- Home
- Entertainment
- Janaki Kalaganaledu: కొడుకుకోడళ్ళకు పందెం పెట్టిన గోవిందరాజులు.. జానకి చదువు గురించి తెలుసుకున్న జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: కొడుకుకోడళ్ళకు పందెం పెట్టిన గోవిందరాజులు.. జానకి చదువు గురించి తెలుసుకున్న జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి కుటుంబ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జూలై 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో.. కింద పడిపోతున్న జానకి (Janaki) ని రామ కాపాడుతాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక రామ (Rama) జానకి కి ఏమైనా జరిగితే ఉండలేను అన్నట్లుగా మాట్లాడుతాడు. దాంతో గోవిందరాజులు రామ ఉన్నాక జానకికి ఏమి కాదు అని ధైర్యం ఇస్తాడు.
ఇక విష్ణు (Vishnu) మల్లికతో ఇదంతా నువ్వే చేసావ్ ఏమో అని అనుమానం వస్తుంది అనటంతో వెంటనే మల్లిక (Mallika) నేను చేయలేదు అంటూ తప్పించుకుంటుంది. గోవిందరాజులు మాత్రం జానకి చేతిలో ఉన్న విత్తనాలు కూడా కింద పడిపోలేదు అంటూ పొగుడుతాడు.
ఆ తర్వాత గోవిందరాజులు తన కొడుకు కోడళ్ళకి ఒక పందెం పెడుతాడు. ఇక ఆ పందెంలో జానకి (Janaki), రామ గెలవటంతో మల్లిక (Mallika) మాత్రం ఓడిపోయినందుకు బాగా బాధపడుతుంది. ఆ సమయంలో విష్ణు మల్లికపై తెగ కౌంటర్లు వేస్తూ ఉంటాడు.
జ్ఞానంబ (Jnanamba) ఇద్దరు గెలిచారు అని ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత అక్కడికి జానకి అసైన్మెంట్ అందించిన క్లర్క్ జానకి (Janaki) ని చూసి వస్తాడు. పెళ్లయినాక కూడా తనను చదివించడానికి ముందుకు వచ్చిన తన అత్తమామలకు అభినందలు తెలిపాలని అనుకుంటాడు.
ఇక జానకి (Janaki) ఆయన ఎక్కడ నిజం బయటపెడతాడో అని ఎవరికీ అర్థం కాకుండా ఇంగ్లీష్ లో చదువు గురించి ఇంట్లో వాళ్లకు తెలియదు అని చెబుతుంది. దాంతో ఆయన కూడా అర్థం చేసుకుంటాడు. మల్లిక (Mallika) కు మాత్రం బాగా అనుమానం వస్తుంది.
జానకి (Janaki) మాటలు అర్థం కానట్టుగా ఉన్నాయి అని..కానీ ఏదో విషయాన్ని దాచిపెట్టినట్లుగా అనిపిస్తుంది అని అనుకుంటుంది. జానకి ఆ క్లర్క్ తో మాట్లాడుతూ ఉండగా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కానీ మల్లిక (Mallika) కు మాత్రం బాగా అనుమానం వస్తుంది.
ఇక్కడ అఖిల్ (Akhil) లేకపోయేసరికి అఖిల్ ఎక్కడ ఉన్నాడు అని చూస్తుంది. అఖిల్ ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటుందో తెలుస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే అఖిల్ అక్కడికి వెళ్లగా వాళ్లేం మాట్లాడుకుంటున్నారు అని మల్లిక (Mallika) అడుగుతుంది.
దాంతో అఖిల్ (Akhil).. జానకి వదిన ఆయనకు థాంక్స్ చెబుతుంది అని అనటంతో ఆయన ఏమంటున్నారు అని మల్లిక ప్రశ్నిస్తుంది. ఇక ఆయన నేను చెబుతాను అంటూ తన మాటలతో కవర్ చేసి జానకిని కాపాడుతాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ సరదాగా అంతక్షరి ఆడుకుంటారు. ముందుగా జ్ఞానంబ పాట పాడుతుంది. ఆ తర్వాత జానకి (Janaki) దంపతులు కూడా పాట పాడుతూ ఉంటారు.