- Home
- Entertainment
- ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. అసలైన మజా అందించే సూపర్ హీరో మూవీ కోసమే అంతా వెయిటింగ్
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు.. అసలైన మజా అందించే సూపర్ హీరో మూవీ కోసమే అంతా వెయిటింగ్
This Week OTT Releases: ఈ వారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో 12 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. యాక్షన్, హారర్, డ్రామా, ఫాంటసీ జానర్లలో ప్రేక్షకులకు మంచి వినోదం ఉండబోతోంది.

This Week OTT Releases
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రేక్షకులకు అసలైన వినోదం అందబోతోంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే వంటి ప్లాట్‌ఫారమ్‌లు యాక్షన్, హారర్, డ్రామా, ఫాంటసీ వంటి విభిన్న జానర్లలో 12 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విడుదల చేయనున్నాయి.
నెట్ ఫ్లిక్స్
ది విచర్ సీజన్ 4
హెన్రీ కేవిల్ స్థానంలో లియామ్ హేమ్స్‌వర్త్ రివియా గెరాల్ట్‌గా నటించిన ఈ సీజన్ “బాప్టిజం ఆఫ్ ఫైర్” నవల ఆధారంగా తెరకెక్కింది. గెరాల్ట్, సిరీ, యెన్నిఫర్ ల మధ్య సాగే సంఘర్షణ, మంత్ర శక్తులు, రాజకీయం ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణ.
విడుదల తేదీ : అక్టోబర్ 30
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
బాలాద్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్
కోలిన్ ఫరెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మకావ్ క్యాసినోల్లో సాగే ఒక గ్యాంబ్లింగ్ థ్రిల్లర్. ఒక ఐరిష్ కాన్ ఆర్టిస్ట్ జీవితంలో జరిగే మానసిక, ఆధ్యాత్మిక పోరాటం కథాంశం.
విడుదల తేదీ : అక్టోబర్ 29
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
ఇడ్లీ కడై
తమిళ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం కుటుంబ విలువలు, వారసత్వం, కులతత్వం, వ్యాపార ధోరణులను చూపిస్తుంది. తండ్రి వారసత్వమైన ఐడ్లీ షాప్‌ను కాపాడే యువకుడి కథ ఇది. ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విడుదల తేదీ : అక్టోబర్ 29
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
ప్రైమ్ వీడియో
బాఘీ 4
టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రోనీ అనే కమాండో తన ప్రేమికురాలు అలీషా కోసం చేసే ప్రాణాంతక పోరాట కథ. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు.
విడుదల తేదీ : అక్టోబర్ 31
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
హెడ్డా
టెస్సా థాంప్సన్ ప్రధాన పాత్రలో, హెన్రిక్ ఇబ్సెన్ రాసిన ‘హెడ్డా గాబ్లర్’ నాటకానికి ఆధునిక రూపం ఇది. 1950ల ఇంగ్లాండ్‌లో సాగే ఒక యువతి ఆత్మవిమర్శ కథ.
విడుదల తేదీ : అక్టోబర్ 29
ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
ది హోమ్
పీట్ డేవిడ్సన్ నటించిన ఈ సైకలాజికల్ హారర్‌లో ఒక యువకుడు రిటైర్మెంట్ హోమ్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తాడు. అక్కడ దాగి ఉన్న కల్ట్ రహస్యాలు కథలో కీలకం. విడుదల తేదీ : అక్టోబర్ 31ఎక్కడ చూడాలి : ప్రైమ్ వీడియో
జీ 5
బై తుఝ్యాపాయి
మరాఠీ సిరీస్‌గా రూపొందిన ఈ కథ 1990ల కాలం నేపథ్యంగా అహిల్య అనే యువతి విద్య కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. మహిళల స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇచ్చే కథాంశంతో రూపొందింది.
విడుదల తేదీ : అక్టోబర్ 31
ఎక్కడ చూడాలి : జీ 5
మారిగళ్ళు
కన్నడ పురాణ కథల ఆధారంగా రూపొందిన ఈ మిస్టరీ సిరీస్‌లో నిధి కోసం వెళ్ళిన స్నేహితుల గుంపు దైవశాపానికి గురవుతుంది. భయానక, ఆధ్యాత్మిక అంశాలు మిళితమై ఉంటాయి. విడుదల తేదీ : అక్టోబర్ 31ఎక్కడ చూడాలి : జీ 5
జియో హాట్ స్టార్
IT: వెల్‌కమ్ టు డెర్రీ
ప్రముఖ హారర్ చిత్రం “IT”కి ఇది ప్రీక్వెల్. 1962లో డెర్రీ పట్టణంలో పెన్నీవైజ్ భయానక మూలాలు, ఆ నగరంలోని సామాజిక భయాలు కథాంశం.
విడుదల తేదీ : అక్టోబర్ 27
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
లోకా చాప్టర్ 1: చంద్ర
సూపర్‌హీరో మరియు ఫోక్‌లోర్ కలయికలో తెరకెక్కిన ఈ సిరీస్ “లోకహ్ సినెమాటిక్ యూనివర్స్”కు ఆరంభం. యక్షిణి చంద్ర పాత్ర చుట్టూ మిస్టరీ, యాక్షన్ సన్నివేశాలు సాగుతాయి.
విడుదల తేదీ : అక్టోబర్ 31
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
మేగన్ 2.0
రొబోటిక్ థ్రిల్లర్ “మేగన్”కు ఇది సీక్వెల్. కొత్త హ్యూమనాయిడ్ వెపన్ AMELIAతో మేగన్ పోరాటం సాంకేతిక హారర్ అభిమానులను ఆకట్టుకోనుంది.
విడుదల తేదీ : అక్టోబర్ 27
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
లయన్స్‌గేట్ ప్లే
టోర్నాడో
1790ల బ్రిటిష్ హైలాండ్స్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ డ్రామాలో ఒక జపనీస్ యువతి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కథ. సమురాయ్ శిక్షణ, ప్రతీకార యాత్ర ప్రధానాంశాలు గా ఈ చిత్రం రూపొందింది.
విడుదల తేదీ : అక్టోబర్ 31
ఎక్కడ చూడాలి : లయన్స్‌గేట్ ప్లే