- Home
- Entertainment
- Rashmika: వీళ్ళేమైనా జెన్నిఫర్ లోఫేజ్ లు అనుకుంటున్నారా, కొంప ముంచిన డ్రెస్ .. రష్మికపై దారుణంగా ట్రోల్స్
Rashmika: వీళ్ళేమైనా జెన్నిఫర్ లోఫేజ్ లు అనుకుంటున్నారా, కొంప ముంచిన డ్రెస్ .. రష్మికపై దారుణంగా ట్రోల్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక చిరునవ్వు, ఆమె అందం యువతకి తెగ నచ్చేశాయి. దీనితో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక చిరునవ్వు, ఆమె అందం యువతకి తెగ నచ్చేశాయి. దీనితో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.
రష్మిక సైలెంట్ గా ఉండే నటి కాదు. ఎక్కువ హంగామా చేస్తూ కనిపిస్తుంది. ఇక రష్మిక అప్పుడపుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమెకి ట్రోలింగ్ కూడా ఎదురవుతుంది. ఇటీవల రష్మిక మందన గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తూ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది.
ఇటీవల రష్మిక హెచ్ టి మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ వేడుకకి హాజరైంది. ఈ ఫంక్షన్ లో రష్మిక ధరించిన డ్రెస్ ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. యువత, ఆమె ఫ్యాన్స్ అయితే రెడ్ డ్రెస్ లో రష్మిక అందాలు చూసి పిచ్చెక్కిపోయారు. కానీ ఈ డ్రెస్ వల్లే ప్రస్తుతం రష్మిక ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.
రష్మిక ధరించిన ఈ షార్ట్ డ్రెస్ చాలా పొట్టిగా ఉండడంతో పదే పదే అడ్జెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఫోటో గ్రాఫర్స్ తో రష్మిక మందన ఫోటో దిగే సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆ డ్రెస్ ఆమెకి ఏమాత్రం సౌకర్యంగా లేదు అని అర్థం చేసుకోవచ్చు.
దీనితో నెటిజన్లు రష్మికని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్రాక్షన్ కోసం ఇలా ఇబ్బందిగా అనిపించే డ్రెస్ లు వేసుకోవడం ఎందుకు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మన ఇండియన్ డ్రెస్సుల్లో హీరోయిన్లు చాలా అందంగా, హాట్ గా ఉంటారు. వాళ్ళకి ఆ విషయం అర్థం కావడం లేదు. పైగా అవి కంఫర్టబుల్ అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. వెస్ట్రన్ డ్రెస్ లు వేసుకోవడానికి వీళ్ళేమైనా జెన్నిఫర్ లోపేజ్ లు అనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం కూడా రష్మిక ఇలాగే ట్రోలింగ్ కి గురైంది. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి హాజరైనప్పుడు కూడా రష్మిక అన్ కంఫర్టబుల్ డ్రెస్ లో కనిపించింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక ఇళయదళపతి విజయ్ 66వ చిత్రంలో నటిస్తోంది.