రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న రవితేజ హీరోయిన్, మెగా పవర్ స్టార్ అంటే క్రష్ అంట..
రవితేజ సినిమాతో టాలీవుడ్ ను టచ్ చేయబోతున్న హీరోయిన్.. రామ్ చరణ్ పై మనసు పారేసుకుందట. మొదటి సినిమా చేయకముందే.. హీరోల గురించి తన మనసులో మాటను బయట పెట్టేసింది బ్యూటీ. ఇంతకీ ఏమంటుందంటే..?
రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో .. ప్రస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నసినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది గాయత్రి భరద్వాజ్. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది గాయత్రి.
2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ విజేతగా నిలిచిన గాయత్రి.. తర్వాత దిన్దొర తో పాటు మరో రెండు వెబ్ సిరిస్ లలో నటించింది. తన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ.. టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా మాస మహారాజ్ సరసన టైగర్ నాగేశ్వరరావుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.
ఇక తను ఎంతగానో ప్రేమించే రామ్ చరణ్ సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తానంటోంది గాయత్రి. తాజాగా ఆర్ఆర్ఆర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. చరణ్ తో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది టైగర్ నాగేశ్వరావు బ్యూటీ.
ఇన్ స్టాలో గాయత్రీ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్లను మించిన అందంతో.. ఆమె చేసే ఫోటో షూట్లు.. ఆమెకు ఫాలోయింగ్ పెరిగేలా చేశాయి. అందాలు ఆరబోస్తూ...కుర్రాళ్లకుకునుకు లేకుండా చేస్తున్నఈబ్యూటీ.. అటు మేకర్స్ కంట కూడా పడింది. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు వరుసకట్టాయి.
ఇక టైగర్ నాగేశ్వరావులో నటిస్తున్న ఆమె తాజాగాగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తెలుగులో తన ఫేవరేట్ హీరో గురించి మనసులో మాట పంచుకుంది గాయత్రి. రామ్ చరణ్ అంటే గాయత్రికి పిచ్చి ఇష్టమట. తెలుగులో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం, చరణ్ కి క్రేజీ ఫ్యాన్ ని. ఆయన అంటే క్రష్ వుంది (నవ్వుతూ) అంటూ.. వెల్లడించింది గాయత్రి.
ఇక తాను నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి చెబుతూ.. ఇందులో తను టామ్ బాయ్ తరహా పాత్ర చేసిందట. టైగర్ లో ఎవరూ ఊహించని అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు వుంటాయని, రవితేజ ఇలాంటి యాక్షన్ సినిమాని గతంలో ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చింది గాయత్రి. ఇక ఈనెల 20న రిలీజ్ కు రెడీ అవుతోంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ.