానీ పవన్ అంగీకారం తెలపలేదు. దీనితో మిరపకాయ్ అనే టైటిల్ మార్చి కథలో కొన్ని మార్పులు చేసి రవితేజ తో తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
కిక్
స్టైలిష్ యాక్షన్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్. ఈ చిత్ర కథని సురేందర్ రెడ్డి ముందుగా ఎన్టీఆర్ కి వినిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ రిస్క్ తీసుకోవడానికి అంగీకరించలేదు. దీనితో ఈ మూవీ రవితేజ చేతుల్లోకి వెళ్ళింది.