MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • భర్తతో విడాకులపై రంభ కౌంటర్‌.. గొడవంతా ఆ విషయంలోనే, తెరవెనుక ఇంత జరిగిందా?

భర్తతో విడాకులపై రంభ కౌంటర్‌.. గొడవంతా ఆ విషయంలోనే, తెరవెనుక ఇంత జరిగిందా?

ఒకప్పుడు టాలీవుడ్‌ని ఊపేసిన నటి రంభ తన భర్తతో విడిపోతున్నారనే రూమర్స్ ఆ మధ్య వినిపించాయి. అయితే దీనిపై ఆమె స్పందిస్తూ అసలు విషయాన్ని రివీల్‌ చేసింది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 22 2024, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రంభ ఒకప్పుడు గ్లామర్‌ క్వీన్‌గా టాలీవుడ్‌ని ఊపేస్తుంది. తెలుగులోనే కాదు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. గ్లామర్‌ పాత్రలతోపాటు ఐటెమ్‌ సాంగ్స్ కూడా చేసి ఆద్యంతం కనువిందు చేసింది. కుర్రకారుకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. రంభ సినిమాలో ఉందంటే మాస్‌ ఆడియెన్స్ కి, కుర్రాళ్లకి పండగ అనే చెప్పాలి. అంతగా తన గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చి అభిమానులుగా చేసుకుంది రంభ. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇండస్ట్రీలో ఆమె ఉన్నది చాలా తక్కువ టైమే. కరెక్ట్ గా పదేళ్లు ఉంది. ఆ తర్వాత రెండు మూడేళ్లు అడపాదడపా సినిమాల్లో మెరిసింది. ఈ స్పాన్‌లోనే ఆమె వందకుపైగా సినిమాలు చేయడం విశేషం. అంటే ఏడాదికి పది సినిమాల లెక్కన ఆడియెన్స్ పై దండయాత్ర చేసింది. ఎక్కడ చూసినా ఈ అమ్మడు నటించిన సినిమాలే విడుదలయ్యేవంటే అతిశయోక్తి కాదు. కృష్ణ, చిరంజీవి నుంచి అప్పటి యంగ్‌ హీరోలు ఎన్టీఆర్‌తోనూ ఆడిపాడింది. ఓ దశాబ్దం పాటు ఓ ఊపు ఊపేసింది. 

36

2010లో ఆమె మ్యారేజ్‌ చేసుకుంది. కెనడాలో సెటిల్‌ అయిన శ్రీలంక తమిళ్‌ బిజినెస్‌ మేన్‌ ఇంద్ర కుమార్‌ పథ్మనాభన్‌ని వివాహం చేసుకుంది. ఆమెకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు జన్మించారు. దాదాపు 14ఏళ్లుగా హ్యాపీ లైఫ్‌ ని అనుభవిస్తుంది. అయితే రంభ తన భర్తతో విడిపోతున్నట్టు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. విడాకులు తీసుకుంటున్నట్టు రూమర్లు వచ్చిన నేపథ్యంలో దీనిపై రంభ స్పందించింది. స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది.
 

46

తాను విడాకులు తీసుకుంటున్నట్టు వచ్చిన రూమర్లపై ఆమె స్పందిస్తూ, ఈ వార్తలు ఎంతో బాధ కలిగించాయని తెలిపింది. దారుణంగా రాస్తున్నారని, తన గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇలా రాస్తారా అని బాధేసిందని తెలిపింది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము అన్ని రకాలుగా హ్యాపీగానే ఉన్నామని తెలిపింది.

మ్యారేజ్‌ లైఫ్‌ హ్యాపీగానే సాగుతుందని చెప్పింది రంభ. అయితే ఈ సందర్భంగానే అసలు విషయం రివీల్‌ చేసింది. ఈ రూమర్స్ కి కారణమేంటో తెలిపింది. అందరు ఫ్యామిలీలో జరిగినట్టే తమ ఫ్యామిలీలోనూ గొడవలు జరుగుతాయని, అయితే అవి విడిపోయేంత పెద్దవి కావని చెప్పింది. వాటిని బూతద్దంలో పెట్టి చూడొద్దని పేర్కొంది. 
 

56

తమ పిల్లలను ఇండియాలో పెంచాలని తాను అనుకుంటున్నానని, కానీ ఆయన నార్త్ అమెరికాలోనే పెంచుతా అని అంటున్నాడు. ఈ విషయంలో తమ మధ్య గొడవ వచ్చిందట. `నా ఉద్దేశ్యమేంటంటే నా పిల్లలు మన కల్చర్‌ తెలుసుకోవాలి, మన కల్చర్‌లో పెరగాలి, మన కట్టుబాట్లు, సాంప్రదాయాలను గౌరవించేలా పెంచాలని కోరుకుంటాను.

కానీ ఆయన వాళ్లు నా బిడ్డలే కదా, నాకు నచ్చినట్టుగానే పెరగాలి అని ఆయన కోరుకుంటారు. ఈ విషయంలోనే కొంత డిస్కషన్‌ జరుగుతుంటుంది. అంతే తప్ప అవి పెద్ద గొడవలు కావు` అని పేర్కొంది రంభ. 
 

66

ఇదిలా ఉంటే వీరి విడాకులకు సంబంధించిన మరో రూమర్‌ కూడా ఉంది. ఈ ఇద్దరు ఫ్యామిలీ కోర్ట్ వరకు వెళ్లారని తెలిసింది. రంభ తాను ఇండియా వెళ్లిపోతానని చెప్పిందని, పిల్లల పోషణతో పాటు ఇతర ఖర్చులకు తనకు నెలకు  ఐదు లక్షల రూపాయలు భరణంగా  ఇవ్వాలని కూడా  డిమాండ్‌ చేస్తూ కోర్ట్ లో పిటీషన్ వేసిందని సమాచారం. ఈ విషయం తెలిసిందే.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ గొడవని సెటిల్ చేశారట. రంభకు రాఘవేంద్రుడు హితబోద చేసినట్టు తెలుస్తోంది. భర్తకు దూరమైతే  సమాజంలో ఎలాంటిఇబ్బందుల వస్తాయి. అని చెప్పడంతో పిల్లల పోషణకు ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పడంతో .. ఆమె మెత్తపడిందట. అంతే కాదు  చిన్నచిన్న విభేదాలకు పంతాలకు పోకూడదని రాఘవేంద్రరావు చేసిన సూచనలతో రంభ తిరిగి భర్తతో కాపురం చేసేందుకు ఒప్పుకుందట.

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే రంభ మాత్రం దీన్ని చిన్నగొడవగానే చెప్పడం విశేషం. కొన్నాళ్ల క్రితం టీవీ9తో జరిపిన చిట్‌ చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది రంభ. ఈ పాత చిట్‌ చాట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుండటం గమనార్హం. 

Read more: `ఈశ్వర్‌` సినిమాని మొదట ఏ హీరోతో చేయాలనుకున్నారో తెలుసా? ప్రభాస్‌ ని కూడా కాదని మరో హీరోకి

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved