MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • లీక్ : రజనీ ‘వేట్టయాన్ ’లో రానా క్యారక్టర్,టెక్నాలిజీతోనే ...

లీక్ : రజనీ ‘వేట్టయాన్ ’లో రానా క్యారక్టర్,టెక్నాలిజీతోనే ...

బూటకపు ఎన్‌కౌంటర్స్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్‌  ఓ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు

2 Min read
Author : Surya Prakash
Published : Apr 14 2024, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


తెలుగు పరిశ్రమలో  మల్టీ టాలెంటెడ్‌ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన ఖాతాలో ఒక్క హిట్‌ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. ఎంతో ఆసక్తి రేపిన విరాట పర్వం చిత్రం మినిమం ఓపినింగ్స్ కూడా రప్పించుకోలేకపోయింది. దీంతో మరో హిట్‌ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు.  అలాగే రజనీకాంతో చిత్రంలోనూ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


రీసెంట్ గా రజనీకాంత్ ‘వేట్టయాన్ ’ సెట్స్‌లో జాయిన్  అయ్యారు రానా. రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్  ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ , ఫాహద్‌ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్  ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్‌’ లేటెస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. ఈ చిత్రంలో రానా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని సమాచారం.

37
Actor Rana Daggubattis

Actor Rana Daggubattis


తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమాలో రానా టెక్నికల్ గా సౌండ్ గా ఉంటూ మోసాలకు పాల్పడే ఓ క్రూయాల్టి మెంటాలిటీ ఉన్న తెలివైన వాడుగా  కనిపించనున్నారు. అతను ల్యాప్‌టాప్‌ని హ్యాక్ చేసి, బగ్ చేయడంలో నిష్టాణుతుడై ఉంటాడు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉండే విలన్ పాత్ర అది అనితెలుస్తోంది.  

47

అలాగే రానా ఓ కార్పోరేట్ ఆఫీస్ నుంచి పని చేస్తూంటాడు. చాలా స్టైలిష్ గా  ఉంటూ మోసాలు చేయటంలో పండిపోయిన డార్క్ షేడ్స్ కలిగినవాడు అని చెప్తున్నారు. అభిమన్యు చిత్రం అర్జున్ పాత్ర తరహాలో రానా క్యారక్టరైజేషన్ ఉండే అవకాసం ఉంది. రజనీకాంత్ కు రానా కు మధ్య పిల్లి, ఎలుక ఆటలాగ గేమ్ జరుగుతూంటుంది. ఫైనల్ గా రానా ని రజనీకాంత్ పట్టుకోవటం కథాంశమే అయినా అసలు పట్టుకోగలుగుతాడా లేదా అన్న స్దాయిలో వారిద్దరి మధ్యా కథ నడుస్తుందని చెప్తున్నారు. 

57
Rani Daggubatti

Rani Daggubatti

ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని కొత్త పాత్ర‌లో అత‌డు క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. పాన్ ఇండియ‌న్ మూవీగా రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక అక్టోబర్‌లో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘వేట్టయాన్ ’. రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వేట్టయాన్‌’. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ , జీకేఎమ్‌ తమిళ కుమరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 

67


 బూటకపు ఎన్‌కౌంటర్స్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్‌  ఓ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. 'వేట్టయాన్' సినిమాలో రజనీకాంత్ స్నేహితుడు, బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. మూడు దశాబ్దాల తర్వాత వాళ్లిద్దరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందు 'అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్' వంటి సినిమాల్లో రజనీ, అమితాబ్ కలిసి నటించారు. అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, దుషార విజయన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వేట్టయాన్ ’ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకుడు. 

77


'జైలర్' తర్వాత పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' చేశారు రజని. అయితే, ఆ సినిమాలో ఆయనది అతిథి పాత్ర. మూవీ కూడా హిట్ కాలేదు. ఫ్లాప్ అని తేల్చారు. కలెక్షన్స్ కూడా రాలేదు. అందుకని, ఆయన ఫుల్ లెంగ్త్ హీరోగా రజనీకాంత్ మళ్లీ వస్తే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved