MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #Rashmika: 'లైగర్ ' గురించి మాట్లాడిన రష్మిక,షాకింగ్ స్టేట్మంట్

#Rashmika: 'లైగర్ ' గురించి మాట్లాడిన రష్మిక,షాకింగ్ స్టేట్మంట్

విజయ్, రష్మికా రిలేషన్ షిప్ మ్యాటర్ గురించి  మీడియాలో వార్తలు వచ్చినా, గతంలో ఓసారి మాది స్నేహం మాత్రమే అని రౌడీబాయ్ తేల్చేయడంతో ఇక్కడి ప్రేక్షకులు అంత వీళ్ల బంధం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అటు రష్మిక కూడా తానెవ్వరితోనూ లవ్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. ఇద్దరి మధ్యా ఉన్నది కేవలం స్నేహం అని చెప్పింది. కానీ తాజాగా 

4 Min read
Author : Surya Prakash
Published : Oct 01 2022, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
Rashmika Vijay

Rashmika- Vijay

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే, ఈ ఇద్దరి జంట డేటింగ్ చేస్తోంది, అందుకే చాలా సార్లు ముంబైలో కెమరా కంటబడ్డారని మీడియా చాలా సార్లు ప్రూవ్ చేసింది. గోవాలో న్యూయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు అని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.  తాజాగా రష్మిక తన ప్రేమను మరోసారి ఇండైరక్ట్ గా తెలియచేసింది. ఆమెను మీడియా వారు లైగర్ చిత్రంపై మీ కామెంట్ ఏమిటి అని అడిగినప్పుడు ఆమె ఏమందంటే..
 

215


కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక.. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో  స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 

315
Rashmika mandanna

Rashmika mandanna

'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ క్రష్  గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.  'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో అమితాబ్ కూడా నటించారు.  ఈ సినిమా  అక్టోబర్ 7 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి.

415
liger,rashmika

liger,rashmika


ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ యూట్యూబ్ ఛానెల్ వారు ఒకరు రష్మికను ఇంటర్వూ చేసారు. అందులో భాగంగా ...విజయ్ దేవరకొండ ప్రస్తావన తెచ్చి..అతని తాజా చిత్రం లైగర్ గురించి అడిగారు. ఆ సినిమా అన్ని చోట్లా డిజాస్టర్ అయ్యంది. దాంతో ఆమె ఎలా స్పందిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూసారు.
 

515

అయితే ఇక్కడ రష్మిక తన ప్రేమను మరో సారి చాటుకుంది. తను మాస్ మీవీ లవర్ ని కాబట్టి సినిమా మొత్తం ఎంజాయ్ చేసానని చెప్పింది. ముఖ్యంగా విజయ్ యాక్టింగ్ తనకు తెగ నచ్చిందని చెప్పుకొచ్చుంది. లైగర్ రిలీజ్ తర్వాత అతన్ని కలిసానని చెప్పుకొచ్చింది.  ఆపాత్ర కోసం విజయ్ పడ్డ కష్టం తనని బాగా ఇన్పైర్ చేసిందని చెప్పింది.

615


అలాగే ఈ సినిమాలో పాత్ర కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా ఫిజకల్ ట్రాన్సఫర్మ్ అవటం తను చాలా ఇష్టపడ్డానని అంది. అతన్ని చాలా మెచ్చుకున్నానని చెప్పింది. రష్మిక మాటలు ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. వాటిని వైరల్ చేస్తున్నారు. 

715

గీత గోవిందం తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి రష్మికతో రొమాన్స్ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో లిప్ లాక్ లతో తెగ సందడి చేశారు ఇద్దరూ. ఇక వీరు జంట అవ్వడం ఖాయం అనుకున్నారంతా.. ఆతరువాత ఎవరి సినిమాలు వారు చేస్తూన్నా.. డిన్నర్లంటూ కలవడం మొదలెట్టారు. 

815

ఇంతకు ముందు కూడా విజయ్ దేవరకొండ చిత్రం లైగర్(Liger Naked Pic) సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. అలా ఒక్కసారిగా విజయ్ నగ్నంగా కనిపించడం, పూల బొకేను అడ్డం పెట్టుకుని కనిపించడంతో లైగర్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ కాసాగింది. ఈ పోస్టర్ మీద  రష్మిక మందన స్పుందన పోస్టు వైరల్ అయ్యింది.

915

అప్పుడు రష్మిక స్పందిస్తూ... ఇది వరకు నీకు స్పూర్తి ఎవరు?అని అడిగితే.. ఎవరి పేరు చెప్పాలో అర్థమయ్యేది కాదు.. కానీ ఇప్పుడు చెబుతున్నా.. నువ్వే నాకు స్పూర్తి.. నీకు మా ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయ్.. నువ్వేంటో.. ఏం చేయగలవో అందరికీ చూపించు.. నీ లా ఎవ్వరూ చేయలేరు అంటూ రష్మిక మందన పోస్ట్ వేసింది.
 

1015

రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె 'పుష్ప2'లో నటించడానికి రెడీ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోతో ప్రేమాయణం, పెళ్లి వరకు వెళ్తుంది రష్మిక. మరిప్పుడు సెకండ్ పార్ట్ లో ఆమె క్యారెక్టర్ ను ఎలా చూపిస్తారో చూడాలి. ఇటీవలే   'పుష్ప2'  సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే 'పుష్ప' సినిమాలో చాలా మంది విలన్స్ ఉన్నారు. 

1115

ఇలా రష్మిక వరుస చిత్రాల్లో నటిస్తూ అటు సౌత్, అటు నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ‘గుడ్ బై’ ఇచ్చే ఫలితం బాలీవుడ్ లో రష్మికను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు భారీ చిత్రాలు కూడా రష్మిక చేతిలో ఉండటంతో ఎలాగైనా అక్కడ జెండా పాతేస్తుందంటున్నారు.  

1215


ప్రస్తుతం రష్మిక చేస్తున్న హిందీ సినిమా గుడ్ బై  రిలీజ్ కాకుండానే హిందీలో మరో రెండు ఛాన్స్ లను కొట్టేసింది. అందులో సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' సినిమా ఒకటి. రణబీర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటినుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో పాటు 'స్క్రూడీలా' అనే మరో సినిమా ఓకే చేసింది రష్మిక. 

1315


రష్మిక మందన్నా సినిమాల‌కు సౌత్ లో గిరాకీ ఉంటుంది. దాదాపు అందరి పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది కాబట్టి.. రష్మిక మందన్నా కంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ నే క్యాష్ చేసుకోవాలని కొందరు హిందీ నిర్మాతలు ఆశ పడుతున్నారు. ఈ క్ర‌మంలో రికార్డు స్థాయి పారితోషికం కూడా రష్మిక మందన్నా కు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు
 

1415


అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాల‌ను పూర్తి చేసిన పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా రష్మిక మందన్నా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో  పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా న‌టించ‌డం అంటే మాట‌లేమీ కాదు! కానీ, రష్మిక మందన్నా మాత్రం ఆ ఫీట్ ను అవలీలగా సాధించింది. మొత్తానికి   రష్మిక మందన్నా కెరీర్ అద్బుతంగా సాగిపోతుంది.
 

1515


డియర్ కామ్రేడ్, గీతగోవిందం సినిమాలతో రష్మిక, విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ జోడి అందరికీ నచ్చింది. ఈ ఇద్దరి మధ్యా లవ్ ఎఫైర్ వార్తలతో కొన్నాళ్లు దూరంగా గడిపారు. తర్వాత ఆ మధ్య ఈ ఇద్దరి ర్యాపో చూసి వీళ్ల మధ్య ఏదో నడుస్తుందని బాలీవుడ్ మీడియా కూడా రాసింది. ముంబైలో చాలాసార్లు రౌడీబాయ్ తో డిన్నర్ డేట్ ఎంజాయ్ చేసింది రష్మిక. లైగర్ షూటింగ్ టైమ్ లో ఒకసారి ఈ ఇద్దరూ కలిసి కనిపించారు

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image2
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Recommended image3
Chiyaan Vikram: డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోగా.. విక్రమ్ సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved