- Home
- Entertainment
- Ramarao On Duty: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'కి కళ్ళు చెదిరే ఓటిటి డీల్.. నిర్మాతలు ఆ సాహసం చేస్తారా
Ramarao On Duty: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'కి కళ్ళు చెదిరే ఓటిటి డీల్.. నిర్మాతలు ఆ సాహసం చేస్తారా
మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్నాడు.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది.
తొలి షో నుంచి రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదని క్రిటిక్స్, ప్రేక్షకులు చెబుతున్నారు. గత ఏడాది క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఆ సక్సెస్ ని కొనసాగించలేకపోయాడు. ఈ ఏడాది విడుదలైన ఖిలాడీ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలు కావడంతో వసూళ్లపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది.
దీనితో మేకర్స్ ఓటిటి డీల్స్ షురూ చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు సోని లివ్ సంస్థ కళ్ళు చెదిరే అమౌంట్ తో రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి ఓటిటి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ దాదాపు 12 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది మంచి డీల్ అనే చెప్పాలి. అయితే ఇంకా సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
సినిమాని త్వరగా ఓటిటిలో రిలీజ్ చేస్తేనే మంచి ఆఫర్ దక్కుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటిటి రిలీజ్ లపై కూడా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలని వీలైనంత ఆలస్యంగా ఓటిటిలో రిలీజ్ చేస్తేనే థియేటర్ వ్యవస్థ నిలబడుతుందని కొందరు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
స్టార్ హీరోల చిత్రాలని ఇంకా ఆలస్యంగా ఓటిటి కి ఇవ్వాలని భావిస్తున్నారు. రవితేజ కూడా స్టార్ హీరోనే. ఈ నేపథ్యంలో రామారావు చిత్రాన్ని నెల లోపే ఓటిటిలోకి తీసుకువస్తారా లేక నాలుగు వారాలు ఎదురుచూస్తారా అనేది త్వరలో తేలనుంది.
ఓవరాల్ గా సోని లివ్ సంస్థ రామారావు చిత్రంపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శరత్ మండవ సిద్ధం చేసిన కమర్షియల్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో అంతగా వర్కౌట్ కాలేదు అని అంటున్నారు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న మరో చిత్రం ధమాకా. ఈ చిత్రంలో అయినా మాస్ మహారాజ తగినంత జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో చూడాలి.