- Home
- Entertainment
- మరోసారి రమ్యకృష్ణ విశ్వరూపం.. మీమ్స్ తో హోరెత్తిస్తున్న నెటిజన్లు.. శివగామినా మజాకా !
మరోసారి రమ్యకృష్ణ విశ్వరూపం.. మీమ్స్ తో హోరెత్తిస్తున్న నెటిజన్లు.. శివగామినా మజాకా !
విజయ్ దేవరకొండ నటించిన ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ట్విట్టర్ లో అయితే ఈ చిత్రం గురించి పోస్ట్ లు , మీమ్స్ మోతెక్కిపోతున్నాయి.

విజయ్ దేవరకొండ నటించిన ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ట్విట్టర్ లో అయితే ఈ చిత్రం గురించి పోస్ట్ లు , మీమ్స్ మోతెక్కిపోతున్నాయి. అంతలా లైగర్ మ్యానియా వ్యాపించింది. పూరి జగన్నాధ్ కంప్లీట్ గా విజయ్ దేవరకొండ మేకోవర్ మార్చేశారు.
నత్తి ఉన్న బాక్సర్ లా విజయ్ అదరగొడుతున్నాడు. లైగర్ ట్రైలర్ లో విజయ్ పెర్ఫామెన్స్, యక్షన్ గురించి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా విజయ్ తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణ కూడా ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచారు. విజయ్ కంటే, ట్రైలర్ అందరి కంటే రమ్య కృష్ణ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది అంటూ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.
లైగర్ ట్రైలర్ లో శివగామి సత్తా కనిపించిందని.. ఆమె కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నారు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. రమ్య కృష్ణ విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో మాస్ పెర్ఫామెన్స్ అందించింది. పూరి జగన్నాధ్ సినిమాల్లో తల్లి పాత్రలో ఇదే తరహాలో ఉంటాయి.
చిన్న పిల్లలు విజయ్ దేవరకొండని ఇష్టపడతారు.. యువత అనన్య పాండేని.. కానీ లెజెండ్స్ రమ్య కృష్ణ ని ఇష్టపడతారు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్.. తాను విజయ్ దేవరకొండ కంటే రమ్య కృష్ణ పాత్ర కోసమే ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నాడు.
సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ మాఫియా లేడి రమ్య కృష్ణ. లైగర్ ట్రైలర్ లో ఆమె పెర్ఫామెన్స్ మంటలు పుట్టించే విధంగా ఉంది అని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. ఒక మాస్ లేడి తరహాలో రమ్య కృష్ణ ట్రైలర్ రెచ్చిపోయింది. తల్లి కొడుకుల మధ్య సినిమాలో సెంటిమెంట్ కూడా బలంగా ఉండబోతోంది.
అయితే లైగర్ ట్రైలర్ ని గమనిస్తే.. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలోని షేడ్స్ కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆ చిత్రం కూడా బాక్సింగ్, లవ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీనే.