- Home
- Entertainment
- బాహుబలి ఫస్ట్ డే బ్యాడ్ టాక్, దగ్గరుండి చూసిన రమ్యకృష్ణ .. ఆ విషయంలో రాజమౌళిని మించిన తోపు లేరు
బాహుబలి ఫస్ట్ డే బ్యాడ్ టాక్, దగ్గరుండి చూసిన రమ్యకృష్ణ .. ఆ విషయంలో రాజమౌళిని మించిన తోపు లేరు
బాహుబలి 1 చిత్రానికి మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ గురించి రమ్యకృష్ణ మాట్లాడారు. ఆ రోజు శోభు, రాజమౌళి ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారో రమ్యకృష్ణ వివరించారు.

బాహుబలి ది ఎపిక్
దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం బాహుబలి రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31న రీ రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి టైటిల్ బాహుబలి ది ఎపిక్ అని పెట్టారు. బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతుండడంతో మరోసారి ప్రభాస్ అభిమానులు బాహుబలి విశేషాలు గుర్తు చేసుకుంటున్నారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన, భల్లాల దేవుడిగా రానా విలనిజం, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ రాజసం ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి.
జగపతి బాబుతో రమ్యకృష్ణ
రమ్యకృష్ణ రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో రమ్యకృష్ణ బాహుబలి జర్నీ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్రని మీరు చేశారు కదా అని జగపతి బాబు ప్రశ్నించారు. దీనికి రమ్యకృష్ణ బదులిస్తూ.. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. శ్రీదేవి రిజెక్ట్ చేసిన సంగతి నాకు తెలియదు. నాకు అవకాశం వచ్చింది నేను చేశా అని రమ్యకృష్ణ అన్నారు.
ముందుగా బాహుబలికి ఒప్పుకోలేదు
ఈ మూవీలో నాకు అవకాశం వచ్చే సమయానికి నా కొడుకు వయసు 6 ఏళ్ళు మాత్రమే. మీ కాల్ షీట్స్ 45 రోజులు కావాలి అని శోభుగారు అడిగారు. వామ్మో 45 రోజులా నాకు కుదరదు అని చెప్పా. అప్పటికి బాహుబలి ఎంత పెద్ద సినిమా, ఏ రేంజ్ లో తీస్తున్నారు, పాన్ ఇండియా అంటే ఏంటి ఇలాంటి విషయాలేవీ నాకు తెలియదు. ఏదో నార్మల్ మూవీనే అని అనుకున్నా. కానీ రాజమౌళి గారు నెరేషన్ ఇచ్చాక అర్థం అయింది.
ఆ విషయంలో రాజమౌళి కంటే తోపు లేరు
శోభుగారు వచ్చి డేట్స్ ఆడినప్పుడు నా కొడుకుని వదిలి అన్ని రోజులు ఉండాలంటే కుదరదని చెప్పేశాను. ఆ తర్వాత రాజమౌళి గారు కథ చెప్పారు. రాజమౌళి గారి స్టోరీ నెరేషన్ లో ఆయన బీట్ చేసేవారెవరూ లేరు అని రమ్యకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఇక బాహుబలి 1 రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే టాక్ చూసి చాలా డిప్రెసింగ్ గా అనిపించింది.
బాహుబలి నెగిటివ్ టాక్ పై రమ్యకృష్ణ
ఎక్కడ చూసినా నెగిటివ్ టాక్ వస్తోంది. నేను దగ్గరుండి చూశాను. కానీ శోభు గారు, రాజమౌళి గారు ఒక రాక్ లాగా నిలబడిపోయారు. మేమెంత కలిసి సినిమా చూశాం. ఇంత అద్భుతంగా ఉంది నెగిటివ్ టాక్ ఎందుకు వస్తోంది అనేది అర్థం కాలేదు అని రమ్య కృష్ణ తెలిపారు. దీనిపై శోభు స్పందించారు. ఆయన కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శోభు మాట్లాడుతూ.. సినిమాని ఒక ఇంటర్వెల్ లాగా ఎండ్ చేయడం అనేది అప్పటికి చాలా కొత్త. దీనితో ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. దానివల్లే నెగిటివ్ టాక్ వచ్చింది అని అన్నారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ ఆరోజు నైట్ షోల నుంచి నెగిటివ్ టాక్ మొత్తం పోయి యునానిమస్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది అని అన్నారు.