- Home
- Entertainment
- RamaRao on Duty Review: `రామారావు ఆన్ డ్యూటీ` ట్విట్టర్ రివ్యూ.. రవితేజ ఈసారైనా హిట్ కొట్టాడా?
RamaRao on Duty Review: `రామారావు ఆన్ డ్యూటీ` ట్విట్టర్ రివ్యూ.. రవితేజ ఈసారైనా హిట్ కొట్టాడా?
`ఖిలాడీ` వంటి పరాజయం తర్వాత మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ రూపొందించిన ఈచిత్రం నేడు శుక్రవారం(జులై 29)న విడుదలైంది. సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

రవితేజ అంటే మాస్‌కి కేరాఫ్. అందుకే ఆయనకు మాస్ మహారాజా అనే బిరుదుని కూడా పెట్టారు అభిమానులు. అందుకు తగ్గట్టే మాస్, ఎనర్జిటిక్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే చేస్తుంటారు. ఊరమాస్ అంశాలతో వెండితెరపై రచ్చ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటారు రవితేజ. కానీ ఇటీవల ఆయన సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోతున్నాయి. వరుస పరాజయాల అనంతరం `క్రాక్`తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజకి `ఖిలాడీ`తో దెబ్బ పడింది. Ramarao on Duty Twitter Review.
ఇప్పుడు తన స్టయిల్‌ని పక్కన పెట్టి, తన ఎనర్జీని కంట్రోల్ చేసుకుంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన `రామారావు ఆన్ డ్యూటీ` సినిమా చేశారు రవితేజ. అప్‌కమింగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(జులై 29)న విడుదలైంది. అంతకంటే ముందే చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. మరి సినిమా ఎలా ఉందనేది నెటిజన్లు ఏం చెబుతున్నారనేది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. Ramarao on Duty Twitter Review.
కథ పరంగా చూస్తే, ఈ చిత్రం 1995లో ప్రారంభమవుతుందని, అక్కడ రామారావు(రవితేజ) సబ్ కలెక్టర్‌గా పనిచేస్తుంటాడని తెలుస్తుంది. చట్టానికి లోబడి, న్యాయం కోసం నిలబడే నికార్సయిన ఆఫీసర్‌గా ఉంటాడు. కొన్ని అడ్డంకుల వల్ల అతను తన జాబ్ కోల్పోయి సొంత ఊరికి ఎమ్మార్వోగా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కొంత మంది ఊరి ప్రజలు తప్పిపోయారని తెలుసుకున్న రామారావు ఈ మిస్సింగ్ కేసుని ఛేదించడం, ఈ క్రమంలో ఆయన బయటకు తీసిన సంచలన విషయాలేంటి? వాటికి ఎలా అడ్డుకట్ట వేశారనేది ఈ చిత్ర కథగా ఉంటుందని తెలుస్తుంది. Ramarao on Duty Twitter Review.
రెండు గంటల 26 నిమిషాల నిడివితో ప్రారంభమైన `రామారావు ఆన్ డ్యూటీ` సినిమాకి యావరేజ్ టాక్ వస్తుంది. రవితేజ స్టయిల్‌లోనే ఉందని, ఫస్టాఫ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా వరకు ఫిల్లర్ లాంటిసీన్లు ఉన్నాయని, సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నాయంటున్నారు. రవితేజ నటన అదిరిపోయిందట. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ బిజీఎం ఇరగదీశారని తెలుస్తుంది. మొదటి భాగం యావరేజ్‌గా ఉందని అంటున్నారు నెటిజన్లు. Ramarao on Duty Twitter Review.
అయితే ఇంట్రడక్షన్ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించడం లేదంటున్నారు. ఎమోషన్స్ సీన్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయని, ఏమాత్రం పండలేదనే టాక్ ఉంది. సినిమాలో థ్రిల్లర్ పార్ట్ చాలా ఉందని చెబుతున్నారు. స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్ చాలా వీక్‌గా ఉందని ఆడియెన్స్ ట్వీట్లు చేస్తున్నారు. Ramarao on Duty Twitter Review.
మరోవైపు రవితేజ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారట. మాస్ జాతర అదిరిపోయిందంటున్నారు. ఇంటర్వెల్ బ్యాండ్ మైండ్ బ్లోయింగ్ అని, రవితేజ లుక్ కూల్‌గా, చాలా కొత్తగా ఉందని, అదే సమయంలో స్టయిలీష్‌గా ఉందని అంటున్నారు. థ్రిల్లర్ ర్యాంపేజ్ ఉత్కంఠని గురి చేస్తుందట. చివరి 25 నిమిషాలు సూపర్‌గా ఉందని, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలతో పోల్చితే చాలా బెటర్ అని అంటున్నారు. యాక్షన్ సీన్లు బాగున్నాయని తెలుస్తుంది. రవితేజ తన మార్క్ యాక్షన్ అదరగొట్టారట. దర్శకుడు ఈ చిత్రంలో టాప్ లీగ్‌లోకి వెళ్లడం ఖాయమంటున్నారు. రవితేజకి మరో బ్లాక్ బస్టర్ అంటున్నారు. Ramarao on Duty Twitter Review.
అదే సమయంలో ఓవరాల్‌గా కాస్త మిక్స్డ్ టాక్ వస్తుంది. రవితేజ నుంచి ఊహించే సినిమా కాదని, ఆయన్ని పూర్తిగా ఆవిష్కరించలేదనే కామెంట్లు కూడా ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి వస్తుంది. ఎక్స్ క్యూషన్ చాలా లో గా ఉందని అంటున్నారు. మరి ఇది పూర్తిగా ఓవర్సీస్ ఆడియెన్స్ అభిప్రాయం. పూర్తి `ఏషియానెట్` రివ్యూ కోసం వేచి చూడండి.