MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 'థామా' కోసం రష్మిక పడ్డ కష్టం చూశారా..గాయాలైనా లెక్క చేయకుండా, వైరల్ ఫోటోస్

'థామా' కోసం రష్మిక పడ్డ కష్టం చూశారా..గాయాలైనా లెక్క చేయకుండా, వైరల్ ఫోటోస్

Rashmika Mandanna: ఇటీవల విడుదలైన థామా చిత్రంలో నటనకి గాను రష్మికకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తన కష్టాన్ని తెలియజేస్తూ రష్మిక ఫోటోలు షేర్ చేసింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 22 2025, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
థామా మూవీ 
Image Credit : Asianet News

థామా మూవీ 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. ఆమె నటించిన థామా చిత్రం మంగళవారం రోజు రిలీజ్ అయింది.హారర్ చిత్రంగా విడుదలైన థామాలో రష్మిక నటన అదరగొట్టింది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్ర సెట్స్‌లో గడిపిన అనుభవాలను రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
రష్మిక షేర్ చేసిన లొకేషన్ ఫోటోస్ 
Image Credit : Asianet News

రష్మిక షేర్ చేసిన లొకేషన్ ఫోటోస్ 

ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలు, వీడియోను షేర్ చేస్తూ, ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొంది. ఈ ఫోటోలలో రష్మికతో పాటు నటుడు అయుష్మాన్ ఖురానా, దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ కనిపించారు.

39
గాయాలతో సాగిన ప్రయాణం 
Image Credit : Asianet News

గాయాలతో సాగిన ప్రయాణం 

రష్మిక తన పోస్ట్‌లో, “ఇది హృదయం, కృషి, నవ్వులు, గాయాల మధ్య సాగిన అందమైన ప్రయాణం” అని రాశారు. ఆమె తడక అనే పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రను సినిమాలో “మొదటి వెలుగుకిరణంగా కనిపించే ఒక రహస్యమైన వ్యాంపైర్”గా పరిచయం చేశారు. తడక పాత్ర రహస్యత, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

49
కీలక పాత్రల్లో వారు
Image Credit : Asianet News

కీలక పాత్రల్లో వారు

థామా మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగం. ఈ ఫ్రాంచైజ్‌లోని ప్రతి చిత్రంలాగే, థామా కూడా భయపెట్టే అంశాలతో పాటు హాస్యాన్ని సమపాళ్లలో కలిపి వినోదాన్ని అందిస్తుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించారు.

59
థామా ఒక పాఠం లాంటిది 
Image Credit : Asianet News

థామా ఒక పాఠం లాంటిది 

రష్మిక తన సహ నటీనటుల గురించి మాట్లాడుతూ, “అయుష్మాన్ ఖురానా, పరేష్ రావల్ తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా అనిపించింది. వారితో గడిపిన ప్రతి క్షణం ఒక పాఠం లాంటిది. ఈ చిత్ర బృందం అద్భుతంగా పని చేసింది” అని అభిప్రాయపడింది.

69
థామా కలెక్షన్స్ 
Image Credit : Asianet News

థామా కలెక్షన్స్ 

దిగ్గజ నిర్మాత దినేష్ విజన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన రోజే ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. ట్రేడ్ రిపోర్ట్‌ల ప్రకారం, థామా మొదటి రోజే రూ.24.87 కోట్లు వసూలు చేసింది. ఇది రష్మిక కెరీర్‌లో ఉత్తమ ఓపెనింగ్ కలిగిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

79
రష్మిక నటనకు ప్రశంసలు 
Image Credit : Asianet News

రష్మిక నటనకు ప్రశంసలు 

దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ రూపొందించిన ఈ హారర్ కామెడీ, విజువల్ ఎఫెక్ట్స్, కథలోని వైవిధ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రష్మిక పోషించిన తడక పాత్రకు ప్రత్యేక అభినందనలు లభిస్తున్నాయి. ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆమె లుక్స్‌, నటన గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

89
త్వరలో మరో చిత్రం రిలీజ్ కి రెడీ 
Image Credit : Asianet News

త్వరలో మరో చిత్రం రిలీజ్ కి రెడీ 

రష్మిక మందన్న ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల రష్మిక నటించిన చిత్రాలు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. పుష్ప 2, ఛావా, కుబేర లాంటి చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

99
రష్మిక కష్టానికి నిదర్శనం 
Image Credit : Asianet News

రష్మిక కష్టానికి నిదర్శనం 

థామా షూటింగ్ సమయంలో తీసిన ఈ బీహైండ్ ద సీన్స్ క్షణాలు రష్మిక అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. రష్మిక షేర్ చేసిన ఫోటోలు థామా మూవీలో ఆమె కష్టాన్ని తెలియజేస్తున్నాయి. రేష్మిక షూటింగ్ లో గాయపడ్డ దృశ్యాలని కూడా అభిమానులతో పంచుకుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
చావు బ్రతుకుల్లో నిర్మాత, ఆసుపత్రులన్నీ చేతులెత్తేశాయి.. చిరంజీవి ఒక్కరే ఏం చేశారో తెలుసా
Recommended image2
భరణిని కావాలనే ఎలిమినేట్ చేయించారా, కారణం అదే ? దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved