దీపావళి పార్టీలో మహేష్, చరణ్, ఎన్టీఆర్, వెంకీ హంగామా.. మరోవైపు వాళ్ళ భార్యలు, బన్నీ మిస్సింగ్ కానీ స్నేహ కాదు
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ అంతా ఒక్కటై వారి కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు.
దేశం మొత్తం దీపావళి పండుగ ఘనంగా జరుగుతోంది. పిల్లలు, పెద్దలు బాణాసంచా కాల్చుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులు వారి వారి స్టైల్ లో దీపావళిని సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇక సినీ తారలు దీపావళి పార్టీల సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ అంతా ఒక్కటై వారి కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు.
ఎన్టీఆర్, చరణ్, మహేష్ తరచుగా పార్టీలలో చిల్ కావడం చూస్తూనే ఉన్నాం. సందర్భం వచినప్పుడుడల్లా వీరు ముగ్గురూ ఒక్కటవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి వెంకీ మామ కూడా తోడయ్యాడు.
వెంకటేష్ మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించినప్పటి నుంచి అభిమానులకు పెద్దోడు చిన్నోడిగా మారిపోయారు. ఇక చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ భీమ్ లుగా మారారు.
సినిమాలకు అతీతంగా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. ఆ మధ్యన వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థంలో వీరంతా కలసి కనిపించారు. ఇప్పుడు దీపావళి పండుగ రావడంతో కుటుంబ సభ్యులతో కలసి హంగామా చేస్తున్నారు.
గత రాత్రి జరిగిన దీపావళి పార్టీకి సంబందించిన ఫోటోలని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్, వెంకీ జంటగా.. మహేష్, చరణ్ జంటగా ఇచ్చిన ఫోజు అదిరిపోయింది.
మరోవైపు వీరి సతీమణులు పార్టీలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీపావళి పార్టీకి భర్తలతో కలసి వీరు కూడా హాజరయ్యారు. ఈ ఫొటోల్లో నమ్రత, ఉపాసన, లక్ష్మి ప్రణతి లతో పాటు అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహని కూడా చూడొచ్చు.
పార్టీకి పుష్పరాజ్ మిస్సయినా ఆయన సతీమణి మాత్రం మిస్ కాలేదు. రాంచరణ్, ఉపాసన ఈ పార్టీని నిర్వహించి ఆతిథ్యం ఇచ్చినట్లు నమ్రత పేర్కొంది.