- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్ రష్మిక మందన్నా స్టన్నింగ్ పోజులు.. చేతులు పైకెత్తి విరహంతో సెగలు రేపుతున్న నేషనల్ క్రష్
బ్లాక్ డ్రెస్ రష్మిక మందన్నా స్టన్నింగ్ పోజులు.. చేతులు పైకెత్తి విరహంతో సెగలు రేపుతున్న నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అందాల ఆరబోతలో లైన్ క్రాస్ చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో తరచూ ట్రోల్స్ కి గురవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త జర్నీ ప్రారంభిస్తుంది రష్మిక.

రష్మిక మందన్నా తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. ఆమె టాప్ టూ బాటమ్ బ్లాక్ ధరించి హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోసింది. విరహంతో కూడిని పోజులిచ్చింది. చేతులు పైకెత్తి మరీ రెచ్చగొడుతుంది. మరోవైపు కవ్వించే చూపులతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుందీ శ్రీవల్లి.
రష్మిక మందన్నా ఇంతటి హాట్‌గా మారడంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. అసలే గ్లామర్ డోస్, హాట్ డోస్ పెంచుతూ మంటలు పుట్టిస్తుంది రష్మిక. ఎండకాలం ప్రారంభంలోనే చెమటలు పట్టిస్తుంది. దానికి తోడు ఇప్పుడు బ్లాక్ డ్రెస్‌లో టెంప్టింగ్ పోజులతో అదరగొట్టింది.
ఇదిలా ఉంటే రష్మిక ఓ కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. జపాన్ ప్రొడక్ట్ కి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఒనిట్సుకా టైగర్ అనే షూస్ బ్రాండ్‌కి రష్మిక ప్రచార కర్తగా నియమించబడింది. ఫస్ట్ టైమ్ ఇండియాలో లాంచ్ అవుతున్న ఈ ప్రొడక్ట్ కి తొలి ప్రచారకర్తగా రష్మిక వ్యవహరించడం విశేషం. ఈ విషయాన్ని ఆమె వెల్లడిస్తూ తన సంతోషాన్ని పంచుకుంది.
రష్మిక మందన్నా ఇటీవల ముంబయిలో ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఇందులో ఆమె ట్రెండీ వేర్‌లో మెరిసింది. సోషల్ మీడియాని షేక్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. కొత్త బ్రాండ్‌కి ప్రమోటర్‌గా, సరికొత్త లుక్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.
రష్మిక మందన్నా అతితక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. కన్నడలో స్టార్ట్ చేసిన తన జర్నీని నెమ్మదిగా టాలీవుడ్, అట్నుంచి బాలీవుడ్ వరకు వెళ్లింది. అంతర్జాతీయంగా సత్తా చాటాలనే డ్రీమ్‌తో ముందుకు సాగుతుందట రష్మిక. మరి ఆమె కోరిక నెరవేరుతుందా చూడాలి.
ఇక తెలుగులోకి `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. నాగశౌర్యతో కలిసి నటించి హిట్ అందుకుంది. తన చలాకీతనం, చురుకుతనం, తెలివి తేటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే `గీతగోవిందం`లో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఇందులో ఆమె నటన ఆద్యంతం మెప్పిస్తుంది.
`గీతగోవిందం` సంచలన విజయం సాధించడంతో రష్మిక మందన్నా టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు, స్టార్ హీరయిన్‌గానూ మారిపోయింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. ఒకటి రెండు డిజప్పాయింట్‌మెంట్లు మినహా ఆల్మోస్ట్ విజయాలనే సొంతం చేసుకుంది.
`గీతగోవిందం`, `దేవదాస్`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప` చిత్రాలు అదిరిపోయే విజయాలను అందించాయి. `డియర్ కామ్రేడ్`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలు మాత్రం దారుణంగా బోల్తా కొట్టాయి. కానీ `పుష్ప` సక్సెస్ రష్మిక రేంజ్‌నే మార్చేసింది. పాన్ ఇండియా హీరోయిన్‌ని చేసింది.
బాలీవుడ్‌లోనూ ఆఫర్లు దక్కించుకుంటూ రాణిస్తుంది రష్మిక. `మిషన్ మజ్ను`తో మెప్పించింది. `గుడ్ బై`తో డిజప్పాయింట్ అయ్యింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ `యానిమల్`లో నటిస్తుంది.
సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌కి జోడీగా నటిస్తుంది రష్మిక. దీంతోపాటు `పుష్ప2`లోనూ భాగమైంది. ఈ రెండు సినిమాలు ఆడితే రష్మిక రేంజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.