- Home
- Entertainment
- Ram Charan: అపర పరాక్రమవంతుడు మహారాజా సుహీల్ దేవ్ గా రాంచరణ్.. మొదలు పెట్టిన బాలీవుడ్ రచయిత
Ram Charan: అపర పరాక్రమవంతుడు మహారాజా సుహీల్ దేవ్ గా రాంచరణ్.. మొదలు పెట్టిన బాలీవుడ్ రచయిత
ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సౌత్ హీరోల హవా కొనసాగుతోంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ స్టార్ల వెంట పడుతున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సౌత్ హీరోల హవా కొనసాగుతోంది. బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ స్టార్ల వెంట పడుతున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో చాలా మంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు రాంచరణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇండియా టుడే కథనం ప్రకారం రాంచరణ్ త్వరలో హిస్టారికల్ మూవీలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో బాలీవుడ్ రచయిత అమిష్ త్రిపాఠి తాను రాసిన లెజెండ్ ఆఫ్ సుహీల్ దేవ్ నవల ఆధారంగా సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా కారణంగా ఆయన ప్లాన్స్ ఆలస్యం అయ్యాయి.
ఇప్పుడు మళ్ళీ ఆ నవలని అమిష్ బయటకు తీసినట్లు తెలుస్తోంది. చరిత్ర మరిచిన వీరుడు సుహీల్ పాత్రకు, తాను రాసుకున్న కథకి రాంచరణ్ సరిపోతాడని.. ఈ చిత్రానికి మొదటి ఆప్షన్ రాంచరణ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈమేరకు అమిష్ రాంచరణ్ ని కూడా అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. పూర్తి చర్చలు ముగిసిన తర్వాత దీనిపై క్లారిటీ రానుంది. సుహీల్ దేవ్ చరిత్రని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలనేది ఆయన ప్లాన్.
అసలు సుహీల్ దేవ్ ఎవరు ? అంటే.. సుహీల్ దేవ్ 11వ శతాబ్దానికి చెందిన మహారాజు. అఖండ భారతావనిని ఎక్కువ భాగం ఆయన పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటి ఉత్తర ప్రదేశ్ లోని బహ్ రీచ్ కేంద్రంగా ఆయన పాలన సాగింది.
కానీ కాలక్రమంలో చరిత్ర వక్రీకరించబడడం వల్ల సుహీల్ పరాక్రమం గురించి చాలా మందికి తెలియదు అని చెబుతుంటారు. ఇండియాలోకి గజినీ చక్రవర్తుల ఆక్రమణ జరగకుండా సుహీల్ ఉన్నంతవరకు అడ్డుకున్నారు. మహమ్మద్ ఆఫ్ గజినీని ఓడించారు. ఇతర రాజుల సహాయంతో మహాకాల సైన్యం ఏర్పాటు చేసి గజినీ లకు చుక్కలు చూపించిన వీరుడు సుహీల్ దేవ్.
అలాంటి వీరుడు చరిత్రని వెండితెరపై ఆవిష్కరించాలనేది రచయిత అమిష్ కోరిక. ఈ ప్రాజెక్టు తప్పకుండా కార్యరూపం దాల్చాలని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.