- Home
- Entertainment
- `మనం కొట్టినం`.. `కింగ్డమ్` ఫలితంపై రష్మిక మందన్నా క్రేజీ పోస్ట్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటో తెలుసా?
`మనం కొట్టినం`.. `కింగ్డమ్` ఫలితంపై రష్మిక మందన్నా క్రేజీ పోస్ట్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటో తెలుసా?
విజయ్ దేవరకొండ తాజాగా `కింగ్‌డమ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫలితంపై రష్మిక మందన్నా స్పందించింది. అదిరిపోయే పోస్ట్ పెట్టింది.

జులై 31న గ్రాండ్‌గా విడుదలైన `కింగ్డమ్`
విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన మూవీ `కింగ్‌డమ్`. `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గురువారం(జులై 31)న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.
నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చాలా వరకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ నుంచి రెస్పాన్స్ బాగుంది. తెలుగు ఆడియెన్స్ నుంచి కొంత మిశ్రమ స్పందన లభిస్తోంది.
KNOW
`కింగ్డమ్` మూవీపై రష్మిక రియాక్షన్
సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. విజయ్ దేవరకొండకి అభినందనలు తెలియజేస్తున్నారు. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రియాక్షన్ వస్తోంది. అయితే ఇవన్నీ ఓ ఎత్తైతే, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా రియాక్షన్ మరో ఎత్తుగా చెప్పొచ్చు.
ఈ చిత్రానికి సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. `మనం కొట్టినం` అనే కామెంట్ పెద్ద రచ్చ చేస్తోంది.
రష్మికకి విజయ్ దేవరకొండ రియాక్షన్
`కింగ్డమ్` మూవీ తెలుగు స్టేట్స్ లో విడుదలైన వెంటనే రష్మిక మందన్నా ట్విట్టర్‌లో ఈ పోస్ట్ పెట్టింది. ఇందులో రష్మిక ఏం చెప్పిందనేది చూస్తే, `విజయ్ దేవరకొండ ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత అర్థమవుతుందో నాకు తెలుసు. మనం కొట్టినం` అని పేర్కొంది.
విజయ్ దేవరకొండని ట్యాగ్ చేస్తూ లవ్, ఫైర్ ఎమోజీలను పంచుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది. దీనికి విజయ్ కూడా స్పందించారు. `మనం కొట్టినం` అని లవ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో వీరి పోస్ట్ లు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
“MANAM KOTTINAM”🔥#Kingdom— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025
`కింగ్డమ్` మూవీపై స్పందన ఇదే
విజయ్ దేవరకొండ ఎట్టకేలకు హిట్ కొట్టారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు. ఇన్నాళ్ల తర్వాత హిట్ వచ్చిందని సంబరపడుతున్నారు. అయితే సినిమాకి కొంత నెగటివ్ టాక్ కూడా ఉన్న నేపథ్యంలో స్పష్టమైన రిజల్ట్ కలెక్షన్ల విషయంలో తెలుస్తుంది.
మరి ఈ మూవీ ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ ని రాబడుతుందో చూడాలి. కథ, కథనం పరంగా కొన్ని మైనస్ లు ఉన్నా, ఈ చిత్రం కమర్షియల్‌గా బాగా ఆడుతుందనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వ్యక్తమవుతుంది.
ఎమోషనల్ కామెంట్ చేసిన విజయ్
మరోవైపు గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఎమోషనల్‌గా ఉందని అన్నారు.
యూఎస్ ప్రీమియర్స్ పడినప్పట్నుంచి వరుసగా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయని, వాళ్లంతా మనం కొట్టినం అన్నా అని అంటుంటే ఎమోషనల్‌గా ఉందని, కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాని, మా మేనేజర్ ఏడ్చేస్తున్నాడని, అమ్మ కూడా ఎమోషనల్ అవుతుందని చెప్పారు విజయ్.
తిరుమల వెంకన్న ఆశీస్సులున్నాయి. ప్రజల ప్రేమ, మీడియా ప్రేమతోనే ఇదంతా సాధ్యమైందన్నారు విజయ్. మరి నిజంగానే సినిమా ఏం రేంజ్‌లో ఆడబోతుందో చూడాలి.