రష్మిక, సమంత, పూజా, శ్రీలీల, తమన్నా, కృతి, మీనాక్షి, మృణాల్.. సినిమాల్లోకి రాకముందే ఏం చేసేవారో తెలుసా?
చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లపైనే అందరి ఫోకస్ ఉంటుంది. హీరోయిన్ల విషయంలో చాలా సీక్రెట్లు ఉంటాయి. అలా సినిమాల్లోకి రాకముందు, హీరోయిన్ కాకముందు టాలీవుడ్ భామలు ఏంచేసేవారనేది ఆసక్తికరం. మరి మన తెలుగు ముద్దుగుమ్మలు ఏం చేసేవారనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.
టాలీవుడ్‌లో చాలా మంది కథానాయికలు స్టార్లుగా రాణిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. సమంత, రష్మిక, పూజా, శ్రీలీల, కీర్తిసురేష్, కృతి శెట్టి, మీనాక్షి, మృణాల్ వంటి భామలు హీరోయిన్లుగా అలరిస్తున్నారు. అయితే వీరు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారనేది ఆసక్తికరం. ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమె 2016లో కన్నడలో `కిర్రాక్ పార్టీ` సినిమాతో హీరోయిన్ వెండితెరకి పరిచయం అయ్యింది. తొలి చిత్రంతో ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌గా పరిచయం కాకముందు మోడలింగ్ చేసింది. బెంగుళూరులో ఓ ఈవెంట్‌లో విన్నర్‌గానూ నిలిచింది. ముంబయిలోనూ మోడల్‌గా సందడి చేసింది. ఆ తర్వాత సినిమా ఆఫర్లని అందుకుంది. అలా రిషబ్ శెట్టి రూపొందించిన `కిర్రాక్ పార్టీ`తో హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది.
సమంత.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించి, ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న సినిమాలకు రాకముందు చాలా కష్టాలే పడింది. ఈ క్రమంలో ఆమె ఫంక్షన్లు, ఈవెంట్లలో హోస్టెస్‌గా వర్క్ చేసింది. వెల్‌కమ్ గర్ల్స్ గా చేసి రోజుకి ఐదు వందలు సంపాదించింది. `ఏం మాయ చేసావె` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై, తెలుగు, తమిళంని దున్నేసింది.
పూజాహెగ్డే.. టాలీవుడ్ బుట్టబొమ్మగా పాపులర్ అయిన పూజా హెగ్డే.. 2012లో `ముగమూడి` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చింది. కానీ అంతకంటే ముందు మోడల్‌గా ఫ్యాషన్ షోస్‌లో పాల్గొని ఆకట్టుకుంది. 2009లో మిస్ ఇండియాగా ఫెయిల్ అయ్యింది. మళ్లీ అప్లై చేసి ఆ తర్వాత 2020లో మిస్ యూనివర్స్ ఇండియా ఈవెంట్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2014లో `ఒకలైలాకోసం` చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రి ఇచ్చింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇప్పుడు ఆమె కెరీర్ కాస్త డల్ అయ్యింది.
శృతి హాసన్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ కావడంతో సినిమాల్లోనే ఉంది. ఆమె తండ్రి కమల్ హాసన్ నటించిన `హే రామ్` చిత్రంలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత `తేవర్ మగన్` చిత్రంలో ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. అటు మ్యూజిక్ సైడ్ తన టేస్ట్ ని చూపిస్తూనే, హీరోయిన్‌గా ఎదిగింది. `లక్` అనే మూవీలో నటిగా మెప్పించింది. తెలుగులో 2011లో `అనగనగా ఓ ధీరుడు` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది.
మిల్కీ బ్యూటీ పాపులర్ అయిన తమన్నా సైతం తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె ఇటీవల బోల్డ్ రోల్స్ చేసి మెప్పిస్తుంది. 2005లో హిందీ మూవీ `చాంద్ కా రోషన్ చెహ్రా` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. అదే ఏడాది `శ్రీ`మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే తమన్నాకి చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. ఇండస్ట్రీకిరావాలని నిర్ణయించుకుంది. దీంతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో థియేటర్ చేసింది. కొన్ని స్టేజ్ పర్‌ఫెర్మెన్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత సినిమా ఆఫర్లు అందుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ సన్సేషన్‌గా ఉన్నది శ్రీలీల. అత్యంత క్రేజీ బ్యూటీగా నిలిచిన ఈ అమ్మడు కన్నడ మూవీ `కిస్`, `భరాతే` చిత్రాలతో ఆకట్టుకుంది. `పెళ్లిసందడి`తో పాపులర్ అయ్యింది. అయితే ఆమె ముందు డాక్టర్ చేయాలనుకుంది. ప్రస్తుతం డాక్టర్ స్టడీ కంప్లీట్ చేసింది. అంతకంటే ముందే ఆమె భరతనాట్యం నేర్చుకుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది.
keerthy suresh
కీర్తిసురేష్.. ఒకప్పటి నటి మేనక కూతురు. సినిమా టచ్ చిన్నప్పట్నుంచే ఉంది. బాలనటిగానూ నటించింది. కానీ ఆ తర్వాత ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. కానీ ఎట్టకేలకు సినిమాల్లోకి వచ్చింది. హీరోయిన్ కాకపోయి ఉంటే తాను ఫ్యాషన్ డిజైనర్ అయ్యుండేది. `మహానటి`తో విశేష ఆదరణతోపాటు ఉత్తమ జాతీయ నటిగా నేషనల్ అవార్డుని అందుకుంది. ఇటీవల ఈ అమ్మడికి విజయాలు దక్కడం లేదు.
కృతి శెట్టి `ఉప్పెన` చిత్రంతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూసింది. ప్రస్తుతం ఒకటి సినిమాలకే పరిమితమయ్యింది. అయితే కృతి శెట్టి క్యూట్ చైల్డ్ గా పాపులర్ అయ్యింది. ఆమె టీవీ యాడ్స్ చేసింది. అలా పాపులర్ అయ్యింది. వాటి ద్వారా సినిమా అవకాశాలను అందుకుంది. హిందీలో `సూపర్ 30`లో చిన్న పాత్ర పోషించింది. `ఉప్పెన` చిత్రంతో స్టార్ అయిపోయింది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం మరో సెన్సేషన్‌గా నిలిచింది మృణాల్ ఠాకూర్. ఈ భామ సినిమాల్లోకి రాకముందు పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ చేయాలనుకుంది. కానీ అది వదిలేసి సినిమా ప్రయత్నాలు చేయగా, సీరియల్స్ లో నటించే అవకాశాలు అందుకుంది. అలా టీవీ నటిగా మెప్పించిన ఆమె సినిమా ప్రయత్నాలు చేయగా, చాలా వరకు రిజెక్ట్ అయ్యింది. మరాఠి చిత్రాలతో నటిగా మారింది. `లవ్ సోనియా`తో హిందీ మూవీ చేసింది. ఆ తర్వాత అనేక స్ట్రగుల్స్ అనంతరం `సీతారామం` చిత్రంతో స్టార్ అయిపోయింది.
టాలీవుడ్‌లో మరోయంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి కూడా మోడలింగ్ నుంచి కెరీర్ ప్రారంభించింది. ఆమె 2018లో మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషన్‌లో విన్నర్‌గా నిలిచింది. ఫెమినా ఇండియాలో పాల్గొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషన్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. 2021లో `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హాట్ కేక్ అయ్యింది.