- Home
- Entertainment
- Janaki Kalaganaledu: భారసాలకు వెళ్ళేదే లేదంటూ కటువుగా చెప్పేసిన రామచంద్ర .. కుమిలిపోతున్న జానకి..?
Janaki Kalaganaledu: భారసాలకు వెళ్ళేదే లేదంటూ కటువుగా చెప్పేసిన రామచంద్ర .. కుమిలిపోతున్న జానకి..?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ పరువు గల కుటుంబం అనే కథ నేపథ్యంతో సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈరోజు ఏప్రిల్ 28 వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలో యోగి,(yogi) ఊర్మిళ బాబు బారసాల కోసం పిలవడానికి జ్ఞానాంబ ఇంటికి వస్తారు. ఇక వారిద్దరిని జ్ఞానాంబ(jnanamba )కుటుంబ దగ్గర చాలా సేపు గుమ్మం బయట నిలబెడతారు. అప్పుడు ఊర్మిళ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడే వారు ఇప్పుడు గుమ్మం బయట నిలబెట్టారు అంటే మా ఆయన చేసిన తప్పు ఎంత పెద్దదో మాకు అర్థం అవుతుంది అంటూ ఎమోషనల్ అవుతుంది.
అప్పుడు మల్లిక (mallika)అత్తయ్య గారిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించి గుడిలో అందరి ముందు జానకి రామచంద్ర లకు విడాకులు అని ప్రకటించి అవమానించారు. ఇప్పుడు మళ్లీ ఏం చేద్దామని వచ్చారు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ ఊర్మిళ (urmila)చేతిలో చంటి బిడ్డను చూసి లోపలికి రమ్మని పిలవగా ఇంతలో రామచంద్ర ఆవేశంగా అక్కడికి వచ్చి ఆగండి..ఎందుకు వచ్చారు అని అడగగా అప్పుడు యోగి బావగారు రేపు అబ్బాయి బారసాల అందుకే ఆహ్వానించడానికి వచ్చానని అంటాడు.
అప్పుడు రామచంద్ర(rama Chandra)అమ్మ తరఫున నేను అభిప్రాయం తెలియజేస్తున్నాను బాబు బారసాల కి కేవలం జానకి మాత్రమే వస్తుంది అని చెబుతాడు రామచంద్ర. అప్పుడు ఊర్మిళ (urmila)మాట్లాడుతూ నేను చేసింది తప్పే పశ్చాత్తాపంతో మీ అమ్మగారిని క్షమాపణలు కోరడానికి వచ్చాం అని అనగా అప్పుడు రామచంద్ర నేను మిమ్మల్ని క్షమించను మీ ఆయన చేసిన అవమానం నాకు ఎప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది అని అంటాడు.
అప్పుడు యోగి (yogi)మాట్లాడబోతుండగా.. అప్పుడు రామచంద్ర మా ఇంటికి వచ్చే అర్హత నీకు లేదు మళ్ళీ ఇంకొకసారి ఇలా వస్తే బాగుండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఊర్మిళ రెండు నిమిషాలు అమ్మగారితో మాట్లాడతాను అని అనగా వద్దు అంటారు రామచంద్ర(Rama chandra).ఇంతలో జ్ఞానాంబ లోపలికి రమ్మని పిలుస్తుంది.
అప్పుడు ఊర్మిళ ఒక అమ్మలా ప్రేమించడం లోనూ క్షమించడం లోను మీకు సాటి ఎవ్వరు లేరు.. మా తరఫున జరిగిన తప్పులు క్షమించి నా బిడ్డను దీవించడానికి వస్తారని ఆశతో వచ్చాను రేపు కూడా అదే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను.. మీరు కనుక రాకపోతే బాబు బారసాల జరగదు.. చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది ఊర్మిళ(urmila). మరొకవైపు జానకి వదిన అన్నలకు జరిగిన అవమానం తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది.
జానకి (janaki )అదే విషయాన్ని ఆలోచిస్తూ చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం గమనించి రామచంద్ర ఏమయింది అని అడుగుతాడు. అప్పుడు జానకి ఏమీ లేదు అని చెప్పడంతో.. మీరు ఫీజు గురించి ఆలోచిస్తున్నారు కదా నా తల తాకట్టు పెట్టైనా సరే మీ ఫీజు కడతాను అవసరం అయితే అమ్మను అడుగుతాను ఇదికాకుండా నీ మేనల్లుడు బారసాల గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఆ ఆలోచన తీసేయండి అని అంటాడు.