- Home
- Entertainment
- నాగార్జున, వెంకటేష్ లతో రొమాన్స్ చేసి, చిరంజీవికి మాత్రం అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
నాగార్జున, వెంకటేష్ లతో రొమాన్స్ చేసి, చిరంజీవికి మాత్రం అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
మెగాస్టార్ చిరంజీవితో అప్పటి హీరోయిన్లు అందరు నటించారు. ఒక్క సినిమా అయినా చేసిన వారు ఉన్నారు. కాని ఒకేఒక్క హీరోయిన్ మెగాస్టార్ కు జంటగా నటించలేదు. కాని ఆతరువాత కాలంలో ఆయనకు అక్కగా నటించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం చిరంజీవి రెండు క్రేజీ ప్రాజెక్టులపై పని చేస్తున్నారు. ఒకటి దర్శకుడు వశిష్ఠతో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా "విశ్వంభర", మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న "శంకర్ వరప్రసాద్ గారు" అనే సినిమా.చివరిగా ఆయన నటించిన "భోళా శంకర్" సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ తదుపరి ప్రాజెక్టులపై మాత్రం భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాల్లో తనతో నటించిన నటీమణుల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తిరిగి వెలుగులోకి వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు నటించారు, చిరంజీవి జంటగా నటించి స్టార్డమ్ సంపాదించినవారు కూడా ఉన్నారు. మెగాస్టార్ తో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే 90స్ లో బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఒకరు చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు. నాగార్జున, వెంకటేష్ లతో హీరోయిన్‌గా రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్ చిరంజీవి జంటగా నటించలేదు. తరువాత కాలంలో మాత్రం మెగాస్టార్ కు ఓ సినిమాలో అక్క పాత్రలో కనిపించారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా కుష్బూ.
చిరంజీవితో కుష్బూ అక్కగా నటించిన సినిమా ఏదో కాదు స్టాలిన్. 2006లో విడుదలైన "స్టాలిన్ ను ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ఖుష్బూ, చిరంజీవికి అక్కగా నటించారు. ఈ పాత్రలో ఆమె చేసిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే మెగాస్టార్ పక్కన ఓ కమర్షియల్ యాడ్ లో మాత్రం కుష్బు భార్యగా నటించారు.
ఖుష్బూ సుందర్ సినీ రంగంలో తన ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలు పెట్టారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో "కలియుగ పాండవులు" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. వెంకటేష్ కూడా ఈసినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక కలియుగ పాండవులు సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.
నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఖుష్బూ, చిరంజీవి సినిమాలో మాత్రం అక్క పాత్ర చేయడం ఒక ప్రత్యేకమైన విషయంగా గుర్తించబడుతోంది. ప్రస్తుతం ఖుష్బూ సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు. ఆమె భారతీయ జనతా పార్టీ (BJP)లో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు.తాజాగా ఖుష్బూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 54 ఏళ్ల వయసులోనూ ఆమె అందంతో ఆకట్టుకుంటున్నారు. అభిమానులు ఆమెపై ఇప్పటికీ అదే స్థాయి ప్రేమ చూపిస్తున్నారు. తమిళనాడులో ఖుష్బూ కోసం ఒక గుడిని కూడా నిర్మించినట్లు సమాచారం.