MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ భద్రతకి ముప్పు.. సెక్యూరిటీ పటిష్టం చేస్తున్న రాంచరణ్, నిజమెంత?

పవన్ కళ్యాణ్ భద్రతకి ముప్పు.. సెక్యూరిటీ పటిష్టం చేస్తున్న రాంచరణ్, నిజమెంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భద్రత గురించి నిన్నటి నుంచి చాలా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి కొందరు నుంచి ముప్పు ఉందని, ఆ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటూ జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భద్రత గురించి నిన్నటి నుంచి చాలా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి కొందరు నుంచి ముప్పు ఉందని, ఆ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి అంటూ జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటించిన సంగతి తెలిసిందే. 

 

26

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో పవర్ కట్ కావడం, ఆ తర్వాత హోటల్ లో జరిగిన సంఘటనల నేపథ్యంలో చాలా చర్చ జరిగింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నివాసం వద్ద అగంతకులు కొందరు కారు ఆపి అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

 

36

పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందితో వారు గొడవ పెట్టుకుని వింతగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అనుమానాస్పద వ్యక్తులు పవన్ కళ్యాణ్ కారుని ఫాలో అవుతున్నట్లు కూడా చెబుతున్నారు. దీనితో నిన్నటి నుంచి జనసేన నేతల్లో ఆందోళన నెలకొంది. పవన్ కళ్యాణ్ కి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. 

46

ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బాబాయ్ పట్ల ఎప్పుడూ అమితమైన ప్రేమతో ఉండే రాంచరణ్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ భద్రతకు ముప్పు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాంచరణ్ కంప్లీట్ గా పవన్ సెక్యూరిటీ కంట్రోల్ చేపడుతున్నట్లు టాక్. అంతే కాదు తన సెక్యూరిటీ సిబ్బందిని కూడా పవన్ ఇంటి వద్ద నియమించారట. 

56

ఈ మేరకు బలమైన వార్త జనసేన వర్గాల్లో వైరల్ అవుతోంది. జనసేన అధికార ప్రతినిధులు కూడా రాంచరణ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారట. బాబాయ్ సెక్యూరిటీ భాద్యతలు అబ్బాయి చూసుకుంటున్నాడు అంటే అభిమానులకు అంతకంటే కావలసింది ఏముంది ? అయితే దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. 

66

పవన్ ఇంటి వద్ద సంచరించిన అగంతకులని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. పవన్ సెక్యూరిటీ విషయంలో రాంచరణ్ పేరు వినిపిస్తుండడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతున్నారు. బాబాయ్, అబ్బాయ్ బాండింగ్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dacoit Collections: వీకెండ్‌లో సూపర్, మరి సోమవారం అడివి శేష్ డెకాయిట్ కలెక్షన్ రిపోర్ట్ సంగతేంటి?
Recommended image2
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image3
Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved