MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రమ్యకృష్ణ అంటే భయం, సౌందర్య, త్రిష ఇష్టం.. కానీ ఆ హీరోయిన్లకి యాటిట్యూడ్‌ ఉంటుంది.. రంభ కామెంట్స్ వైరల్

రమ్యకృష్ణ అంటే భయం, సౌందర్య, త్రిష ఇష్టం.. కానీ ఆ హీరోయిన్లకి యాటిట్యూడ్‌ ఉంటుంది.. రంభ కామెంట్స్ వైరల్

ఒకప్పటి గ్లామర్‌ బ్యూటీ రంభ.. ఇప్పటికీ తన స్పెషల్‌ సాంగ్‌లతో, గ్లామర్‌ పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే ఆమె హీరోయిన్లపై హాట్‌ కామెంట్‌ చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 29 2024, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గ్లామర్‌ బ్యూటీ సౌత్‌, నార్త్ ఇండస్ట్రీలను ఊపేసిన నటి రంభ. ఆమె సినిమాల్లో గ్లామర్‌ పాత్రలే కాదు, ఐటెమ్స్ సాంగ్స్ ల్లోనూ దుమ్మురేపింది. ఒకప్పుడు ఆయా పాటలకు స్పెషల్‌ క్రేజ్‌ని తీసుకొచ్చింది రంభ. పదేళ్ల పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఇదిలా ఉంటే రంభ.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ హీరోయిన్లకి యాటిట్యూడ్‌ ఉంటుందని, చూసినా చూడనట్టు వెళ్లిపోతారని చెప్పి షాకిచ్చింది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ, సౌందర్యలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య అని చెప్పింది. అప్పట్లో ఫ్రెండ్‌గా ఉన్న వారిలో ఆమెనే క్లోజ్‌గా ఉండేదని, సౌందర్య అంటే తనకు ఇష్టమని చెప్పింది. అలాగే మహేశ్వరీ కూడా తనకు మంచిస్నేహితురాలు అని చెప్పింది. 
 

35

మరీ క్లోజ్‌ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరని, ఉన్న వారిలో వీరితోనే క్లోజ్‌గా మూవ్ అవుతానని పేర్కొంది రంభ. మరోవైపు నటనలో పోటీగా భావించింది ఎవరిని అంటే.. రమ్యకృష్ణ పేరు చెప్పింది రంభ. ఆమెతో సినిమా చేస్తుంటే చాలా భయంగా ఉంటుందని, ఆమె ఎలాంటి సీన్‌ అయినా, డైలాగ్‌ అని ఇట్టే చెసేస్తుంది. ఆమెతో పోల్చితే జూనియర్‌ కావడంతో రమ్యకృష్ణ ముందు నటించాలంటే భయంగా అనిపించేదని చెప్పింది రంభ. 
 

45
actress trisha

actress trisha

ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరంటే ఇష్టమనే ప్రశ్న ఎదురైంది. నయనతార, త్రిష, ఇలియానా, కాజల్‌ పేర్లు చెప్పగా, త్రిష అంటే ఇష్టమని చెప్పింది. ఆమెని రెండు మూడు సార్లు కలిశాను అని, చాలా ఎఫెక్షన్‌తో మాట్లాడుతుందని చెప్పింది రంభ. కానీ మిగిలిన వాళ్లు అలా ఉండరు. కనిపించినా, చూడనట్టుగా వెళ్లిపోతారని వెల్లడించింది రంభ. 

55

రంభ 1992లో `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. రాజేంద్రప్రసాద్‌ సరసన నటించింది. `ఏవండి ఆవిడ వచ్చింది`, `తొలి ముద్దు`, `రౌడీ అన్నయ్య`, `ముద్దుల ప్రియుడు`, `అల్లరి ప్రేమికుడు`, `అల్లుడా మజాకా`, `బొంబాయి ప్రియుడు`, `హిట్లర్‌`, `గణేష్‌`, `బావగారు బాగున్నారా?` వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది రంభ. ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్ తో ఊపేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా విదేశాల్లో పిల్లలు, ఫ్యామిలీకే పరిమితయ్యింది. అడపాదడపా సోషల్‌ మీడియాలో ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది రంభ.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved