'స్కంద' మూవీ ఫస్ట్ రివ్యూ వైరల్.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో రామ్ పోతినేని విశ్వరూపం
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది.

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. అలాంటి హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ సలార్ చిత్రం వాయిదా పడడంతో ఆ రోజున అంటే సెప్టెంబర్ 28న స్కంద రిలీజ్ ఫిక్స్ చేశారు. రిలీజ్ కి ఇక పదిరోజుల సమయం కూడా లేదు.
ఈ క్రమంలో స్కంద ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఈ చిత్ర ఫైనల్ అవుట్ ఫుట్ గురించి వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియన్ తెలుగు ఫిలిమ్స్ అనే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న రివ్యూ ప్రకారం స్కంద చిత్రం సూపర్ హిట్ గ్యారెంటీ అని అంటున్నారు.
Ram Pothineni
ఫస్ట్ హాఫ్ లవ్ సన్నివేశాలు, కామెడీ, హీరోయిన్ తో రొమాంటిక్ మూమెంట్స్ తో నెమ్మదిగా వెళుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బోయపాటి తనదైన మాస్ ఎలిమెంట్స్ తో మంటలు పుట్టించాడట. రామ్ ఎనెర్జీ ఇంటర్వెల్ బ్లాక్ లో అదిరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. తమన్ బిజియం ఈ చిత్రాన్ని బిగ్ ప్లస్ అని అంటున్నారు.
ఇక సెకండ్ హాఫ్ లో బోయపాటి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ గా నిలిచాయి అని అంటున్నారు. చివరి 20 నిముషాలు ఆడియన్స్ లీనమైపోయే విధంగా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయట. ఈ చిత్రంలో శ్రీలీల గ్లామర్, రామ్ ఎనెర్జీని పాటల్లో చూడొచ్చు అట.
ఓవరాల్ గా స్కంద మూవీ ఏమాత్రం డిజప్పాయింట్ చేయదు అని అంటున్నారు. మరి ఈ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ఈ రివ్యూ ఎంతవరకు నిజమో అనేది చిత్రం రిలీజ్ అయ్యాకే తెలియనుంది. బోయపాటి చివరగా బాలయ్యతో అఖండ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీనితో స్కందపై భారీ అంచనాలు నెలకొన్నాయి.