- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ సినిమాలో పాట రాసినందుకు లిరిసిస్ట్ ని తిట్టేసిన లెజెండ్.. సీరియస్ వార్నింగ్ ఎందుకంటే..
పవన్ కళ్యాణ్ సినిమాలో పాట రాసినందుకు లిరిసిస్ట్ ని తిట్టేసిన లెజెండ్.. సీరియస్ వార్నింగ్ ఎందుకంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ చిత్రాల్లో కూడా కొన్ని ఆయన అభిమానులకు నచ్చుతాయి. అలాంటి చిత్రాల్లో పంజా కూడా ఉంటుంది. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ పవన్ ని ఈ చిత్రంలో సూపర్ స్టైలిష్ గా చూపించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ చిత్రాల్లో కూడా కొన్ని ఆయన అభిమానులకు నచ్చుతాయి. అలాంటి చిత్రాల్లో పంజా కూడా ఉంటుంది. తమిళ డైరెక్టర్ విష్ణువర్ధన్ పవన్ ని ఈ చిత్రంలో సూపర్ స్టైలిష్ గా చూపించారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ కొందరు అభిమానులు ఈ చిత్రాన్ని ఇష్టపడుతుంటారు.
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ పాటల విషయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లిరిసిస్ట్ లలో ఒకరిగా సాగుతున్న రామజోగయ్య శాస్త్రి పంజా చిత్రంలో కొన్ని పాటలు రాశారు. వెయ్ రా చెయ్ వెయ్ రా అంటూ ఐటెం సాంగ్ తరహాలో సాగే పాటని రాసింది రామజోగయ్య శాస్త్రే.
ఆ పాట చాలా స్పైసీ గా ఉంటుంది. ఐటెం సాంగ్ లాంటి పాట కావడంతో రామజోగయ్య లిరిక్స్ తో కూడా ఘాటెక్కించారు. చాలా హాట్ హాట్ గా పదాలు వాడారు. రామజోగయ్య శాస్త్రి.. లెజెండ్రీ రచయిత, లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని తన గురువుగా భావించి ఆయన్ని ఫాలో అవుతుంటారు. సిరివెన్నెల సినిమాకు అవసరమైన మసాలా సాంగ్స్ రాసేవారు. కానీ అసభ్యకరంగా ఉండే లిరిక్స్ రాసేందుకు ఆయన వ్యతిరేకం.
తన శిష్యులుగా భావించే వారు ఎవరైనా అలాంటి పాటలు రాస్తే మందలించేవారట. పంజా చిత్రంలో రామజోగయ్య రాసిన ఈ పాట సిరివెన్నెల వద్దకి వెళ్ళింది. ఆ పాట పట్ల సిరివెన్నెల చాలా సీరియస్ అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా రామజోగయ్య వివరించారు.
నా గురువు సిరివెన్నెల నన్ను పిలిచి మందలించారు. తనని ఆయన రాముడు అని పిస్తారట. రాముడు ఈ పాట ఎందుకు రాశావు అని అడిగారట. దీనికి రామజోగయ్య చెబుతూ రెండు వెర్షన్స్ రాశాను.. డైరెక్టర్ ఈ వర్షన్ ని ఎంపిక చేసుకున్నారు అని బదులిచ్చారట. ఒక దర్శకుడికి మనం రాసినదాంట్లో నుంచి ఎంపిక చేసుకునే హక్కు ఉంది.
నువ్వు ఈ విధంగా రాయడమే తప్పు. ఈ పాటని నువ్వు మరోలా రాసి ఉంటే దర్శకుడు దానినే ఎంపిక చేసుకునేవాడు. పాట ఈవిధంగా రాయాలా వద్దా అనే నిర్ణయం మనం ముందే తీసుకోవాలి. నీదే తప్పు.. నువ్వు ఆ పాట అలా రాయకుంటే డైరెక్టర్ ఎంపిక చేసుకునేవాడు కాదు కదా. ఇకపై ఈ తరహా పాటలు రాయాకు అని వార్నింగ్ ఇచ్చారట. అప్పటి నుంచి రామజోగయ్య అసభ్యకరంగా ఉన్న పాటల జోలికి వెళ్ళలేదు.