MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ` బైకాట్ లైగర్‌`కి కారణం కరణ్‌ జోహారే.. బాంబ్‌ పేల్చిన వర్మ.. విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ వల్లే ఇదంతా జరిగిందా

` బైకాట్ లైగర్‌`కి కారణం కరణ్‌ జోహారే.. బాంబ్‌ పేల్చిన వర్మ.. విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ వల్లే ఇదంతా జరిగిందా

`లైగర్‌` సినిమా బాలీవుడ్‌లో బైకాట్ ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసరే దీనికి కారణమంటూ బాంబ్‌ పేల్చాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 16 2022, 08:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విజయ్‌ దేవరకొండ తొలి పాన్‌ ఇండియాచిత్రం `లైగర్‌` ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ రూపొందించిన ఈ సినిమా సినిమా ఆగస్ట్ 25న విడుదలై డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇండియా వైడ్‌గా ఎంతో ప్రమోట్‌ చేసిన ఈ సినిమా నిరాశ పర్చడంతో అంతా షాక్‌ అయ్యారు. ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వైరల్‌ అయ్యాయి. విజయ్‌ని, సినిమాని నెటిజన్లు విమర్శించారు. మీమ్స్ తో ఆడుకున్నారు. 

26

ముఖ్యంగా బాలీవుడ్‌లో `బైకాట్‌ లైగర్‌` ట్రెండ్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇటీవల వరుసగా బాలీవుడ్‌ సినిమాలను `బైకాట్‌బాలీవుడ్‌`తోపాటు హిందీ సినిమాలను  సినిమాలను బైకాట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా `లైగర్‌` కూడా దాన్ని ఫేస్‌ చేసింది. తాజాగా దీనిపై సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. బాంబ్‌ పేల్చారు. `బైకాట్‌ లైగర్‌`కి కారణం ఎవరో చెప్పేశారు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహారే దీనికి కారణమంటూ ఆయన పెద్ద బాంబ్‌ పేల్చారు. అయితే దీనికి తనదైన స్టయిల్‌లో వివరణ ఇచ్చాడు వర్మ. 
 

36

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి బాలీవుడ్‌ సినిమాలను బైకాట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ పేరుని, ఆయన సినిమాలను బైకాట్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. `లైగర్‌` సినిమాకి కరణ్‌ జోహార్‌ నిర్మాత కారణమే `బైకాట్‌ లైగర్‌`కి కారణమని తెలిపారు. కరణ్‌ జోహార్‌ సినిమా కావడంతో బాలీవుడ్‌లో దీన్ని బైకాట్‌ చేశారని వెల్లడించారు వర్మ. కరణ్‌ కారణంగానే `లైగర్‌` హిందీలో బైకాట్ కి గురయ్యిందని తెలిపారు. 
 

46

అంతేకాదు ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ యాటిట్యూట్‌పై కూడా ఆయన కామెంట్లు చేశారు. విజయ్‌ దేవరకొండ సహజంగానే అగ్రెసివ్‌గా ఉంటారని, స్టేజ్‌పై ఆయన మరింతగా అగ్రెసివ్‌గా ఉంటారని, అందరి దృష్టిని ఆకర్షించే చేష్టలు చేస్తాడని, `బైకాట్‌`కి ఆయన యాటిట్యూడ్‌ కూడా ఓ కారణం కావచ్చు అని వెల్లడించారు. ఈ సందర్భంగా  ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లపైప్రశంసలు కురిపించారు వర్మ. 
 

56

హిందీలో మన స్టార్‌ హీరోల సినిమాలు బాగా ఆడాయి. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, బన్నీ, చరణ్‌ ఎంతో అణుకువతో ఉంటారు. డౌన్‌ టూ ఎర్త్ గా బిహేవ్ చేస్తాడు. ఇలా బాలీవుడ్‌ ఆడియెన్స్ మనసులను దోచుకున్నారని, కానీ బాలీవుడ్‌ హీరోలు అగ్రెసివ్ గా ఉంటారని, విజయ్‌ దేవరకొండ కూడా అలానే ఉండటంతో వారి రిసీవ్‌ చేసుకోలేకపోయారని తెలిపారు ఆర్జీవీ. `బైకాట్‌ లైగర్‌`కిది స్టఫ్‌గా మారిందని చెప్పారు వర్మ. 
 

66

విజయ్‌ దేవరకొండ హీరో, అనన్య పాండే కథానాయిగా నటించిన `లైగర్‌` చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, వరల్డ్ మాజీ బాక్సింగ్‌ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలు పోషించారు. ఛార్మితోపాటు కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక విజయ్ కొత్త అవతారం... రిసెప్షన్‌లో డిఫరెంట్ గా మెరిసిన విరోష్ జంట,
Recommended image2
Avika Gor: కెమెరా ముందే వాంతి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
Illu Illalu Pillalu మార్చి 5 ఎపిసోడ్: వార్నింగ్ ఇచ్చి మరీ భాగ్యాన్ని పంపేసిన నర్మద, ఇకపై సాగర్‌కు ఇత్తడే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved