- Home
- Entertainment
- కత్తిలాంటి పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న రానా వైఫ్.. హీరోయిన్లకి మించిన అందంతో పిచ్చెక్కిస్తున్న మిహీకా
కత్తిలాంటి పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న రానా వైఫ్.. హీరోయిన్లకి మించిన అందంతో పిచ్చెక్కిస్తున్న మిహీకా
హీరో రానా వైఫ్ మిహీకా బజాజ్.. పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌ని గడుపుతుంటారు. తన వ్యాపారం, ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు గ్లామర్ ఫోటో షూట్లతోనూ ఆకట్టుకుంటున్నారు.

రానా.. విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన హీరోగానే కాకుండా నెగటివ్ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తున్నారు. `బాహుబలి`, `భీమ్లా నాయక్` వంటి సినిమాల్లో నెగటివ్ రోల్‌లో మెప్పించిన విషయం తెలిసిందే. హీరోగానూ అలరిస్తున్నారు. అయితే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేసే రానా.. మూడేళ్ల క్రితం ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే.
ఇంటీరియర్ డిజైనర్ మిహీకా బజాజ్‌ని ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరిద్దరు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి సెట్ అయ్యాక ఆ విషయాన్ని బయటపెట్టారు రానా. 2020లో కరోనా సమయంలో కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ ప్రముఖుల సమయంలో వీరి వివాహం జరిగింది.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది రానా వైఫ్. తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటుంది. అదే సమయంలో గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ షాకిస్తుంది. ట్రెండీ వేర్‌లో అందంగా ముస్తాబై మెప్పిస్తుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో మిహీకా హీరోయిన్లని మించిన గ్లామర్‌తో కట్టిపడేస్తుండటం విశేషం.
లేటెస్ట్ ఫోటో షూట్లలో మిహీకా చాలా అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కత్తిలాగా ఉంది. కత్తిలాంటి పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ బ్యూటీ ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే అనేంతగా ఆమె ఫోటో షూట్లు చేయడం విశేషం. ప్రస్తుతం ఆమె తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఆమె `హలో` అనే సెలబ్రిటీ మేగజీన్ కోసం ఇలా అందంగా ముస్తాబై పోజులిచ్చింది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు రియాక్ట్ అవుతూ, చాలా మంది హీరోయిన్లకంటే సూపర్‌గా ఉన్నావని, హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటున్నారు. హీరోయిన్ల మించిన అందం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లోకి వస్తే ఊపేస్తావని సలహాలు కూడా ఇస్తున్నారు.
ఇలా సోషల్ మీడియా అటెన్సన్‌ని తనవైపు తిప్పుకుంది రానా వైఫ్. నెట్టింట రచ్చ చేస్తుంది. మరోవైపు ఇటీవల ఆమె ప్రెగ్నెంట్ రూమర్స్ ని ఫేస్ చేసిన విషయం తెలిసిందే. కానీ అందులో నిజం లేదని తెలిపింది. ప్రస్తుతం తన వ్యాపారంలో బిజీగా ఉంది. రానా, మిహీకా ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తూ హ్యాపీగా గడుపుతున్నారు. మరి ఈ ప్రెగ్నెంట్ రూమర్స్ ని ఎప్పుడు నిజం చేస్తారో చూడాలి. అభిమానులు మాత్రం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక రానా.. `విరాటపర్వం` చిత్రం తర్వాత కొంత బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `నేనే రాజు నేనే మంత్రి` సినిమాకి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారట. దీంతోపాటు ఒకటి రెండు కొత్త స్క్రిప్ట్ లకు ఆయన ఓకే చేసినట్టు సమాచారం.