MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Love Tips: నాకింకా ఆ వయసు రాలేదంటూ మ్యారేజ్‌పై నేషనల్‌ క్రష్‌ షాకింగ్‌ కామెంట్‌.. ట్రెండింగ్‌

Rashmika Love Tips: నాకింకా ఆ వయసు రాలేదంటూ మ్యారేజ్‌పై నేషనల్‌ క్రష్‌ షాకింగ్‌ కామెంట్‌.. ట్రెండింగ్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రేమ, రిలేషన్‌షిప్‌, మ్యారేజ్‌పై స్పందించింది. తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పేసింది. అంతేకాదు ప్రేమ గురించి కొన్ని చిట్కాలు కూడా చెప్పింది. దీంతో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 16 2022, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్నా(Rashmika Mandanna).. నేషనల్‌ క్రష్‌గా పాపులర్ అయ్యిందీ భామ. హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఊహించని బ్యాక్‌ టూ బ్యాక్‌ సక్సెస్‌లతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుని ఇప్పుడు టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. చలాకీతనం, చిలిపితనం, అన్‌లిమిటెడ్‌ ఎనర్జీ సొంతం చేసుకున్న రష్మిక క్రేజీ స్టార్‌గా నిలుస్తుంది. స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. 

27

ప్రస్తుతం తెలుగులో `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తున్న Rashmika.. బాలీవుడ్‌లోనూ దూసుకుపోతుంది. అక్కడ మూడు సినిమాలు `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై` తోపాటు మరో సినిమా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. మరోవైపు తమిళంలోనూ విజయ్‌తో చేయబోతుంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక.. తాజాగా లవ్‌, రిలేషన్‌షిప్‌, మ్యారేజ్‌పై స్పందించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

37

ముంబయిలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా మాట్లాడుతూ, ప్రేమలో మాట్లల్లో వర్ణించలేమని చెప్పింది. అది కేవలం ఫీలింగ్‌కి సంబంధించినదని, దాన్ని మాటల రూపంలో వ్యక్తం చేయడం కష్టమని పేర్కొంది. రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు టైమ్‌ కేటాయించుకోవాలని, అదే సమయంలో గౌరవించుకోవాలని, అప్పుడే అది ప్రేమగా మారుతుందని, లవ్‌ రెండు వైపులా ఉంటేనే ఆ రిలేషన్‌ బలపడుతుందని, ముందుకు సాగుతుందని చెప్పింది రష్మిక. 

47

ఇక తన మ్యారేజ్‌పై రష్మిక స్పందిస్తూ, ప్రస్తుతానికి మ్యారేజ్‌ చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. ప్రస్తుతం తనకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని చెప్పింది. పెళ్లి గురించి ఎలా ఆలోచించాలో తెలియడం లేదని, పెళ్లికి సంబంధించిన థాట్స్ ని తన మనసులోకి రానివ్వడం లేదని చెప్పింది చెప్పింది రష్మిక. 

57

అయితే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో మాత్రం రివీల్‌ చేసింది. ఎవరైతే ప్రేమగా, సురక్షితంగా చూసుకుంటారో వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తను కూడా ప్రేమకే ప్రయారిటీ ఇస్తారనే విషయాన్ని వెల్లడించిందీ నేషనల్‌ క్రష్‌.  ప్రస్తుతం రష్మిక చెప్పిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు రష్మిక చెప్పిన క్వాలిటీస్‌ ఉన్నవాళ్లు క్యూలో నిల్చునే పనిలో పడ్డారు. 

67

ఇటీవల అల్లు అర్జున్‌తో కలిసి `పుష్ప` చిత్రంలో నటించి ఆకట్టుకుంది రష్మిక. శ్రీవల్లిగా డీ గ్లామర్‌ రోల్‌లో మెప్పించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది రష్మిక. అయితే అంతకు ముందే కన్నడ, తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేసిన నేపథ్యంలో ఆమెకి అన్ని భాషల్లోనూ పాపులారిటీ ఉంది. కానీ `పుష్ప`తో ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంతోపాటు `పుష్పః ది రూల్‌` సినిమాతోనూ సందడి చేసేందుకు రెడీ అవుతుంది. 

77

శర్వానంద్‌, రష్మిక మందన్నాతోపాటు ఖుష్బు, రాధికా, ఝాన్సీ వంటి వారు కలిసి నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బిజీగా గడుపుతుంది రష్మిక మందన్నా. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image2
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image3
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved