- Home
- Entertainment
- 250 కోట్లతో లగ్జరీ బంగ్లా కట్టుకున్న హీరో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇంట్లో ప్రత్యేకతలు ఏంటంటే?
250 కోట్లతో లగ్జరీ బంగ్లా కట్టుకున్న హీరో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇంట్లో ప్రత్యేకతలు ఏంటంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఒకరిని మించి మరొకరు లగ్జరీ ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కలల ఇంటి కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. రీసెంట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ హీరో హీరోయన్ 250 కోట్లతో లగ్జరీ హౌస్ ను నిర్మించుకున్నారు. ఇంతకీ ఎవరా జంట.

ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్స్ ప్రేమ పెళ్లిల్లు చేసుకుని హ్యాపీగా జీవితం సాగిస్తున్నారు. ఇండస్ట్రీలో కలిసి సినిమాలు చేసి, ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న కొంత మంది జంటలు, లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. కోట్లు పెట్టి కొత్త ఇల్లు కట్టుకుని ఫ్యాన్స్ కు కనువిందు చేస్తున్నారు. అలాంటి జంటల్లో బాలీవుడ్ క్యూ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కూడా ఉన్నారు. వారు ఈమధ్య కాలంలో భారీగా ఖర్చు పెట్టి పెద్ద ఇంటిని నిర్మింకున్నారు. ఈ ఇల్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
KNOW
బాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా రణబీర్ కపూర్, అలియా భట్ పేరు తెచ్చుకున్నారు. దాదాపు 5 ఏళ్లు డేటింగ్ తరువాత ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట, రీసెంట్ గా కొత్త ఇంటిని కూడా నిర్మించుకున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా–పాలి హిల్స్ లో దాదాపు 250 కోట్ల విలువైన లగ్జరీ ఇంటిని వారు నిర్మించుకున్నారు. ఇది గతంలో రణబీర్ కుటుంబానికి చెందిన కృష్ణరాజ్ బంగ్లా స్థలంలోనే నిర్మించబడుతోంది.
ఈ ఇంటిని రణబీర్–ఆలియా తమ కుమార్తె రాహా కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. రిపోర్టుల ప్రకారం, ఇది పలు అంతస్తులు కలిగి, సకల సౌర్యాలతో, అడ్వాన్స్ టెక్నాలజీతో నిర్మించబడుతున్నట్టు సమాచారం. అంతే కాదు ఆ ఇంట్లో ఉండే ప్రత్యేకతలు ఇవే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంట్లో జిమ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, పర్సనల్ సినిమా థియేటర్, ఆఫీస్ స్పేస్, ప్రైవేట్ బార్, లైబ్రరీ, గేమ్ జోన్, ప్లే రూమ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. కార్ల కోసం పెద్ద గ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన లిఫ్ట్ సిస్టమ్ ద్వారా కార్లు నేరుగా ఇంటి హాలుకు వెళ్లేలా ప్రత్యేక డిజైన్ చేశారు.
ఇతర ఇంటీరియర్ అంశాలలో అత్యుత్తమ టైల్స్, ఫర్నిచర్, డిజైన్ లాంప్స్, డిఫరెంటో పెయింటింగ్స్ ను ప్రపంచం నలుమూలల నుండి తీసుకువచ్చి అమర్చారు. ఈ ఇంటి ఇంటీరియర్ వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో లీక్ కావడంతో అది వైరల్ అయింది. అయితే, దీనిపై అలియా భట్ తీవ్రంగా స్పందించినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
రణబీర్ ప్రస్తుతం "యానిమల్ 2" చిత్రానికి సిద్ధమవుతుండగా, అలియా భట్ కూడా పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఈ జంట 2022లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కాగా.. కొత్త ఇంట్లో తమ జీవితంలో సరికొత్తగా ప్లాన్ చేసున్నారు. ఈ బాలీవుడ్ జంట. ఈ ఇంటి పూర్తి నిర్మాణం దీపావళి నాటికి పూర్తవుతుందని, అప్పటి నుంచి ఇది వారి ప్రధాన నివాసంగా మారనుందని సమాచారం.