జయసుధ కు జ్వరం వస్తే, రాత్రంత సపర్యలు చేసిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
సహజ నటి జయసుధకు సినీ,రాజకీయ రంగాలలో ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. స్నేహితులు ఉన్నారు. అయితే కాని ఏకంగా ఓ ముఖ్యమంత్రి జయసుధకు సపర్యలు చేశారని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా సీఎం.

టాలీవుడ్ లో సహజనటి అంటే జయసుధ మాత్రమే గుర్తుకు వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఆమెను మించి ఆ పేరు తెచ్చుకున్న నటి లేదనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి కృష్ణ, శోభన్ బాబు వరకూ, మురళీ మోహన్ నుంచి మోహన్ బాబు వరకూ రెండు జనరేషన్ హీరోలతో ఆడిపాడింది జయసుధ. ఆమె నటకు ఎంతో మంది ఆడియన్స్ ఫిదా అయ్యారు. అప్పటికీ ఇప్పటికీ జయసుధ నటన అభిమానులను అలరిస్తూనే ఉంది. హీరోయిన్ గా, అక్కగా, వదినగా, తల్లిగా, భామ్మగా.. కెరీర్ లో ఎన్నో అద్భుతమై పాత్రలు పోషించింది జయసుధ. మూడు తరాల తారలతో ఆమె నటించి మెప్పించింది. మొదటి తరం హీరోల జంటగా నటించిన సహజనటి, ఆతరువాత తరం హీరోలకు అమ్మగా కనిపించింది. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలకు నానమ్మగా నటిస్తోంది.
అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనకెరీర్ లో జరిగిన సంఘటనలు, విశేషాలను గుర్తు చేసుకుంటుంటుంది. ఈక్రమంలోనే జయసుధ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రీసెంట్ గా వెల్లడించింది. ఓ సందర్భంలో తనకు జ్వరం వస్తే.. ఏకంగా ముఖ్యమంత్రి వచ్చి సపర్యలు చేసిన విషయాన్ని ఆమె వెల్లడించారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు తమిళనాడు అంతా అమ్మ అని పిలుచుకునే తలైవి, దివంగత జయలలిత. అయితే జయసుధకు ఆమె దగ్గరుండి సపర్యలు చేసే సమయానికి ఆమె ముఖ్యమంత్రి కాలేదు. అప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
రీసెంట్ గా ఇంటర్వ్యూలో లో జయసుధ మాట్లాడుతూ..'' హీరోయిన్లలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో జయలలిత కూడా ఒకరు. కాని ఆమె రెగ్యులర్ గా మాట్లాడేవారు కాదు. కలిసినప్పుడు మాత్రం చాలా ప్రేమగా ఉండేవారు. సాధారణంగానే జయలలిత చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. పెద్దగా ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. అయితే ఒక సారి ఇద్దరం ఒక షూటింగ్ కోసం ఒకే హోటల్ లో దిగాం. నాతో ఎప్పుడూ మా అమ్మగారు ఉండేవారు. కాని అప్పుడు మాత్రం మా నాన్నగారు వచ్చారు. అప్పుడు నాకు బాగా జ్వరం వచ్చింది. రోజంతా నన్నా నా పక్కనే ఉండి సేవలు చేశారు. ఇక నైట్ అవ్వగానే నాన్న ఒక్క సారి కిందకి వెళ్లి వస్తాను కాస్త అటు ఇటు తిరిగి వస్తాను అని చెప్పి వెళ్లిపోయారు''.
''రోజంతా రూమ్ లోనే ఉండి నన్ను చూసుకునేవరకూ ఆయనకు కాస్త గాలి పీల్చుకోవాలి అనిపించి వెళ్లారు. అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుని జయలలిత రూమ్ కు వచ్చారు. నేను పక్క రూమ్ లో ఉన్నానని తెలిసి నా దగ్గరకు వచ్చారు. నాకు బాలేదని తెలిసి ప్రేమగా పలకరించారు, దగ్గర ఉండి సపర్యలు చేశారు. షూటింగ్ కు వెళ్లి వచ్చి అలసిపోయినా సరే రాత్రి వరకూ నాదగ్గరే ఉండి, తడి క్లాత్ తో తూడవడం లాంటివి చేశారు. నేను హీరోయిన్ గా మాత్రమే జయకు తెలుసు, అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. కాని ఆమె నా దగ్గర ఉండి నాన్న వచ్చిన తరువాత ఆమె వెళ్లిపోయారు''.
''అలా జయలలిత మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవకాశాలు లేక నేను నష్టాల్లో ఉన్నప్పుడు, నా పరిస్థితి తెలిసి వెంటనే ఆమె స్పందించారు. జయటీవీలో రెండు సీరియల్స్ చేసుకోమని ఆఫర్ కూడా ఇచ్చారు'' అని జయలలిత మంచితనం గురించి వివరించారు జయసుధ. జయసుధ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి''.
సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన జయసుధ, గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు. పలు పార్టీలు మారుతూ వచ్చిన జయసుధ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల సినిమాల సంఖ్య తగ్గించిన ఆమె, ప్రత్యేకత ఉన్న పాత్రలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. అప్పుడప్పుడు నటిస్తూ, సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు జయసుధ.