Rashmi Gautam: పాలరాతితో చెక్కిన శిల్పంలా రష్మీ.. చీరకట్టులో బ్యాక్ సొగసు అదుర్స్, మైమరపించే ఫోజులు
తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. వైట్ శారీ, పింక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రష్మీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఫోజులు ఇచ్చింది.
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది.
రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు.
బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా Sudigali Sudheer, Rashmi Gautam కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.
లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు.
తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. వైట్ శారీ, పింక్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రష్మీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోస్ లో రష్మీ పాలరాతి శిల్పం లాగా మెస్మరైజ్ చ్చేస్తోంది.
గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది. బ్యాక్ అందాలతో కవ్వించేలా ఇచ్చిన కొన్ని ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. రష్మీ చీరకట్టులో రెట్టింపు అందంతో వెలిగిపోతోంది.
రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలంగా సుధీర్, రష్మిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ సుధీర్ జబర్దస్త్ ని వీడడం హాట్ టాపిక్ గా మారింది.